ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సర్వం సిద్దం

Written By:

ఫోర్డ్ ఇండియా సరికొత్త ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ ప్రీమియం ఎస్‌యూవీని రివీల్ చేసింది. ఫోర్డ్ తమ ఎండీవర్‌ ఫేస్‌లిఫ్ట్ ప్రీమియం ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లో ఫేస్‌లిఫ్ట్ ఎవరెస్ట్ అనే పేరుతో ఆవిష్కరించింది.

అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్‌ ఇంటీరిర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా పలు మార్పులు చేర్పులు చేసి అధునాతన ఇంజన్ పరిచయం చేస్తోంది.

ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సర్వం సిద్దం

ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్‌లో అధునాతన ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన బంపర్, ఎస్‌యూవీ రియర్ డిజైన్‌లో కూడా నూతన టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు కొద్దిగా మార్పులు చేయబడిన బంపర్ ఉన్నాయి. 2018 ఫోర్డ్ ఎండీవర్‌లో 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సర్వం సిద్దం

ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే పలు అప్‌డేట్స్ గుర్తించగలం. ఫోర్డ్ వారి సింక్3 ఇంటర్‌ఫేస్ గల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు భద్రత పరంగా పాదచారులను గుర్తించి బ్రేకులు వేసే అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఇందులో పరిచయం అవుతోంది.

ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సర్వం సిద్దం

2018 ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో రేంజర్ పికప్‌ట్రక్కు నుండి సేకరించిన సరికొత్త 2-లీటర్ డీజల్ ఇంజన్ ఇందులో కలదు. ఇది రెండు రకాల పవర్ ఉత్పత్తి చేస్తుంది. రెగ్యులర్ వెర్షన్ 177బిహెచ్‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా ట్విన్-టుర్బో వేరియంట్ 210బిహెచ్‌పి పవర్ మరియు 500ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సర్వం సిద్దం

ఫోర్డ్ ఇండియా తమ సరికొత్త ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్‌ను ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, అప్పుడు ఈ నూతన 2 లీటర్ ఇంజన్ పరిచయం కానుంది. తొలుత దీనిని ఆస్ట్రేలియా విపణిలోకి లాంచ్ చేసి, తరువాత ఆసియన్ మార్కెట్లలోకి ప్రవేశపెట్టనుంది.

ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సర్వం సిద్దం

ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ ఎండీవర్ 2.2-లీటర్ మరియు 3.2-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యం కానుంది. వీటిలో 2.2-లీటర్ ఇంజన్ 158బిహెచ్‌పి-385ఎన్ఎమ్ అదే విధంగా 3.2-లీటర్ ఇంజన్ 197బిహెచ్‌పి-470ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతున్నాయి.

ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సర్వం సిద్దం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌‌యూవీలో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా మార్పులు చేసుకున్నాయి. అంతర్జాతీయ వెర్షన్‌లో అయితే, రేంజర్ పికప్ నుండి సేకరించిన నూతన 2-లీటర్ డీజల్ ఇంజన్ పరిచయం అవుతోంది.

ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు సర్వం సిద్దం

దేశీయ విపణిలోకి ఈ ఏడాది చివరి నాటికి లేదా 2019 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో విడుదలైతే మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, మిత్సుబిషి పజేరో స్పోర్ట్ మరియు ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Read more on: #ford #ఫోర్డ్
English summary
Read In Telugu: Ford Endeavour Facelift Revealed; Specifications, Features And Images
Story first published: Friday, May 18, 2018, 10:01 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark