బస్సు క్రింద పడిన వ్యక్తిని 70 కిమీలు ఈడ్చుకెళ్లిన కెఎస్ఆర్‌టిసి బస్సు

Written By:
Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight

ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో అత్యంత భయంకరమై ఘటన ఇది. ప్రమాదవశాత్తు బస్సు క్రింద పడిన వ్యక్తిని సుమారుగా 70 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఆ తరువాత బస్సు డిక్కీ వద్ద శవం ఇరుక్కుపోయింది. తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన కెఎస్ఆర్‌టిసి బస్సులో జరిగింది.

బస్సు క్రింద పడిన వ్యక్తిని 70కిమీలు ఈడ్చుకెళ్లిన బస్సు

వివరాల్లోకి వెళితే, బస్సు క్రింద పడి క్యారేజ్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తిని సుమారుగా 70కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(KSRTC)కు చెందిన 45 ఏళ్ల వయస్సున్న డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

బస్సు క్రింద పడిన వ్యక్తిని 70కిమీలు ఈడ్చుకెళ్లిన బస్సు

ఈ ఘటన గురించి కెఎస్ఆర్‌టిసి అధికారి మాట్లాడుతూ, సాధారణంగా బస్సులు 200 నుండి 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లిన సంఘటనలు చూశాం. కానీ, బస్సు క్రింద మరణించిన వ్యక్తిని 70కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిన సంఘటన ఇదే ప్రథమం, ఇంతటి ఘోర ప్రమాదాన్ని ఇప్పటి వరకూ చూడలేదని చెప్పకొచ్చాడు.

బస్సు క్రింద పడిన వ్యక్తిని 70కిమీలు ఈడ్చుకెళ్లిన బస్సు

తమిళనాడులోని కూనూర్ నుండి బెంగళూరుకు నాన్-ఏసి స్లీపర్ బస్సును తీసుకొచ్చిన కెఎస్ఆర్‍‌టి డ్రైవర్ మొహినుద్దీన్ సిటీలోని శాంతినగర్ డిపోలో బస్సును నిలిపేసి డ్యూటి దిగిపోయాడు. అయితే, బస్సులో ఇరుక్కుపోయిన శవాన్నిశనివారం ఆలస్యంగా గుర్తించడం జరిగింది.

బస్సు క్రింద పడిన వ్యక్తిని 70కిమీలు ఈడ్చుకెళ్లిన బస్సు

పోలీసుల దర్యాప్తులో మొహినుద్దీని తెలిపిన వివరాలు మేరకు," మైసూర్-మండ్య-చెన్నపట్న రూట్‌లో బస్సును బెంగళూరుకు తీసుకొచ్చాను. బెంగళూరు 70కిమీల దూరంలో ఉన్న చెన్నపట్న వద్ద శబ్దాన్ని విన్నాను. అయితే, బస్సును రాయిని ఢీకొట్టింది అనుకున్నాని తెలిపాడు.

బస్సు క్రింద పడిన వ్యక్తిని 70కిమీలు ఈడ్చుకెళ్లిన బస్సు

అయినా కూడా, ఇరువైపులా ఉన్నా అద్దాల్లో గమనిస్తే ఏమీ కనిపించలేదు. ఏమీ జరగలేదని భావించి అలాగే డ్రైవ్ చేసుకుంటూ వచ్చానని తెలిపాడు. శనివారం తెల్లవారుజామున 2 గంటల 35 నిమిషాలకు మైసూర్ శాటిలైట్ రోడ్, ఆ తరువాత మెజిస్టి చేరుకుని అక్కడ నుండి శాంతి బస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు తెలిపాడు.

అందరూ స్పాట్‌లోనే ఛిద్రమయ్యారు

హైదరాబాద్-బెంగళూరు హైవే మీద ఘోర ప్రమాదం!!

తలక్రిందులైన టాటా నెక్సాన్: ప్రయాణికులంతా సేఫ్!!

బస్సు క్రింద పడిన వ్యక్తిని 70కిమీలు ఈడ్చుకెళ్లిన బస్సు

మొహినుద్దీన్ బస్సును పార్కింగ్ ఏరియాలో నిలిపి, డ్యూటీ దిగిన అనంతరం రెస్ట్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అయితే, ఉదయం 8 గంటల ప్రాంతంలో డిపో సిబ్బంది బస్సును శుభ్రం చేస్తుండగా బస్సు క్యారేజీలో ఇరుక్కుపోయిన శవాన్ని గుర్తించి విల్సన్ గార్డెన్ పోలీసులను అప్రమత్తం చేశారు.

బస్సు క్రింద పడిన వ్యక్తిని 70కిమీలు ఈడ్చుకెళ్లిన బస్సు

పదేళ్ల అనుభవంలో ఒక్క తప్పిదం జరగలేదు

బస్సు క్రింద పడి క్యారేజ్‌లో ఇరుక్కుపోయి మరణించిన వ్యక్తి వయస్తు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించడం జరిగింది. శవాన్ని విక్టోరియా హాస్పిటల్‌కు తరలించి బెంగళూరు-మైసూర్ మధ్య ఉన్న పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు.

బస్సు క్రింద పడిన వ్యక్తిని 70కిమీలు ఈడ్చుకెళ్లిన బస్సు

నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణమైనందుకు సెక్షన్ 304ఏ మరియు ప్రమాదానికి సంభందించి సాక్ష్యాలు లేకుండా చేసినందుకు ఐపిసి సెక్షన్ 201 క్రింద డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

బస్సు క్రింద పడిన వ్యక్తిని 70కిమీలు ఈడ్చుకెళ్లిన బస్సు

కెఎస్ఆర్‌టిసి సంస్థలో పనిచేస్తున్న మొహినుద్దీన్‌కు డ్రైవింగ్‌లో 10 అనుభవం ఉంది. "ఇన్ని సంవకత్సరాల కాలంలో ఒక్క ప్రమాదం కూడా చేయలేదు. నేను నడుపుతున్న బస్సు క్రింద మనిషి ఉన్నట్లు అస్సలు గుర్తించలేదని పోలీసులకు వివరించాడు".

బస్సు క్రింద పడిన వ్యక్తిని 70కిమీలు ఈడ్చుకెళ్లిన బస్సు

ఈ ఘటన గురించి కెఎస్ఆర్‌టిసి డ్రైవర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ, బెంగళూరు-మైసూర్ మార్గంలో డజన్ల కొద్దీ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, బహుశా స్పీడ్ బ్రేకర్ల వద్ద మనిషి బస్సు క్రింద పడిపోయి ఉండవచ్చని తెలిపాడు. అయితే, ఛాసిస్‌లోనే బస్సు ఇరుక్కుపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందిని తెలిపాడు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Caught under Karnataka bus, body dragged 70 Km

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark