డెలివరీ ఇచ్చేటపుడు కస్టమర్ కారును ఆటోకు ఢీకొట్టిన షోరూమ్ సిబ్బంది: కారు పరిస్థితి చూడండి!!

మరి కొద్ది సేపట్లో బ్రాండ్ న్యూ డిజైర్ కారును డెలివరీ తీసుకోతున్న సంతోషంలో ఉన్న కస్టమర్, డీలర్ షిప్ సిబ్బంది చేసిన పనితో ఖంగుతిన్నాడు. తన కొత్త కారును ఇంకా చేతుల్లోకి తీసుకోకుండానే ప్రమాదానికి గురిచేస

By Anil Kumar

మరి కొద్ది సేపట్లో బ్రాండ్ న్యూ డిజైర్ కారును డెలివరీ తీసుకోతున్న సంతోషంలో ఉన్న కస్టమర్, డీలర్ షిప్ సిబ్బంది చేసిన పనితో ఖంగుతిన్నాడు. తన కొత్త కారును ఇంకా చేతుల్లోకి తీసుకోకుండానే ప్రమాదానికి గురిచేసి, ముందు భాగాన్ని తీవ్రంగా డ్యామేజ్ చేశారు.

కారును బయటకు తీసే క్రమంలో చిన్న ప్రమాదానికి కారు ఏ మేరకు డ్యామేజ్ అయ్యింది మరియు ఆ డీలరు కస్టమర్‌కు ఎలా న్యాయం చేశాడో చూద్దాం రండి....

ఆటోను ఢీకొన్న మారుతి డిజైర్

డీలర్‌ వద్ద పనిచేస్తున్న డ్రైవర్ కారును కస్టమర్‌కు డెలవరీ ఇచ్చేందుకు స్టాక్ పాయింట్ నుండి షోరూమ్ ముందుకు తీసుకొచ్చేందుకు వెళ్లాడు ఈ క్రమంలో అనుకోకుండా బ్రాండ్ న్యూ డిజైర్ కారును ప్రమాదానికి గురి చేశాడు. దాని తాలూకు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆటోను ఢీకొన్న మారుతి డిజైర్

ఈ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఆశిష్ మీనన్ కథనం మేరకు, డ్రైవర్ కారును డీలర్ వద్దకు తీసుకొస్తుండగా, సడెన్‌గా ఓ ఆటో యూటర్న్ తీసుకోవడంతో డిజైర్ ఆటోను ఢీకొట్టింది. కానీ, ప్రమాద ఫోటోలు మాత్రం మరో స్టోరీ చెబుతున్నాయి.

ఆటోను ఢీకొన్న మారుతి డిజైర్

మరో పాఠకుడి కథనం మేరకు, ప్రమాదం స్థలిలో తాను చూసిన ప్రకారం, ఇది ఆటో యూటర్న్ తీసుకోవడం ద్వారా కాకుండా కారు మరియు ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు.

ఆటోను ఢీకొన్న మారుతి డిజైర్

ప్రమాదం జరిగినపుడు భారీ వర్షం కురిసినట్లు తెలిసింది. దీంతో పాటు రోడ్డును స్పష్టంగా గమనించే అవకాశం కూడా దాదాపు తక్కువే అని చెప్పుకొచ్చాడు. ప్యాసింజర్ ఆటో వేగంగా వస్తున్న క్రమంలో షోరూమ్ డ్రైవర్ కారును స్టాక్ యార్డ్ నుండి షోరూమ్ వద్దకు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ఆటోను ఢీకొన్న మారుతి డిజైర్

నిజానికి ఎదురుగా వస్తున్న డిజైర్ కారును సులభంగా అధిగమించాలని ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే, ఆటో అధిక వేగంలో ఉండటంటో సడెన్‌గా లెఫ్ట్ సైడ్‌కు రావడానికి ప్రయత్నించేలోపే ఆలస్యమవడంతో కారుకు ముందు కుడి వైపున ఢీకొన్నాడు. ఆ తరువాత అదుపు తప్పిన ఆటో నిర్మాణ దశలో ఉన్న ఇంటి ప్రహరీలోకి దూసుకెళ్లింది.

ఆటోను ఢీకొన్న మారుతి డిజైర్

ప్రమాదానికి గురైన మారుతి డిజైర్ విషయానికి వస్తే, కారుకు ముందు కుడివైపున తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. హెడ్‌లైట్ అసెంబ్లీ, బంపర్ మరియు ఫ్రంట్ వీల్‌ బయటకు వచ్చేశాయి. ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వీల్ యాక్సిల్ విరిగిపోయి, చక్రం బయటకు చొచ్చుకొచ్చింది.

ఆటోను ఢీకొన్న మారుతి డిజైర్

ముందు వైపు ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ, క్యాబిన్ వరకు ప్రమాదం తీవ్రత దరి చేరలేదు. ఆటో డ్రైవర్ వేగం ధాటికి క్రింది పడిపోవడం స్వల్ప గాయాలయ్యాయి.

ఆటోను ఢీకొన్న మారుతి డిజైర్

ఇదే సమయంలో ఇటు షోరూమ్ సిబ్బంది మరియు అటు కస్టమర్ డెలివరీ తీసుకోవాల్సిన కారు కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. విషయం తెలుసుకున్న కస్టమర్ మాత్రం, తరువాత ఏం జరుగుతుందా అని ఎదురు చూశాడు. అయితే, డీలర్ ఆ కారును ప్రకనపెట్టి, బ్రాండ్ న్యూ కారును డెలివరీ ఇచ్చారు.

ఆటోను ఢీకొన్న మారుతి డిజైర్

భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన మారుతి సుజుకి సేల్స్ పరంగా కొత్త రికార్డులను సృష్టించడమే కాకుండా, నాణ్యత మరియు కస్టమర్ల సంతృప్తి విశయంలో అస్సలు రాజీపడటం లేదు. ప్రస్తుతం డిజైర్‌లోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను తప్పనిసరి చేసింది.

ఆటోను ఢీకొన్న మారుతి డిజైర్

1.2018 మారుతి ఎర్టిగా కారును ఆవిష్కరించిన మారుతి సుజుకి

2.విపణిలోకి 2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ విడుదల

3.3 కోట్లు ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు

4.20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

5.ఇండియాలోని అత్యంత ప్రమాదకరమైన జాతీయ రహదారులు

Most Read Articles

English summary
Read In Telugu: Dealership damages Maruti Dzire before delivery – Customer offered new car as replacement
Story first published: Friday, April 20, 2018, 19:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X