ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ విడుదల తేదీ ప్రకటించిన ఫోర్డ్

ఫోర్డ్ ఇండియా తమ సరికొత్త కాంపాక్ట్ యుటిలిటి వెహికల్ (CUV) ఫ్రీస్టైల్ కారు విడుదలను ప్రకటించింది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఏప్రిల్ 26, 2018 న మార్కెట్లో తమ సరికొత్త ఫ్రీస్టైల్‌ను అధికారికంగా విడుదల చేసి అందు

By Anil Kumar

ఫోర్డ్ ఇండియా తమ సరికొత్త కాంపాక్ట్ యుటిలిటి వెహికల్ (CUV) ఫ్రీస్టైల్ కారు విడుదలను ప్రకటించింది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఏప్రిల్ 26, 2018 న మార్కెట్లో తమ సరికొత్త ఫ్రీస్టైల్‌ను అధికారికంగా విడుదల చేసి అందుబాటులోకి తీసుకురానుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ బుకింగ్స్ ఇప్పటికే అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఎంచుకోవాలనుకునే ఔత్సాహికులు రూ. 21,000 లు బుకింగ్ మొత్తాన్ని చెల్లించి ఫ్రీస్టైల్‌ కారును బుక్ చేసుకోవచ్చు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ విడుదల

ఫోర్డ్ తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించిన ఫ్రీస్టైల్ కాంపాక్ట్ యుటిలిటి వెహికల్‌ను విపణిలో ఉన్న ఫిగో మరియు ఇకోస్పోర్ట్ మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది. ఒక కొత్త సెగ్మెంట్‌కు నాంది పలికిన ఫోర్డ్ ఫ్రీస్టైల్ మార్కెట్లోని హ్యుందాయ్ యాక్టివ్ ఐ20 మరియు ఫియట్ అర్బన్ క్రాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారులోని 1.2-లీటర్ కెపాసిటి గల డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ 95బిహెచ్‌‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా, ఇందులోని 1.5-లీటర్ టిడిసిఐ డీజల్ ఇంజన్ మెరుగైన 100బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఎక్ట్సీరియర్‌ డిజైన్‌లో హెక్సాగోనల్ బ్లాక్ గ్రిల్ డిజైన్, స్పెషవ్ స్మోక్ ఎఫెక్ట్ గల హెడ్‌ల్యాంప్స్, సి-ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో సిల్వర్ రూఫ్ రెయిల్స్, ఫాక్స్ క్లాడింగ్, కారుకు ఇరువైపులా బ్లాక్ గ్రాఫిక్స్ మరియు సరికొత్త సెట్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ఎత్తైన 190ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఫోర్డ్ ఫ్రీస్టైల్‌లో హైలెట్‌గా నిలిచాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఇంటీరియర్ విషయానికి వస్తే, చాకోలెట్ మరియు బ్లాక్ ఇంటీరియర్ థీమ్ ఉంది. ఫోర్డ్ సింక్ 3 సెటప్ గల 6.5-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ విడుదల

ఎలక్ట్రిక్ పవర్‌ ద్వారా ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, ఆటోమేటిక్ హెడ్‌‌‌ల్యాంప్స్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఎన్నో అదనపు ఫీచర్లు ఫోర్డ్ ఫ్రీస్టైల్ సొంతం.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యం కానుంది. అవి, ఆంబియంట్, ట్రెండ్, టైటానియం మరియు టైటానియం ప్లస్.

భద్రత పరంగా ఫోర్డ్ ఇండియా తమ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారులో యాంటీ రోల్ఓవర్ ప్రివెంన్షన్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్, అప్రోచ్ సెన్సార్లు, కీలెస్ ఎంట్రీ, ఇంజన్ ఇమ్మొబిలైజర్ మరియు పెరిమీటర్ థెఫ్ట్ అలారమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఫ్రీస్టైల్ భారతదేశపు తొలి కాంపాక్ట్ యుటిలిటి వెహికల్. దీనిని ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో నిర్మించారు. ధరల వివరాలు ఇంకా వెల్లడికాలేదు అయితే, ఫోర్డ్ ఫ్రీస్టైల్ ధరల శ్రేణి రూ. 6 లక్షల నుండి రూ. 9 లక్షల మధ్య ఉండవచ్చు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ విడుదల

పలు రకాల వేరియంట్లు, అత్యాధునిక ఇంటీరియర్ ఫీచర్లు మరియు స్టైలిష్ అంశాలతో పాటు, యంగ్ కస్టమర్ల కోసం ఎన్నో యాక్ససరీలను అందిస్తోంది. భారతదేశపు తొలి కాంపాక్ట్ యుటిలిటి వెహికల్ ఫోర్డ్ ఫ్రీస్టైల్ యొక్క స్పోర్టివ్ తత్వాన్ని పెంచడంలో ఈ యాక్ససరీలు కీలకం.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ విడుదల

1.ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ: ఒక కొత్త అధ్యయనానికి నాంది

2.కళ్లు చెదిరే యాక్ససరీలతో ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

3.కస్టమర్‌ను మోసం చేసినందుకు డీలరుకు 9.23 లక్షలు జరిమానా

4.రాయలసీమలో ఉన్న 15 బెస్ట్ రోడ్ ట్రిప్స్

5.కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు గురించి తెలుసా?

Most Read Articles

Read more on: #ford #ఫోర్డ్
English summary
Read In Telugu: Ford Freestyle India Launch Soon; Expected Prices, Specifications, Features & Images
Story first published: Thursday, April 19, 2018, 8:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X