మహీంద్రా - ఫోర్డ్ భాగస్వామ్యంలో వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు

Written By:
Recommended Video - Watch Now!
Auto Expo 2018: Tata Tigor EV - Details, Expected Price, Launch - DriveSpark

ఎలక్ట్రిఫికేషన్ మరియు ఫ్యూచర్ టెక్నాలజీ కోసం పోర్డ్ మరియు మహీంద్రా పరస్పర ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఉమ్మడి భాగస్వామ్యం గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు రివీల్ అయ్యాయి.

తాజాగా, అందిన సమాచారం మేరకు, మహీంద్రా మరియు ఫోర్డ్ ఉమ్మడి భాగస్వామ్యంలో వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఆస్పైర్ ఎలక్ట్రిక్ అని తెలిసింది. ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో టాటా ఆవిష్కరించిన టాటా టిగోర్ ఎలక్ట్రిక్ సెడాన్‌కు పోటీగా ఆస్పైర్ ఎలక్ట్రిక్ సెడాన్ కారును వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో విపణిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఫోర్డ్ ఆస్పైర్ ఎలక్ట్రిక్ కారు

ఆస్పైర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌తో ఫోర్డ్ మరియు మహీంద్రా భాగస్వామ్యం సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ది చేసేందుకు అవసరమయ్యే ఒక నూతన ఫ్లాట్‌ఫామ్ నిర్మించనుంది. ఈ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించే ఎస్‌యూవీని రెండు విభిన్న వెర్షన్‌లలో తయారు చేసి ఒకటి ఫోర్డ్, మరొకటి మహీంద్రా తరపున మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నాయి.

ఫోర్డ్ ఆస్పైర్ ఎలక్ట్రిక్ కారు

ఫోర్డ్ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ నుండి ఎన్నో ప్రయోజనాలను పొందనుంది, మరియు ఇరు సంస్థల కలకయితో ఇండియన్ రోడ్లను చేరనున్న మొట్టమొదటి ఉత్పత్తి ఆస్పైర్ ఎలక్ట్రిక్ సెడాన్ కానుంది.

ఫోర్డ్ ఆస్పైర్ ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిఫికేషన్ మరియు ఆధునిక టెక్నాలజీ పరంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఫోర్డ్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా సెప్టెంబరు 2017వలో పరస్పర భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఫోర్డ్ ఆస్పైర్ ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అనుభవం గడించిన మహీంద్రా సహాయంతో ఫోర్డ్ ఇండియా విభాగం అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రత్యేకించి ఫోర్డ్ ఆస్పైర్ ఎలక్ట్రిక్ కోసం మహీంద్రా వెరిటో ఎలక్ట్రిక్ నుండి పలు విడి భాగాలను వినియోగించనుంది.

ఫోర్డ్ ఆస్పైర్ ఎలక్ట్రిక్ కారు

మహీంద్రా ఇ-వెరిటో సెడాన్ గరిష్ట పరిధి 110కిలోమీటర్లు. కిలోమీటరుకు 1.15 రుపాయలు ఖర్చవుతుంది. సాంకేతికంగా ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ గల 72వోల్ట్స్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది.

ఫోర్డ్ ఆస్పైర్ ఎలక్ట్రిక్ కారు

ఇరు కంపెనీలు ఇప్పటికే అత్యాధునిక ఎస్‌యూవీని అభివృద్ది చేస్తున్నాయి. ఇరు సంస్థల వద్ద ఉన్న డిజైన్ ఫిలాసఫీల మేళవింపుతో నూతన ఎస్‌యూవీని డిజైన్ చేయనున్నాయి. భారత్‌లో మహీంద్రా మరియు టాటా తరువాత ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లోకి ప్రవేశించిన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్.

ఫోర్డ్ ఆస్పైర్ ఎలక్ట్రిక్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భవిష్యత్ రవాణాలో ఎలక్ట్రిక్ కార్లు కీలకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి పెట్రోల్ మరియు డీజల్ కార్ల మత్తులో ఉన్నామేగానీ, కాలుష్య కారక వాహనాల వినియోగం పట్ల కఠినమైన నియమాలు అమల్లోకి వస్తే అందరూ ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వాహనాల మీదే ఆదారపడాలి.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విరివిగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఫోర్డ్ మరియు మహీంద్రా చేతులు కలిపాయి. మరి ఫ్యూచర్‌లో ఎలాంటి ఉత్పత్తులు రానున్నాయో వేచి చూడాలి మరి.

English summary
Read In Telugu: Ford Aspire Electric Sedan In The Works — Launch Details Revealed
Story first published: Tuesday, February 27, 2018, 19:36 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark