కనీవిని ఎరుగని సేల్స్‌తో హోండాకు చుక్కలు చూపిస్తున్న డబ్ల్యూఆర్-వి

Written By:

హోండా మోటార్స్ గత ఏడాది విడుదల చేసిన డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీ హోండా ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. విడుదలైనప్పటి నుండి, గత ఏడాది కాలంలో 50,000 యూనిట్ల డబ్ల్యూఆర్-వి కార్లు అమ్ముడయ్యాయి.

హోండా డబ్ల్యూ ఆర్-వి

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మొత్తం విక్రయాల్లో డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ 28 శాతం సేల్స్ వాటా సొంతం చేసుకుంది. హోండా ఇండియా లైనప్‌లో ఎంతో కాలంగా సిటీ మిడ్ సైజ్ సెడాన్ మొదటి స్థానంలో ఉండేది. అయితే, డబ్ల్యూఆర్-వి రాకతో సిటీ రెండవ స్థానానికి పడిపోయింది.

హోండా డబ్ల్యూ ఆర్-వి

హోండా డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, ఎస్ మరియు విఎక్స్. డబ్ల్యూఆర్-వి మొత్తం విక్రయాల్లో విఎక్స్ మోడల్ సేల్స్ 80 శాతం వరకు నమోదయ్యాయి.

హోండా డబ్ల్యూ ఆర్-వి

హోండా డబ్ల్యూఆర్-వి టాప్ ఎండ్ వేరియంట్ విఎక్స్‌ ఎస్‌యూవీలో కస్టమర్లను ఆకట్టుకునే పలు విభిన్న ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 1.5-జీబీ ఇంటర్నల్ మెమొరీ, న్యావిగేషన్, రియర్ రిక్లైనింగ్ సీట్లు, జూమ్ ఆప్షన్ గల రియర్ పార్కింగ్ కెమెరా మరియు ఇతర మోడళ్లలో లేని ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హోండా డబ్ల్యూ ఆర్-వి

డబ్ల్యూఆర్-వి మొత్తం విక్రయాల్లో 58 శాతం సేల్స్ డీజల్ వేరియంట్ల నుండి, 42 శాతం సేల్స్ పెట్రోల్ వేరియంట్ల నుండి వచ్చినట్లు హోండా ప్రకటించింది. అంతే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న టైర్-I పట్టణాల్లో 38 శాతం, టైర్-II మరియు టైర్-III పట్టణాల్లో వరుసగా 30 మరియు 32 శాతం డబ్ల్యూఆర్-వి సేల్స్ నమోదయ్యాయి.

Recommended Video - Watch Now!
నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ | Tata Nexon AMT Details, Specifications - DriveSpark
హోండా డబ్ల్యూ ఆర్-వి

రీజనల్‌గా చూసుకుంటే, ఉత్తర భారతదేశంలో 30 శాతం, పశ్చిమ, ఉత్తర మరియు తూర్పు భారతదేశంలో వరుసగా 28,27 మరియు 15 శాతం డబ్ల్యూఆర్-వి సేల్స్ నమోదయ్యాయి.

హోండా డబ్ల్యూ ఆర్-వి

సాంకేతికంగా, హోండా డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. 1.2-లీటర్ కెపాసిటి గల ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ 90బిహెచ్‌‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా డబ్ల్యూ ఆర్-వి

అదే విధంగా 1.5-లీటర్ కెపాసిటి గల ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్ 100బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభించే డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ 5-స్పీడ్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమవుతున్నాయి.

హోండా డబ్ల్యూ ఆర్-వి

డబ్ల్యూఆర్-వి విజయం పట్ల, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు సిఇఒ యోయిచిరో యుయెనో మాట్లాడుతూ, "డబ్ల్యూఆర్-వి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడాన్ని హోండా ఇండియా గర్విచదగ్గ సందర్భం అని తెలిపారు. 50,000 సేల్స్ మైలు రాయితో హోండా డబ్ల్యూఆర్-వి భారీ విజయాన్ని అందుకొంది. అద్భుతమైన ఫీచర్లు మరియు అద్వితీయమైన పనితీరుతో ప్రతి సిటీ యంగ్ కస్టమర్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోందని చెప్పుకొచ్చాడు."

హోండా డబ్ల్యూ ఆర్-వి

హోండా మోటర్స్ డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీని మార్చి 2017లో రూ. 7.78 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో లాంచ్ చేసింది. జపాన్ దిగ్గజం దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టిన మిడ్-సైజ్ క్రాసోవర్‌లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఈ ఫీచర్లే ఎంతో కస్టమర్లను విజయవంతంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని కారణమయ్యాయి.

హోండా డబ్ల్యూ ఆర్-వి

1. కిమ్ జాంగ్ ఉన్ మిస్టరీ రైలు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!!

2.రాంగ్ సైడ్ డ్రైవింగ్ నివారించడానికి టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేసిన పోలీసులు

3.ఇండియాలో రోడ్డుకు ఎడమవైపునే డ్రైవ్ చేయడం వెనకున్న ఆంతర్యం ఏమిటి?

4. రైలు ప్రయాణం మనకు ఎంతో ఆనందం..... కాని రైలు నడిపే వారికి అదో నరకం...!!

5.2018 మారుతి స్విఫ్ట్ కారుకు క్రాష్ టెస్ట్: హిట్టా.. ఫట్టా..!!

English summary
Read In Telugu: WR-V Records Highest Sales Figures For Honda — Accounts For 28 Percent
Story first published: Thursday, March 29, 2018, 18:59 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark