ఇండియాలో మొట్టమొదటి సారిగా డీజిల్ హోం డెలివరీ సర్వీస్ ప్రారంభించిన ఐఒసి

Written By:

ఒక్క ఫోన్ కొడితే ఇంటి ముంగిట్లోకి వచ్చే సర్వీసులు ఎన్నో ఉన్నాయి. కిరాణా వస్తువుల నుండి కూరగాయలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు స్కూటర్లు మరియు బైకులు కూడా ఆన్‌లైన్‍‌లో లభిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ విక్రయాలకు డిమాండ్ పెరగడంతో హోం డెలివరీ అయ్యే ఉత్పత్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు వీటి సరసన డీజిల్ కూడా వచ్చి చేరింది.

మీరు చదివింది అక్షరాలా నిజమే, ఆర్డర్ ఇస్తే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి డీజిల్ డెలివరీ ఇస్తారు. డీజిల్ హోం డెలివరీ సర్వీసును ప్రారంభించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ట్విట్టర్ ద్వారా వెల్లడిచింది.

డీజిల్ హోం డెలివరీ సర్వీస్

ఇండియాలో మొట్టమొదటి సారిగా డీజిల్ హోం డెలివరీ సర్వీసును దేశీయ చమురు దిగ్గజ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేష్(IOC) పూనేలో ప్రారంభించింది. ఈ డీజిల్ హోం డెలివరీ సర్వీసును పెట్రోలియం మరియు పేళుడు పదార్థాల భద్రతా సంస్థ(PESO) ఆమోదించింది.

డీజిల్ హోం డెలివరీ సర్వీస్

పూనేతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ముఖ్య పట్టణాలకు ఈ సేవలను విస్తరించే పనిలో ఉంది. ప్రస్తుతం, ఈ డీజిల్ హోం డెలివరీ సర్వీసులు మే 2018 నుండి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలో పెట్రోల్ హోం డెలివరీ సర్వీసులను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఐఒసి సీనియర్ అధికారి వెల్లడించాడు.

Recommended Video - Watch Now!
Horrific Footage Of Volkswagen Polo Exploding At A CNG Filling Station
డీజిల్ హోం డెలివరీ సర్వీస్

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ, "పెట్రోల్‌తో పోల్చుకుంటే డీజిల్ రవాణా, డెలివరీ మరియు నిర్వహణ చాలా సులభం. అంతే కాకుండా డీజిల్‌తో నడిచే వాహనాల సంఖ్య అధికంగా ఉండటం మరియు ఎక్కువ సంఖ్యలో ఉన్న కమర్షియల్ వెహికల్స్ అన్నింటికీ డీజిల్ అసరం అధికంగా ఉంటుంది కాబట్టి తొలుత డీజిల్ హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించినట్లు" పేర్కొన్నాడు.

డీజిల్ హోం డెలివరీ సర్వీస్

డీజిల్ హోం డెలివరీ చేసే ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ ట్రక్కు నిజంగా చక్రాల మీద కదిలే ఫ్యూయల్ స్టేషన్ లాంటిదని చెప్పవచ్చు. రద్దీ సమయంలో పెట్రోల్ స్టేషన్ల వద్ద బారులు తీరకుండా మరియు మారు మూలప్రదేశాలకు డీజిల్ పొందే అవకాశాన్ని కల్పించడంలో ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

డీజిల్ హోం డెలివరీ సర్వీస్

ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా తొమ్మిది కార్లను విడుదలకు సిద్దం చేసిన హ్యుందాయ్

కస్టమర్లకు అందని ద్రాక్షగా మారుతున్న కొత్త తరం మారుతి స్విఫ్ట్!!

English summary
Read In Telugu: Diesel Home Delivery Services Kicked Off By Indian Oil Corporation In Pune
Story first published: Monday, March 19, 2018, 17:06 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark