రెడి-గో ఆటోమేటిక్ మీద బుకింగ్స్ ప్రారంభించిన డాట్సన్
డాట్సన్ ఇండియా తమ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ రెడి-గో 1.0-లీటర్ ఆటోమేటిక్ కారు మీద జనవరి 10, 2018 నుండి ముందస్తు బుకింగ్స్‌ను ప్రారంభించింది. కస్టమర్లు రూ. 10,000 ల బుకింగ్ మొత్తాన్ని చెల్లించి రెడి-గో
Recommended Video

డాట్సన్ ఇండియా తమ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ రెడి-గో 1.0-లీటర్ ఆటోమేటిక్ కారు మీద జనవరి 10, 2018 నుండి ముందస్తు బుకింగ్స్‌ను ప్రారంభించింది. కస్టమర్లు రూ. 10,000 ల బుకింగ్ మొత్తాన్ని చెల్లించి రెడి-గో 1.0-లీ ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ కారును దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ మరియు డాట్సన్ విక్రయ కేంద్రాలలో బుక్ చేసుకోవచ్చు.

అతి త్వరలో విడుదల కానున్న డాట్సన్ రెడి-గో 1.0-లీ ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసిన అనంతరం జనవరి 23, 2018 నుండి డెలివరీలను ప్రారంభించనున్నాట్లు ప్రకటించింది.

అత్యంత సరసమైన కార్లను తయారు చేసే సంస్థగా పేరుగాంచిన జపాన్ దిగ్గజం డాట్సన్ 2016లో ఇండియన్ మార్కెట్లోకి 800సీసీ కెపాసిటి గల ఇంజన్‌తో రెడి-గో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేసింది.

దీని విడుదల అనంతరం, పర్ఫామెన్స్ రెడి-గో కోసం 1-లీటర్ కెపాసిటి గల ఇంజన్ అందించి మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో 2017లో విడుదల చేసింది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ఇప్పుడు రెడి-గో 1.0లీ ఆటోమేటిక్ విడుదలకు పూర్తి స్థాయిలో సన్నద్దమైంది.

డాట్సన్ ఇండియా రెడి-గో కారును కంపెనీ యొక్క సిఎమ్‌ఎఫ్-ఎ ఫ్లాట్‌ఫామ్ మీద రెనో క్విడ్ నుండి సేకరించిన ఇంజన్ మరియు ఇతర విడి భాగాలతో నిర్మించింది. విపణిలో ఉన్న మారుతి ఆల్టో మరియు రెనో క్విడ్ కార్లను ఎదుర్కునేందుకు స్పోర్టివ్ శైలిలో రెడి-గో కారును డాట్సన్ బృందం డిజైన్ చేసింది.

డాట్సన్ రెడి-గో ఆటోమేటిక్ వేరియంట్లో 1.0-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల ఇంటెలిజెంట్ స్పార్క్ ఆటోమేటెడ్ టెక్నాలజీ గల ఇంజన్ వస్తోంది. 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
Trending On DriveSpark Telugu:

అయితే, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌ను రెనో క్విడ్ ఏఎమ్‌టి వెర్షన్‌లోని రోటరీ డయల్ తరహా ఏఎమ్‌టి వస్తుందో లేకపోతే గేర్‌నాబ్ తరహా ఏఎమ్‌టి వస్తుందో... తెలియాలంటే విడుదల వరకు వేచి ఉండక తప్పదు.

డాట్సన్ రెడి-గో అత్యుత్తమ క్యాబిన్ స్పేస్, స్పోర్టివ్ డిజైన్ శైలి, బెస్ట్-ఇన్-క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు హై సీటింగ్ పొజిషన్ కలదు. దీనికి తోడు ఇప్పుడు పర్ఫామెన్స్ ఇంజన్‌కు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతి కోసం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా జోడిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
చీపెస్ట్ కార్లను తయారు చేసే డాట్సన్ ఇండియా ఆటోమేటిక్ ఎంట్రీ లెవల్ కార్లను కోరుకునే కస్టమర్ల కోసం రెడి-గో 1.0-లీటర్ ఏఎమ్‌టి కారును పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దం చేసింది. అర్బన్ మరియు సిటీ డ్రైవింగ్‌కు బెస్ట్ ఛాయిస్‌గా నిలిచే దీని మీద ఇప్పుడు బుకింగ్స్ కూడా ప్రారంభించింది. అయితే, దీని ధరలు ఏ మేరకు ఉంటాయనే విషయం ఇంకా స్పష్టం కాలేదు.
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








