విడుదలకు ముందే రోడ్డెక్కిన ఫోర్డ్ ఫ్రీస్టైల్

Written By:

ఫోర్డ్ ఇండియా తమ సరికొత్త ఫ్రీస్టైల్ క్రాసోవర్ మోడల్‌ను జనవరి 2018లో ఆవిష్కరించింది. ఇప్పుడు, ఫోర్డ్ సంస్థ తమ ఫిగో ఆధారిత క్రాసోవర్ ఫ్రీస్టైల్ కారును లాంచ్ చేయడానికి సిద్దమైంది. అయితే, విడుదలకు ముందు గుర్గావ్‌లోని ఫోర్డ్ ఇండియా కార్పోరేట్ కంపెనీ వద్ద ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారు పట్టుబడింది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

విభిన్న డిజైన్ అంశాలతో ఫోర్డ్ ఇండియా తమ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారును ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా అభివృద్ది చేసింది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్రంట్ డిజైన్‌లో మస్టాంగ్ ఫ్రంట్ డిజైన్ ప్రేరణతో రూపొందించిన సరికొత్త హెక్సాగోనల్ హనీకాంబ్ గ్రిల్ మరియు బానెట్ ఇందులో ఉన్నాయి. ఈ క్రాసోవర్‌లో సరికొత్త స్వెప్ట్‌బ్యాక్ హెడ్ ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్రంట్ ఎండ్‌లో ఫాక్స్ స్కిడ్ ప్లేట్ మరియు బంపర్ మీద బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంది. సైడ్ ప్రొఫైల్‌లో కూడా బాడీ అంచుల వద్ద స్పోర్టివ్ బ్లాక్ క్లాడింగ్, మరియు రూఫ్ రెయిల్స్ ఉన్నాయి. ఫ్రీస్టైల్ రియర్ డిజైన్‌లో స్కిడ్ ప్లేట్ మరియు ఎత్తుగా ఉన్న బంపర్ వంటి కీలకమైన డిజైన్ అంశాలు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

ఫీచర్ల పరంగా యంగ్ ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఇంటీరియర్‌లో సరికొత్త ఫ్లోటింగ్ 6.5-అంగుళాల పరిమాణం ఉన్న సింక్3 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.

Recommended Video - Watch Now!
నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ | Tata Nexon AMT Details, Specifications - DriveSpark
ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

భద్రత పరంగా ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ మరియు యాక్టివ్ రోల్ఓవర్ ప్రివెన్షన్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

సాంకేతికంగా ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్‌లో అధునాతన 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ 94.6బిహెచ్‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

ఫ్రీస్టైల్ క్రాసోవర్‌లో ఉన్న 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 99బిహెచ్‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో లభిస్తున్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

ఫిగో హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే ఫ్రీస్టైల్ క్రాసోవర్ సస్పెన్షన్ సిస్టమ్ 15ఎమ్ఎమ్ వరకు పెరిగింది. మరియు దీని గ్రౌండ్ క్లియరెన్స్ 189ఎమ్ఎమ్‍గా ఉంది. ఫ్రీస్టైల్ క్రాసోవర్‌లో అత్యంత ఆకర్షణీయమైన 15-అంగుళాల 6-స్పోక్ డార్క్ కలర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫిగో హ్యాచ్‌బ్యాక్ మోడల్‌తో పోల్చుకంటే ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ ఒక ఆఫ్ రోడ్ హ్యాచ్‌బ్యాక్ శైలిలో ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటంతో అన్ని రకాల ఇండియన్ రోడ్లను ఫ్రీస్టైల్ ఎదుర్కోవడానికి సిద్దమని చెప్పవచ్చు. మరికొన్ని వారాల్లో ఫోర్డ్ ఇండియా ఫ్రీస్టైల్ క్రాసోవర్‌ను రూ. 6 లక్షల నుండి రూ. 8 లక్షల మధ్య అంచనా ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ పూర్తి స్థాయిలో లాంచ్ అయితే, విపణిలో ఉన్న టయోటా ఎటియోస్ క్రాస్, వోక్స్‌వ్యాగన్ పోలో క్రాస్, హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మరియు ఫియట్ అవెంచురా వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్

1. కొత్త స్విఫ్ట్ మరియు పాత స్విఫ్ట్ మధ్య తేడా ఏమిటి?

2.డిజైర్ మీద మారుతి చేస్తున్న ప్రయోగం బట్టబయలు

3.కొత్త కస్టమర్లకు మారుతి స్విఫ్ట్ అందని ద్రాక్షే...!!

4.సరికొత్త 2018 మారుతి స్విఫ్ట్ విడుదల: ధర రూ. 4.99 లక్షలు

5.ప్రతి హైదరాబాదీ ఈ ముగ్గురు వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే!!

Image courtesy: Kapil Joshi/Facebook

English summary
Read In Telugu: Ford Freestyle Spotted Ahead Of Launch — Expected Price, Specs, Features And More Details
Story first published: Wednesday, March 28, 2018, 15:21 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark