ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్ విడుదల ఖరారు

ఫోర్డ్ ఇండియా ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్ విడుదలను ఖరారు చేసింది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఫోర్డ్ తమ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని టైటానియం ఎస్ వేరియంట్లో వచ్చే మే 14, 2018 న విపణిలోకి ప్ర

By Anil Kumar

ఫోర్డ్ ఇండియా ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్ విడుదలను ఖరారు చేసింది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఫోర్డ్ తమ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని టైటానియం ఎస్ వేరియంట్లో వచ్చే మే 14, 2018 న విపణిలోకి ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. సరికొత్త ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్ అదనపు ఫీచర్లు మరియు పలు డిజైన్ మార్పులతో రానుంది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్

ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్ 125బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేయగల 1-లీటర్ ఇకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. టాప్ ఎండ్ వేరియంట్‌గా వస్తోన్న టైటానియం ఎస్ మోడల్ ధృడమైన సస్పెన్షన్ సిస్టమ్‌తో పాటు అదనంగా 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌ ఆప్షన్‌లో కూడా వస్తోంది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్

సరికొత్త ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్లో సరికొత్తగా డిజైన్ చేయబడిన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, సన్‌రూఫ్, హెచ్ఐడి హెడ్‌ల్యాంప్స్, కొద్దిగా రీడిజైన్ చేయబడిన 4.2-అంగుళాల ఎమ్‌ఐడి డిస్ల్పే గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లు వస్తున్నాయి.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్

టైటానియం ఎస్ వేరియంట్ ఎక్ట్సీరియర్ విషయానికి వస్తే, మసకబారిన రూఫ్ టాప్, ఫ్రంట్ గ్రిల్ మీద బ్లాక్ కలర్ ఎలిమెంట్స్, స్మోక్డ్ హెడ్‌‌ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అదే విధంగా ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్ శాటిన్ ఆరేంజ్ కలర్ స్కీమ్‌లో లభ్యం కానుంది. ఇంటీరియర్‌లోని సెంటర్ కన్సోల్, సీట్లు మరియు డోర్ల మీద ఆరేంజ్ కలర్ అలకరణలు ఉన్నాయి.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్

ఫోర్డ్ ఇండియా ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్‌తో పాటు ఇకోస్పోర్ట్ సిగ్నేచర్ ఎడిషన్‌ను లాంచ్ చేయనుంది. టైటానియం ప్లస్ వేరియంట్‌గా సిగ్నేచర్ ఎడిషన్‌ను రూపొందించారు. ఇందులో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ వంటి అదనపు భద్రత ఫీచర్లతో వస్తోంది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్

డిజైన్ పరంగా, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ సిగ్నేచర్ ఎడిషన్ ఎస్‌యూవీలో ఫ్రంట్ గ్రిల్ మీద బ్లాక్ ఇన్సర్ట్స్, హెడ్‌ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్‌తో పాటు రియర్ స్పాయిలర్ ఉన్నాయి. సిగ్నేచర్ ఎడిషన్ వేరియంట్ శాటిన్ ఆరేంజ్ కలర్ స్కీమ్‌తో పాటు అయోనైజ్డ్ బ్లూ పెయింట్ స్కీమ్‌లో కూడా లభ్యం కానుంది. ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌లో బ్లూ కలర్ సిగ్నేచర్ బ్యాడ్జింగ్ ఉంది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్

సాంకేతికంగా, ఇకోస్పోర్ట్ సిగ్నేచర్ ఎడిషన్ ఎస్‌యూవీ అవే మునుపటి 1.5-లీటర్ డ్రాగన్ సిరీస్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. ఇవి వరుసగా, 121బిహెచ్‌పి పవర్-150ఎన్ఎమ్ టార్క్ మరియు 98.6బిహెచ్‌పి పవర్-205ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఇండియా తమ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీని టైటానియం ఎస్ టాప్ ఎండ్ వేరియంట్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. టైటానియం ఎస్ వేరియంట్ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అదనపు ఫీచర్లతో పాటు సరికొత్త 1-లీటర్ ఇకోబూస్ట్ ఇంజన్‌తో వస్తోంది.

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్

ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్‌ మరియు సిగ్నేచర్ ఎడిషన్ వేరియంట్లలో విడుదలైతే, ఇటీవల అప్‌డేట్స్‌తో విడుదలైన మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు అతి త్వరలో విడుదల కానున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌కు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

Read more on: #ford #ఫోర్డ్
English summary
Read In Telugu: Ford EcoSport Titanium S Launch Date Revealed
Story first published: Thursday, May 10, 2018, 19:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X