ఆటో ఎక్స్‌పో 2018: సిఆర్-వి ఎస్‌యూవీని ఆవిష్కరించిన హోండా మోటార్స్

Written By:

ఆటో ఎక్స్‌పో 2018: జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ ఢిల్లీలో జరుగుతున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కొత్త తరం సిఆర్-వి ప్రీమియమ్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

హోండా సిఆర్-వి 7 సీటర్ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోల కోసం...

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

సరికొత్త 7-సీటర్ మరియు డీజల్ వెర్షన్ సిఆర్-వి ప్రీమియమ్ ఎస్‌యూవీని 2018 తొలి సగం తరువాత రూ. 22 నుండి 23 లక్షల మధ్య ధరల శ్రేణిలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

Recommended Video - Watch Now!
Mahindra TUV Stinger Concept First Look; Details; Specs - DriveSpark
హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

ఐదవ తరానికి చెందిన సరికొత్త హోండా సిఆర్-వి ఎస్‌యూవీలో అదే 2.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది, 6,400ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 181బిహెచ్‌‌పి పవర్ మరియు 3,900ఆర్‌పిఎమ్ వద్ద 240ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం, సరికొత్త సిఆర్-వి ఎస్‌యూవీలో 1.6-లీటర్ కెపాసిటి గల ట్విన్-టుర్భో డీజల్ ఇంజన్ కలదు. 4,000ఆర్‌పిఎమ్ వద్ద 158బిహెచ్‌పి పవర్ మరియు 2,000ఆర్‌పిఎమ్ వద్ద 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

సరికొత్త డీజల్ ఇంజన్ ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం అభివృద్ది చేయడంతో పాటు ఉన్న మరో ప్రత్యేకతం దీనిని దేశీయంగానే ఉత్పత్తి చేస్తోంది. నిజమే, తక్కువ ధరలో అందుబాటులో ఉంచేందుకు రాజస్థాన్‌లోని తపుకరా హోండా ప్రొడక్షన్ ప్లాంటులో డీజల్ ఇంజన్‌ను తయారు చేస్తోంది.

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

నూతన డీజల్ ఇంజన్‌లో 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. ఇది ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్‌ను స్టాండర్డ్ వేరియంట్లో ఫ్రంట్ వీల్స్‌కు సరఫరా చేస్తుంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లు కూడా ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ వచ్చే అవకాశం ఉంది.

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

ఐదవ తరానికి చెందిన హోండా సిఆర్-వి మునుపటి మోడల్‌తో పోల్చుకుంటో కొలతల పరంగా చాలా పెద్దగా ఉంది. అదనంగా చేర్చిన చివరి వరుస సీటింగ్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. దీంతో మొత్తం 7 మంది కలిసి ప్రయాణించేందుకు వీలయ్యింది.

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

సరికొత్త హోండా సిఆర్-వి పొడవు 4,587ఎమ్ఎమ్, వెడల్పు 1,854ఎమ్ఎమ్, ఎత్తు 4,587ఎమ్ఎమ్, వీల్ బేస్ 2,659ఎమ్ఎమ్‌గా ఉంది. పాత సిఆర్-వితో పోల్చుకుంటే కొత్త సిఆర్-వి పొడవులో 58ఎమ్ఎమ్, ఎత్తు 25ఎమ్ఎమ్, వెడల్పు 35ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 40ఎమ్ఎమ్ వరకు పెరిగింది. అంతే కాకుండా బరువులో కూడా142కిలోలు పెరిగింది.

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

హోండా సిఆర్-వి డిజైన్

అత్యాధునిక డిజైన్ అంశాలతో వచ్చిన సరికొత్త హోండా సిఆర్-వి ప్రీమియం ఎస్‌యూవీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ్రంట్ డిజైన్ చాలా విశాలంగా, పలుచటి హెడ్ ల్యాంప్స్, ల్యాంప్స్‌కు ఇరువైపులా ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద పరిమాణంలో క్రోమ్ పట్టీ మరియు హోండా లోగోను గుర్తించవచ్చు.

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

హోండా సిఆర్-వి సైడ్ డిజైన్ విషయానికి వస్తే, సీటింగ్ కెపాసిటి పెంచడంతో ఎస్‌యూవీ పొడవు వెరిగింది. బాడీలో కలిసిపోయిన వీల్ ఆర్చెస్, పెద్ద పరిమాణంలో ఉన్న బాడీ క్లాడింగ్ మరియు పెద్ద అల్లాయ్ వీల్స్ వంటివి ఎస్‌యూవీకి ఆఫ్ రోడింగ్ లక్షణాలను తెచ్చిపెట్టాయి.

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

హోండా సిఆర్-వి రియర్ డిజైన్‌లో ఇరువైపులా ఎల్-ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్‌ను కలుపుతూ మధ్యలో హోండా లోగో గల క్రోమ్ స్ట్రిప్ ఉంది. రూఫ్ టాప్ నుండి రియర్ మిర్రర్ మీదుగా వెనక్కి వాలినట్లు కనిపించే బ్రేక్ లైట్ జోడింపు గల రియర్ స్పాయిలర్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న బంపర్ ఉన్నాయి.

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

సిఆర్-వి ఇంటీరియర్ మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే చాలా విశాలంగా ఉంది. డీజల్ వెర్షన్ ఎంచుకుంటే గేర్‌లీవర్ స్థానంలో సెంటర్ కన్సోల్ మీద బటన్స్ ఆధారిత కంట్రోల్స్ ఎన్నో వచ్చాయి.

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

విభిన్న లేయర్స్ కలిగి ఉన్న డ్యాష్‌బోర్డ్ మరియు వుడెన్ సొబగులు ఉన్న డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యానల్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ మధ్యలో పెద్ద పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

ఇంటీరియర్‌లో సీట్లు, అప్‌హోల్‌స్ట్రే మరియు పలు సెక్షన్‌లను లెథర్‍‌‌ ఫినిషింగ్‌లో గుర్తించవచ్చు. ఫ్రంట్ ప్యాసింజర్ మరియు డ్రైవర్ సీట్లు చాలా పెద్దగా ఉంటాయి. మూడవ వరుస సీటుకు స్థానం కల్పించడం కోసం రెండవ వరుస సీటును కొద్దిగా ముందుకు తీసుకొచ్చారు.

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ ఆవిష్కరణ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త సిఆర్-విలో మూడవ వరుస సీటింగ్ అందివ్వడంతో ఇప్పుడు అసలైన ప్రీమియం ఎస్‌యూవీ లక్షణాలను పొందింది. ఇండియన్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని కొత్త తరం సిఆర్-విలో సరికొత్త 1.6-లీటర్ డీజల్ ఇంజన్, 7-సీటింగ్ లేఔట్ మరియు పూర్తి స్థాయి ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ అంశాలతో హోండా అద్భుతమే చేసిందిని చెప్పాలి. పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే ఆశించిన ఫలితాలు తద్యం.

English summary
Read In Telugu: Auto Expo 2018: Honda CR-V Showcased - Price, Launch Date, Specs, Feature & Images
Story first published: Monday, February 12, 2018, 17:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark