ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం వోల్వో మరియు ఐషర్ మధ్య కుదిరిన ఒప్పందం

వోల్వో గ్రూప్ మరియు ఐషర్ మోటార్స్ కంపెనీల ఉమ్మడి భాగస్వామ్యంత ఏర్పాటయిన వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్(VECV) సంస్థ ముంబాయ్ నగర రవాణా సంస్థకు 40 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసే ఒప్పందాన్ని కుదుర్చుకుంద

వోల్వో గ్రూప్ మరియు ఐషర్ మోటార్స్ కంపెనీల ఉమ్మడి భాగస్వామ్యంత ఏర్పాటయిన వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్(VECV) సంస్థ ముంబాయ్ నగర రవాణా సంస్థకు 40 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసే ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం వోల్వో మరియు ఐషర్ మధ్య కుదిరిన ఒప్పందం

తాజాగా అందిన సమాచారం ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌ నుండి 390 ఎలక్ట్రిక్ బస్సులకు లభించిన ఆర్డరులో భాగంగానే ఈ 40 బస్సుల డెలివరీ ఉన్నట్లు తెలిసింది. 390 ఎలక్ట్రిక్ బస్సుల ఒప్పందం గత డిసెంబరులో జరిగింది.

ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం వోల్వో మరియు ఐషర్ మధ్య కుదిరిన ఒప్పందం

కేంద్ర మంత్రి అనంత్ మాట్లాడుతూ, "దేశవ్యాప్తంగా 11 ప్రధాన నగరాలకు ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం 437 కోట్ల రుపాయల రాయితీ అందిస్తున్నాము. ఈ నగరాలలో ఎలక్ట్రిక్ బస్సులు, ట్యాక్సీలు మరియు త్రీ-వీలర్ల ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పుకొచ్చాడు."

ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం వోల్వో మరియు ఐషర్ మధ్య కుదిరిన ఒప్పందం

మొత్తం 11 నగరాలలో, తొమ్మిది అతి పెద్ద నగరాలను ఎంచుకుని ఒక్కో నగరానికి 40 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులను అందించేందుకు కేంద్రం సబ్సీడీ ఇస్తోంది. వీటిలో, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, హైదరాబాద్, ఇండోర్, కలకత్తా మరియు ముంబాయ్ నగరాలు ఉన్నాయి.

ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం వోల్వో మరియు ఐషర్ మధ్య కుదిరిన ఒప్పందం

వోల్వో గ్రూప్ మరియు ఐషర్ మోటార్స్ భాగస్వామ్యం విఇ కమర్షియల్ వెహికల్స్ తదుపరి కెపిఐటి టెక్నాలజీతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. కెపిటిఐ సంస్థ ఎలక్ట్రిఫికేషన్ టెక్నాలజీని తమ స్కైలైన్ ప్రో ప్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేస్తోంది. ఈ పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానం విఇ కమర్షియల్ వెహికల్స్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ బస్సుల్లో రానుంది.

ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం వోల్వో మరియు ఐషర్ మధ్య కుదిరిన ఒప్పందం

తొమ్మిది మీటర్లు పొడవున్న బస్సుల్లో ఈ టెక్నాలజీని అందిస్తే 36 శాతం ఎనర్జీని రీజనరేట్ చేస్తోంది. అంటే ఒక్క కిలోమీటరుకు 0.8 యూనిట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందన్నమాట.

ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం వోల్వో మరియు ఐషర్ మధ్య కుదిరిన ఒప్పందం

వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌‌లోని పితంపుర్‌లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ బస్సులను ఉత్పత్తి చేస్తోంది. ప్రయాణం మొత్తం ఏ/సి ఆన్‌లో ఉండగా ఒక్కసారి ఛార్జింగ్‌తో 177కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.

ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం వోల్వో మరియు ఐషర్ మధ్య కుదిరిన ఒప్పందం

వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ సేల్స్ గత కొన్ని నెలలో 30.7 శాతం వృద్దిని నమోదు చేసుకున్నాయి. 4,573 యూనిట్లను విక్రయించిన వోల్వో-ఐషర్ భాగస్వామ్యం ఆ తరువాత నెలలో 5,977 యూనిట్లను విక్రయిచింది. వీటిలో ఐషర్ 5,874 యూనిట్లు మరియు వోల్వో 103 యూనిట్లను విక్రయించింది.

ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం వోల్వో మరియు ఐషర్ మధ్య కుదిరిన ఒప్పందం

మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌‌కు 390 ఎలక్ట్రిక్ బస్సులను డెలివరీ ఇచ్చేందుకు కుదిరిన ఒప్పందంలో భాగంగానే ముంబాయ్‌కి 40 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగానే కేంద్రం వివిధ రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులను రాయితీతో అందిస్తోంది.

Source: ET Auto

Most Read Articles

English summary
Read In Telugu: Volvo-Eicher Joint Venture To Supply 40 Electric Buses To Mumbai
Story first published: Friday, June 8, 2018, 11:18 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X