7-సీటర్ క్రాసోవర్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన డాట్సన్

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం డాట్సన్ సరికొత్త క్రాస్ 7-సీటర్ క్రాసోవర్ ఎస్‌యూవీని రివీల్ చేసింది. డాట్సన్ గో ప్లస్ ఆధారంగా క్రాస్ క్రాసోవర్ కారును అభివృద్ది చేసింది.

By Anil

Recommended Video

Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం డాట్సన్ సరికొత్త క్రాస్ 7-సీటర్ క్రాసోవర్ ఎస్‌యూవీని రివీల్ చేసింది. డాట్సన్ గో ప్లస్ ఆధారంగా క్రాస్ క్రాసోవర్ కారును అభివృద్ది చేసింది. డాట్సన్ ఈ క్రాస్ క్రాసోవర్‌ను తొలిసారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ఆవిష్కరించింది.

 డాట్సన్ క్రాస్ 7-సీటర్

రెనో-నిస్సాన్ భాగస్వామ్యంలో ఉన్న సిఎమ్ఎఫ్-ఎ ప్లస్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రెడి-గో సిఎమ్ఎఫ్-ఎ ఛాసిస్ యొక్క పొడవాటి వెర్షన్‌లో ఈ క్రాసోవర్‌ను డాట్సన్ రూపొందించింది.

 డాట్సన్ క్రాస్ 7-సీటర్

ప్రొడక్షన్ దశకు చేరుకున్న డాట్సన్ క్రాస్ క్రాసోవర్‌లో బాడీ క్లాడింగ్, హ్యాలోజియన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఇడి పొజిషన్ ల్యాంప్స్, బంపర్ మీద ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, రూఫ్ స్పాయిలర్, రియర్ వైపర్ మరియు రూఫ్ రెయిల్స్ వంటివి ఉన్నాయి.

 డాట్సన్ క్రాస్ 7-సీటర్

డాట్సన్ క్రాస్ క్రాసోవర్‌లో ఆకర్షణీయమైన 15-అంగుళాల పరిమాణం గల అల్లాయ్ వీల్స్, 175/65 ఆర్15 కొలతల్లో ఉన్న టైర్లు, క్రోమ్ ఫినిషింగ్‌లో ఉన్న టెయిల్ పైప్, క్రోమ్ బార్డర్ గల హానికాంబ్ ఫ్రంట్ గ్రిల్ మరియు కాన్సెప్ట్ వెర్షన్ క్రాస్‌ను పోలి ఉండే పలు ఇంటీరియర్ సొబగులు ఇందులో ఉన్నాయి.

 డాట్సన్ క్రాస్ 7-సీటర్

డాట్సన్ గో మరియు గో ప్లస్ తరహా ఆల్ బ్లాక్ ఇంటీరియర్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్టీరింగ్ వీల్ డాట్సన్ క్రాస్‌లో రానున్నాయి. అయితే, మిగతా వాటితో పోల్చుకుంటే భిన్నంగా ఉండేందుకు సెంటర్ కన్సోల్ మీద పలు సిల్వర్ మెరుగులు ఉండనున్నాయి.

 డాట్సన్ క్రాస్ 7-సీటర్

డాట్సన్ క్రాస్ ఇంటీరియర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 6.75-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది ఏఎమ్, ఎఫ్ఎమ్, ఎమ్‌పి3, యుఎస్‍‌బి, ఏయుఎక్స్-ఇన్, బ్లూటూత్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటి సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు 2-స్పీకర్ సెటప్ ఉంది.

Trending On DriveSpark Telugu:

అత్యధిక మైలేజ్ ఇవ్వగల పది భారతదేశపు ఎస్‌యూవీలు

ఆటో ఎక్స్‌పో వేదికగా రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ బైకులను తీసుకొస్తున్న బిఎమ్‍‌‌డబ్ల్యూ

2018 స్విఫ్ట్ అఫీషియల్ బుకింగ్స్ స్టార్ట్: బుకింగ్ ధర మరియు డెలివరీ వివరాలు!!

 డాట్సన్ క్రాస్ 7-సీటర్

డాట్సన్ తమ క్రాస్ ఎస్‌యూవీని నిండైన ఫీచర్లతో అందిస్తోంది. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఫాలో మి ఫంక్షన్, ఫ్రంట్ మరియు రియర్ పవర్ అద్దాలు, ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఉన్నాయి.

 డాట్సన్ క్రాస్ 7-సీటర్

అదనంగా, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు,యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటి కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు మూడు వరుసల్లో ఉన్న సీట్లకు సీట్ బెల్ట్‌లను తప్పనిసరి ఫీచర్లుగా అందిస్తోంది.

 డాట్సన్ క్రాస్ 7-సీటర్

సాంకేతికంగా, డాట్సన్ క్రాస్ క్రాసోవర్ 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. 68బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల ఈ ఇంజన్‌ను గో ప్లస్ నుండి సేకరించింది.

 డాట్సన్ క్రాస్ 7-సీటర్

5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా రానుంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్స్‌కు డిస్క్ బ్రేకులు, రియర్ వీల్‌కు డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.

 డాట్సన్ క్రాస్ 7-సీటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డాట్సన్ తమ క్రాస్ క్రాసోవర్‌ను ఖచ్చితంగా ఎప్పుడు విడుదల చేస్తోందో ఎలాంటి సమచారం లేదు. 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది కాబట్టి దీని విడుదల దాదాపు ఖరారైనట్లే... డాట్సన్ క్రాస్ పూర్తి స్థాయిలో లాంచ్ అయితే విపణిలో ఉన్న కెయువి100 ఎన్ఎక్స్‌టి, మారుతి సెలెరియో ఎక్స్ మరియు అతి త్వరలో రానున్న ఫోర్డ్ ఫిగో ఆధారిత క్రాస్ హ్యాచ్‌బ్యాక్‌కు పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Datsun Cross Revealed — Most Feature-Rich Product From The Company
Story first published: Friday, January 19, 2018, 19:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X