ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ యాక్ససరీ లిస్ట్ వెల్లడించిన ఫోర్డ్

Written By:

ఫోర్డ్ ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశపు తొలి క్రాస్ యుటిలిటి వెహికల్(CUV) ఫ్రీస్టైల్ ను ఆవిష్కరించింది. అతి త్వరలో విడుదల చేయనున్న ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారు ఇటీవల కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలిచింది. ఇప్పటి వరకు మరే ఇతర కార్లలో రానటువంటి అధునాతన మరియు ఫస్ట్ క్లాస్ ఫీచర్లు దీని సొంతం.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఫ్రీస్టైల్ క్రాసోవర్‌ను నిర్మించింది. సాంకేతికంగా ఇందులో 94బిహెచ్‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలదు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫోర్డ్ తమ ఫ్రీస్టైల్ క్రాస్ యుటిలిటి వెహికల్‌లో పరిచయం చేయనున్న యాక్ససరీల జాబితా వెల్లడయ్యింది. ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారులో వస్తున్న నూతన ఫీచర్లు మరియు యాక్ససరీల లిస్ట్ మీద ఓ లుక్కేసుకుందాం రండి....

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ బాడీ కిట్

ఇండియా యొక్క మొట్టమొదటి క్రాస్ యుటిలిటి వెహికల్‌గా వస్తున్న ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారులో స్పోర్టివ్ ఫీల్ కలిగించేందుకు ఆప్షనల్ బాడీ స్ట్రిప్ కిట్‌ను ఫోర్డ్ అందివ్వనుంది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ బాడీ స్ట్రిప్ రెండు విభిన్న రంగుల్లో మరియు రెండు విభిన్న డిజైన్‌లలో రానున్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ లభించే టైటానియం మరియు టైటానియం ప్లస్ వేరియంట్లలో 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ వస్తాయి, చిన్న వేరియంట్లయిన ఆంబియంట్ మరియు ట్రెండ్ వేరియంట్లలో ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. అయితే, ఈ రెండింటిలో 15-అంగుళాల స్టీల్ వీల్స్ స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఆంబియంట్ లైటింగ్

మీరు ఎంచుకునే ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఇంటీరియర్ మరింత ప్రీమియమ్‌గా ఉండాలనుకుంటే ఆంబియంట్ లైటింగ్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు. ఐదు రకాల రంగుల్లో వెలిగే నాలుగు ఎల్ఇడి లైట్లు కారులో ఫ్రంట్ మరియు రియర్ లెగ్ రూమ్‌లో అందివ్వడం జరిగింది. మొబైల్ యాప్ ద్వారా ఈ లైట్లను మనసుకు నచ్చినట్లుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రూఫ్ క్రాస్ బార్స్

రూఫ్ రెయిల్స్ మరియు క్రాస్ బార్ సంయుక్తంగా 50 కిలోల బరువును తట్టుకోగలదు. బోల్టులు మరియు నట్లు ఉపయోగించి మరిన్ని క్రాస్ బార్లను బిగిస్తే స్టైలిష్ రూఫ్ క్యారీయరియర్‌లో మరింత లగేజ్ తీసుకెళ్లవచ్చు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రూఫ్ స్పాయిలర్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రియర్ డిజైన్‌లో అత్యంత ఆకర్షణీయంగా, వాలుగా ఉన్న పలుచటి స్పాయిలర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫోర్డ్ ఫ్రీస్టై‌ల్ రూఫ్ కలర్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ రూఫ్ టాప్ రెండు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. వాటిలో ఒకటి ఆబ్వియస్ బ్లాక్.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ సీట్ కవర్లు

మార్కెట్లో ఇతర కార్ల మాదిరిగా ఫోర్డ్ ఫ్రీస్టైల్‌లో ఆప్షనల్ సీట్ కవర్లు ఉన్నాయి. మూడు విభిన్న డిజైన్ లక్షణాలతో ఫ్రీస్టైల్ బ్యాడ్జింగ్‌తో కుట్టబడిన సీట్ కవర్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ సన్ బ్లైండ్స్

