400 అడుగుల లోయలోకి పడిపోయిన ఎండీవర్: 7 మంది ప్రయాణికులు సేఫ్!!

Written By:
Recommended Video - Watch Now!
Truck Nearly Runs Over Women On A Scooter In Tamil Nadu - DriveSpark

ఉదయం ఆరు గంటల సమయంలో, తనకు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి జిత్తేంద్ర సింగ్ కొద్దిగా లెఫ్ట్‌కు స్టీరింగ్ తిప్పాడు. ఊహించని విధంగా తనతో పాటు ప్రయాణిస్తున్న మొత్తం 7 మంది ఉన్న ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ అదుపుతప్పి 400 అడుగుల లోయలోకి పడిపోయింది. అదృష్టవశాత్తు, తనతో పాటు తన కుంటుంబం మొత్తం ఆ భయంకరమైన ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడింది.

లోయలోకి పడిపోయిన ఫోర్డ్ ఎండీవర్

ఇండియన్ రోడ్ల మీద ఇప్పటి వరకు జరిగిన ఎన్నో ఫోర్డ్ ఎండీవర్ ప్రమాదాల్లో ప్రయాణికులను సురక్షితంగా కాపాడింది. అలాంటి వారిలో జిత్తేంద్ర సింగ్ ఒకరు. ఫోర్డ్ ఎండీవర్, తనను తన కుటుంబాన్ని ప్రమాదపుటంచుల నుండి ప్రాణాలతో సురక్షితంగా బయపడేసింది.

లోయలోకి పడిపోయిన ఫోర్డ్ ఎండీవర్

జిత్తేంద్ర సింగ్ తన కుటుంబంతో సరదాగా గడపడానికి మహారాష్ట్రలోని వసాయ్ నుండి సింధూదుర్గ్ జిల్లాలోని కన్కావలి ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

లోయలోకి పడిపోయిన ఫోర్డ్ ఎండీవర్

ప్రక్క లైన్‌లో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ఉన్నట్లుండి తన మార్గంలోకి రావడంతో, దానిని తప్పించడానికి వాహనాన్ని కొద్దిగా ఎడమవైపుకు మళ్లించాడు.

లోయలోకి పడిపోయిన ఫోర్డ్ ఎండీవర్

రోడ్డు చాలా ఇరుకుగా ఉండటంతో రోడ్డుకు ప్రక్కనే ఉన్న బారికేడ్‌ను ఢీకొట్టి లోయలోకి పడిపోయింది. పల్టీలుకొడుతూ సుమారుగా 400 అడుగులు లోతులోకి ఎస్‌యూవీ పడిపోయింది. దీన్ని చూసిన డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు.

లోయలోకి పడిపోయిన ఫోర్డ్ ఎండీవర్

అతి ఘోరమైన ఈ ప్రమాదం నుండి ఫోర్డ్ ఎండీవర్‌లో ప్రయాణిస్తున్న అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగినపుడు ఎండీవర్ డ్రైవర్ మరియు జిత్తేంద్ర సింగ్ మాత్రమే సీట్ బెల్ట్ ధరించారు.

లోయలోకి పడిపోయిన ఫోర్డ్ ఎండీవర్

ఎండీవర్ ఎస్‌యూవీ లోయలోకి పడిపోయినపుడు జిత్తేంద్ర సింగ్ భార్య పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగినపుడు ఎస్‌యూవీలోని ఆరు ఎయిర్‌బ్యాగులు విచ్చుకోవడంతో అందరూ తప్పించుకున్నారు.

లోయలోకి పడిపోయిన ఫోర్డ్ ఎండీవర్

ఫోటోలలోని నుజ్జునుజ్జుయిన ఫోర్డ్ ఎండీవర్ చూస్తే ప్రమాద తీవ్రత ఏ మేరకు ఉందో చెప్పవచ్చు. రూఫ్ టాప్ మరియు ఎస్‌యూవీ ముందు భాగంగా పూర్తిగా దెబ్బతినింది.

లోయలోకి పడిపోయిన ఫోర్డ్ ఎండీవర్

ఏదేమైనప్పటికీ, 400 అడుగుల లోయలోకి పడిపోయినప్పటికీ ఫోర్డ్ ఎండీవర్ సస్పెన్షన్ మరియు చక్రాలు చెక్కుచెదరలేదు. ఇంజన్ మరియు అన్ని విడి భాగాలు ఎస్‌యూవీ నుండి వేరు పడకుండా అలాగే ఉన్నాయి.

లోయలోకి పడిపోయిన ఫోర్డ్ ఎండీవర్

ఈ ప్రమాదం సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరిని చెబుతోంది. సీట్ బెల్ట్ ధరించకపోయినా, ఇందులోని ఎయిర్‌బ్యాగులు విచ్చుకుని అందరినీ రక్షించాయి. సీట్ బెల్ట్ కూడా ధరిస్తే పెద్ద పెద్ద గాయాలను తప్పించుకోవచ్చు.

లోయలోకి పడిపోయిన ఫోర్డ్ ఎండీవర్

చాలా వాహనాల్లో ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా ఉండకపోవచ్చు, కానీ అన్ని కార్లలో సీట్ బెల్టులు ఖచ్చితంగా ఉంటాయి. ప్రమాదాలు చెప్పిరావు కాబట్టి, కారులో ప్రయాణం ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించండి.

ఫోర్డ్ ఎండీవర్ గురించి

అమెరికా దిగ్గజం ఫోర్డ్ ఇండియన్ మార్కెట్లోని ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా ఎండీవర్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. ఫోర్డ్ ఎండీవర్ 2.2-లీటర్ డీజల్ మరియు 3.2-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ వేరియంట్లలో టూ వీల్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమవుతోంది.

Image Source: Rushlane, HP Live

English summary
Read In Telugu: Ford Endeavour Falls Into A 400 Foot-Deep Ravine
Story first published: Saturday, February 24, 2018, 18:31 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark