భారీ సంఖ్యలో రీకాల్ అయిన హోండా కార్లు: వీటిలో మీ కారు ఉన్నట్లు ఇలా తెలుసుకోండి

జపానీస్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన సిటి, జాజ్ మరియు అకార్డ్ కార్లలో సుమారుగా 22,834 యూనిట్లను రీకాల్ చేసింది.

By Anil

Recommended Video

Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

జపానీస్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన సిటి, జాజ్ మరియు అకార్డ్ కార్లలో సుమారుగా 22,834 యూనిట్లను రీకాల్ చేసింది. 2013లో తయారు చేసిన ఈ కార్లలోని ఎయిర్‌బ్యాగుల్లో లోపం ఉన్నట్లు హోండా గుర్తించింది.

హోండా కార్ల రీకాల్

ప్రముఖ ఎయిర్ బ్యాగుల తయారీ దిగ్గజం టకాటా కార్పోరేషన్ నుండి సేకరించిన తమ కార్లలో అందించిన ఎయిర్ బ్యాగులు విచ్చుకోవడంలో లోపం ఉన్నట్లు గుర్తించడం జరిగింది.

హోండా కార్ల రీకాల్

అంతర్జాతీయంగా ఇప్పటికే పలు దశలలో రీకాల్ చేయగా, ఇప్పుడు ఎనిమిదవ దశలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా లోపం ఉన్న ఎయిర్ బ్యాగులు గల కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేసినట్లు హోండా ప్రకటించింది.

హోండా కార్ల రీకాల్

కస్టమర్ల భద్రత మరియు సౌకర్యార్థం సమస్య ఉన్న కార్లను స్వచ్ఛందంగా వెనక్కి పిలిచిన హోండా మోటార్స్, దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల ద్వారా కొత్త ఎయిర్‌బ్యాగులను ఉచితంగా మారుస్తామని తెలిపింది.

హోండా కార్ల రీకాల్

హోండా ఇండియా కస్టమర్లు 17 అంకెలున్న వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను హోండా ప్రత్యేకంగా రూపొందించిన మైక్రో వెబ్‌సైట్లో‌ ఎంటర్ చేసి ఈ రీకాల్ అయిన కార్లలో తమ కారు ఉందో లేదో తెలుసుకోవచ్చు.

హోండా కార్ల రీకాల్

తాజాగా ప్రకటించిన రీకాల్ జనవరి 19, 2018 నుండి మరో రెండు నెలల పాటు కొనసాగనుంది. సిటి, జాజ్ మరియు అకార్డ్ మోడళ్లలో 90శాతం కార్లు సిటి, 510 యూనిట్లు హోండా అకార్డ్ మరియు 240 యూనిట్ల హోండా జాజ్ ఉన్నాయి.

Trending On DriveSpark Telugu:

అరెనా షోరూముల్లో మాత్రమే లభించనున్న కొత్త తరం స్విఫ్ట్

డాట్సన్ నుండి 7-సీటర్ క్రాసోవర్ ఎస్‌యూవీ

ఈ ఎస్‌యూవీలు భారతదేశపు మైలేజ్ ఛాంపియన్లు

హోండా కార్ల రీకాల్

అంటే, సమస్యాత్మకంగా ఉన్న టకాటా ఎయిర్‌బ్యాగులు ప్రయాణికుల భద్రత మీద ప్రభావం చూపుతాయా...? ఖచ్చితంగా అవుననే చెప్పవచ్చు. టకాటా ఉత్పత్తి చేసిన ఎయిర్‌బ్యాగుల్లో ప్రమాదం జరిగినపుడు ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోవడానికి ఓ పీడనం వద్ద గాలి ఎయిర్‌బ్యాగులోకి చేరుతుంది. ఇలా పంపేదానిని ఇన్‌ఫ్లాయేటర్ అంటారు.

హోండా కార్ల రీకాల్

ఈ ఇన్‌ఫ్లాయేర్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. సమస్యాత్మకంగా ఉన్న వీటి ద్వారా ప్రమాదం జరిగినపుడు గాలి అధిక వేగంతో ఎయిర్‌బ్యాగులోకి వెళ్లడంతో ఎయిర్‌బ్యాక్ పేలిపోయే అవకాశం ఉంది. ఇలా జరిగితే ప్రయాణికుల ముఖం గాయలయ్యే అవకాశం ఉంది.

హోండా కార్ల రీకాల్

హోండా రీకాల్ ప్రకటించడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో 2017 జనవరిలో సుమారుగా 41,580 కార్లను ఇండియాలో రీకాల్ చేసింది. వాటిలో కూడా జాజ్, సిటి, సివిక్ మరియు అకార్డ్ కార్లు అధికంగా ఉన్నాయి.

హోండా కార్ల రీకాల్

అంతే కాకుండా, 2016 జూలైలో 2003 నుండి 2011 మధ్య తయారైన మునుపటి తరం అకార్డ్, సిఆర్-వి, సివిక్, సిటి మరియు జాజ్ కార్లను సుమారుగా 1,90,000 వరకు రీకాల్ చేసింది.

హోండా కార్ల రీకాల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కంపెనీలు కార్లను రీకాల్ చేస్తున్నాయంటే కస్టమర్లలో వాటి ఓ చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. తక్కువ సంఖ్యలో అయితే పర్వాలేదు, కానీ వేల సంఖ్యలో ప్రతి కార్లను రీకాల్ చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో ఉన్న ఆదరణ సన్నగిల్లుతుంది.

హోండా కార్ల రీకాల్

అయితే, హోండా మోటార్స్ ఇండియా ఇలాంటివి లెక్కజేయకుండా కస్టమర్ల భద్రతే ప్రధాన లక్ష్యంగా సమస్యాత్మకంగా ఉన్న కార్లలో రిపేరీ చేయడానికి స్వచ్ఛందంగా వెనక్కి పిలిచింది. కాబట్టి, తాజాగా జరిగిన రీకాల్‌లో మీ కారు ఉన్నట్లయితే సమీపంలోని హోండా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి లోపాన్ని సరిచేసుకోగలరు.

మరిన్ని తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‍‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Honda Recalls City, Jazz & Accord In India To Fix Faulty Airbag — Is Yours On The List?
Story first published: Saturday, January 20, 2018, 13:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X