విపరీతమైన ఎండ వేడిమి మరియు అతినీలలోహిత కిరణాల నుండి ప్యాసింజర్లు తమను తాము రక్షించుకోవడానికి ఈ సన్ బ్లైండ్స్ చక్కగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా, ఇంటీరియర్ మొత్తాన్ని సన్‌బ్లైండ్స్ చల్లగా ఉంచుతాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ రెయిన్‌గార్డ్స్

ఫోర్డ్ స్టైల్‌లో ట్రెడిషనల్ బ్లాక్ రెయిన్ గార్డ్స్ ఉన్నాయి. ఇవి, నీరు మరియు దుమ్మును లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాయి. వర్షం పడుతున్నపుడు మరియు దుమ్ముధూళి చెలరేగినపుడు ఇంటీరియర్‌లోకి గాలి కావాల్సి వస్తే, రెయిన్ గార్డ్స్ ఉండటంతో కేవలం గాలి మాత్రమే లోపలికి వస్తుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఇంజన్ అండర్ షీల్డ్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ కారుతో కఠినమైన ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చేయాలనుకుంటే, ఫోర్డ్ ఫ్రీస్టైల్ యొక్క అండర్‌బాడీ షీల్డ్ ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఇంజన్‌ను రక్షిస్తుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఇతర యాక్ససరీలు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

కారు కవర్

డబుల్ స్టిచ్చింగ్ పాలిస్టర్ మెటీరియల్‌తో తయారు చేసిన కారు కవర్ అందిస్తోంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాస్ టైటానియం ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్లో ఆంబియంట్ సెన్సార్ ఆధారిత ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ స్టాండర్డ్‌గా వస్తున్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

షార్క్ ఫిన్

అత్యంత ఆకర్షణీయమైన షార్క్ ఫిన్ రియర్ డిజైన్‌కు అట్రాక్టివ్ లుక్ తీసుకొచ్చింది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

రియర్ వ్యూవ్ కెమెరా

ఆధునిక కాలంలో ప్రతి కారులో తప్పనిసరిగా వస్తోన్న ఫీచర్ రియర్ వ్యూవ్ కెమెరా. ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ ఆంబియంట్ బేస్ వేరియంట్‌లో ఆప్షనల్‌గా మరియు మిగతా అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందిస్తోంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

నెక్ రెస్ట్ మరియు పిల్లో

ధీర్ఘకాలం మన్నిక గల హై-క్వాలిటీ ఫైబర్ మరియు ఫోమ్ మెటీరియల్‌‌తో తయారు చేసిన నెక్, హెడ్ రెస్ట్ మరియు పిల్లోలను అందివ్వడం జరిగింది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ప్రత్యేకమైన యాంటీ-థెఫ్ట్ బోల్ట్స్

ఇలాంటి యాంటీ-థెఫ్ట్ బోల్టులను ప్రత్యేకమైన కీ ద్వారా మాత్రమే వదులు లేదా బిగించడానికి వీలవుతుంది. కాబట్టి, దొంగల బారీ నుండి కారును రక్షించుకోవడంలో ఈ బోల్టులు సహాయపడతాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఫ్రీస్టైల్ చిన్న స్థాయి క్రాసోవర్ అన్ని రకాల శక్తిసామర్థ్యాలను కలిగి ఉంది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల వేరియంట్ ఫన్ డ్రైవింగ్ అనుభవాన్నిస్తుంది. అదనంగా, అన్ని రకాల కస్టమర్లను ఆకట్టుకునే విధంగా భారతదేశపు తొలి క్రాస్ యుటిలిటి వెహికల్ ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారులో అత్యాధునిక ఫీచర్లు మరెన్నో యాక్ససరీలు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

Read more on: #ford #ఫోర్డ్
English summary
Read In Telugu: Ford Freestyle Accessories List: Body Stripe, Spoiler, Ambient Lighting, Roof Cross Bars & More

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark