రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం నిజంగానే పరిహారం చెల్లిస్తుందా..?

Written By:

ఈ మధ్య కాలంలో నిజమైన వార్తల కంటే అసత్యపు వార్తలే వేగంగా వ్యాపిస్తున్నాయి. కొన్ని కోట్ల మంది ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు వాట్సాప్ వంటి సోషల్ మీడియాలను ఉపయోగిస్తున్నారు. ఒక వ్యక్తి రాసిన లేదా మాట్లాడిన మెసేజ్‌లు శరవేగంగా యూజర్లందరికీ చేరిపోతున్నాయి. అందులో నిజమెంతుందో ఆలోచించకుండా గుడ్డిగా అందరికీ పంపిస్తుంటారు.

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం

అలాంటి వాటికి ఉదాహరణ, రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లిస్తుందనే సమాచారం. ఈ న్యూస్ ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్‌గా మారింది.

Recommended Video - Watch Now!
Truck Nearly Runs Over Women On A Scooter In Tamil Nadu - DriveSpark
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం

సువిశాల భారతదేశంలో ప్రతి కొన్ని సెకండ్లకు ఒక రోడ్డు ప్రమాదం సంభవిస్తున్నట్లు గతంలో పలు నివేదికలు వెల్లడించాయి. ప్రతి ఏడాది కొన్ని వేల మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో, ప్రమాదం బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించుకుంటూపోతే ఉన్న డబ్బంతా దీనికి సరిపోతుంది.

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం

గత రెండు మూడు రోజుల నుండి వాట్సాప్ మాధ్యమంలో చక్కర్లు కొడుతున్న నకిలీ కథనం ప్రకారం, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అతడు/ఆమె మూడేళ్ల నాటి వార్షిక ఆదాయానికి పది రెట్లు మొత్తాన్ని ప పరిహారం రూపంలో వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చెల్లిస్తుందని ఉంది.

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం

అంతే కాకుండా, ఈ నష్ట పరిహారాన్ని మోటార్ వెహికల్ చట్టం 1988 సెక్షన్ 166కు అనుగుణంగా చెల్లిస్తారనే సమాచారం కూడా ఉంది.

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం

మెటార్ వాహనాల చట్టం సెక్షన్ 166 ఏం చెబుతోంది...?

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు పరిహారం కోసం సమర్పించే దరఖాస్తు గురించి మరియు దానిని ఎలా నింపాలనే విషయాన్ని గురించి తెలియజేస్తుంది. అదే విధంగా దరఖాస్తును నింపడానికి అవసరమయ్యే పత్రాల గురించి మాత్రమే తెలియజేస్తుంది. అయితే, సెక్షన్ 166 ప్రకారం, ఇందులో ఎక్కడ కూడా ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లిస్తుందనే అంశం లేదు.

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం

వాస్తవం ఎంత ?

మోటార్ వాహనాల చట్టం మరియు చట్టం ప్రకారం, ప్రమాదానికి కారణమైన వాహన యజమాని, ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే ఈ సంధర్భంలో ప్రమాద కారకుడు బాధిత కుటుంబానికి లేదా బాధిత వ్యక్తికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం

నష్ట పరిహారాన్ని ఎంత మేరకు చెల్లించాలనే విషయాన్ని మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్ నియమ నిభందనలకు అనుగుణంగా నిర్ణయిస్తుంది.

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం

సామాజిక మాధ్యమాలలో వ్యాపిస్తున్న తప్పుడు వార్తలు:

పైన పేర్కొన్న కథనం మేరకు, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న సమాచారం నకిలీదని తెలిస్తే దానిని అక్కడితోనే నిలిపివేయాలి. ఫేస్‌బుక్ మరియు వాట్సాప్ ఉపయోగించే ప్రతి యూజర్ కూడా తాను పోస్ట్ చేసే మరియు ఇతరులకు షేర్ చేసే సమాచారం పట్ల భాద్యతాయుతంగా ఉంటే ఇలాంటి ఆధారం లేని నకిలీ వార్తలను కట్టడి చేయవచ్చు.

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

క్షణాల్లో సమాచారాన్ని చేరవేయడానికి వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు అద్భుతం అని చెప్పవచ్చు. అయితే, నకిలీ మరియు తప్పుడు సమాచారాన్ని కూడా అంతే వేగంగా వ్యాపింజేయడంలో వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి మనకు వచ్చే వాట్సాప్ సందేశాలు ఎంత వరకు నిజం ఎంత వరకు అబద్దం అని బేరీజు వేసుకుంటే ఇలాంటి పొరబాట్లు జరగవు.

English summary
Read In Telugu: Fake News Alert! Does The Government Really Pay Compensation For All Accident Victims?
Story first published: Thursday, March 1, 2018, 18:59 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark