ఒక్కసారి ఛార్జింగ్‌తో 300కిమీలు నడిచే హోండా జాజ్ ఎలక్ట్రిక్

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ జాజ్ హ్యాచ్‌బ్యాక్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఎలక్ట్రిక్ బ్యాటరీ సహాయంతో నడిచే జాజ్ హ్యాచ్‌బ్యాక్ సింగల్ ఛార్జింగ

By Anil Kumar

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ జాజ్ హ్యాచ్‌బ్యాక్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఎలక్ట్రిక్ బ్యాటరీ సహాయంతో నడిచే జాజ్ హ్యాచ్‌బ్యాక్ సింగల్ ఛార్జింగ్‌తో 300కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది.

హోండా జాజ్ ఎలక్ట్రిక్: ఒక్కసారి ఛార్జింగ్‌తో 300కిమీల మైలేజ్

నమ్మలేకపోతున్నారు కదూ....? మీరు చదివింది అక్షరాలా నిజమే... అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న నిస్సాన్ లీఫ్ మరియు టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కార్ల కంటే ఎక్కువ రేంజ్‌తో మరియు తక్కువ ధరలోనే లభించే హోండా జాజ్ ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

హోండా జాజ్ ఎలక్ట్రిక్: ఒక్కసారి ఛార్జింగ్‌తో 300కిమీల మైలేజ్

జాజ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో చైనాకు చెందిన ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ(CATL) సంస్థతో ఒప్పందం కుదుర్చుంకుంది. హోండా జాజ్ ఎలక్ట్రిక్ కారు కోసం కావాల్సిన బ్యాటరీలను CATL సరఫరా చేస్తుంది.

హోండా జాజ్ ఎలక్ట్రిక్: ఒక్కసారి ఛార్జింగ్‌తో 300కిమీల మైలేజ్

ఒక్కసారి ఛార్జింగ్‌తో 300కిలోమీటర్లు ప్రయాణించే కెపాసిటీతో రూపొందిస్తున్న జాజ్ ఎలక్ట్రిక్ మోడల్ ధర అంతర్జాతీయ విపణిలో 18,000 అమెరికా డాలర్లుగా ఉండవచ్చు. అంటే మన కరెన్సీలో రూ. 13 లక్షలు.

హోండా జాజ్ ఎలక్ట్రిక్: ఒక్కసారి ఛార్జింగ్‌తో 300కిమీల మైలేజ్

నిజానికి ఇలాంటి కెపాసిటి ఉన్న కార్ల ధరలు చాలా అధికంగా ఉన్నాయి. దేశీయ విపణిలో ఉన్న మహీంద్రా రెవా మరియు టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్ల ధరలు కూడా ఇదే రేంజ్‌లో ఉన్నాయి. జాజ్ ఎలక్ట్రిక్‌తో పోల్చుకుంటే వాటి పరిధి చాలా తక్కువ.

హోండా జాజ్ ఎలక్ట్రిక్: ఒక్కసారి ఛార్జింగ్‌తో 300కిమీల మైలేజ్

ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అధికంగా ఉన్న చైనా వంటి మార్కెట్లలో మాత్రమే హోండా ఈ జాజ్ ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులో ఉంచనుంది. ఇండియా తరహాలోనే చైనాలో కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్లు మరియు కార్లను కొనుగోలు చేసే దిశగా ప్రజలను చైతన్యపరుస్తోంది.

హోండా జాజ్ ఎలక్ట్రిక్: ఒక్కసారి ఛార్జింగ్‌తో 300కిమీల మైలేజ్

చైనా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఉన్న అవకాశాలను అందుకోవడానికి, ఇప్పటికే చాలా కంపెనీలు చైనాలో కార్యకలాపాలు ప్రారంభించాయి. అందులో జపాన్ దిగ్గజం హోండా తమ అత్యంత సరసమైన మరియు ఎక్కువ పరిధి గల జాజ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను సిద్దం చేసింది.

హోండా జాజ్ ఎలక్ట్రిక్: ఒక్కసారి ఛార్జింగ్‌తో 300కిమీల మైలేజ్

భారత్‌లో కూడా ఎలక్ట్రిక్ కార్లు మరియు టూ వీలర్ల అభివృద్ది, తయారీ మరియు సేల్స్‌ పరంగా తయారీదారులకు ప్రభుత్వం ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పిస్తోంది. అంతే కాకుండా, ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకునేందుకు రాయితీలను మరియు ప్రయోజనాలను ప్రకటించింది. కాబట్టి హోండా జాజ్ ఎలక్ట్రిక్ కారుకు చైనా తరువాత భారత్ అతి పెద్ద మార్కెట్ కానుంది.

హోండా జాజ్ ఎలక్ట్రిక్: ఒక్కసారి ఛార్జింగ్‌తో 300కిమీల మైలేజ్

ప్రస్తుతం దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పట్ల స్పష్టమైన విదివిధానాలు లేకపోవడంతో హోండా మోటార్స్ పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఏదేమైనప్పటికీ, ఇండియన్ మార్కెట్లోకి హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడానికి హోండా సిద్దంగా ఉంది.

హోండా జాజ్ ఎలక్ట్రిక్: ఒక్కసారి ఛార్జింగ్‌తో 300కిమీల మైలేజ్

హోండా ఇండియా లైనప్‌లో ఉన్న జాజ్ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. సాంకేతికంగా ఇందులో ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 87బిహెచ్‌పి-110ఎన్ఎమ్ మరియు 1.5-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 98.6బిహెచ్‌పి-200ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ట్రాన్స్‌మిషన్ అదే విధంగా డీజల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తున్నాయి.

Source: Electrek

Most Read Articles

English summary
Read In Telugu: Honda Jazz Electric to have a 300 kilometers battery range; Details revealed
Story first published: Sunday, May 27, 2018, 11:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X