హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేసిన హ్యుందాయ్

By Anil Kumar

దక్షిణ కొరియా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ మరో నెలలో తమ క్రెటా ప్రీమియమ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ తరుణంలో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని అత్యంత కఠినమైన ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ పట్టుబడింది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేసిన హ్యుందాయ్

హ్యుందాయ్ ఇండియా ఇప్పటికే తమ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ ప్రారంభించింది. రూ. 25,000 లు చెల్లించి హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేసిన హ్యుందాయ్

ఊటీకి సమీపంలో సముద్ర మట్టానికి 2,637 మీటర్లు ఎత్తులో ఉన్న దొడ్డబెట్ట ప్రాంతంలో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీకి అత్యంత కఠినమైన రహదారి పరీక్షలు నిర్వహించింది. ఊటీ సమీపంలో అత్యంత ఎత్తైన ప్రాంతం దొడ్డబెట్ట.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేసిన హ్యుందాయ్

సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా భారీ మార్పులే చోటు చేసుకున్నాయి. అదనంగా ఎన్నో నూతన ఫీచర్లు కూడా పరిచయమవుతున్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేసిన హ్యుందాయ్

క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్‌లో రీడిజైన్ చేయబడిన బంపర్, చతురస్రాకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్, నూతన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ మరియు అత్యంత ముఖ్యమైన స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి. సైడ్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు అయితే రూఫ్ రెయిల్స్‌ కాస్త భిన్నంగా ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేసిన హ్యుందాయ్

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ రియర్ డిజైన్‌లో నూతన బంపర్, బంపర్‌కు ఇరువైపులా రిఫ్లెక్టర్స్ మరియు స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి. క్రెటా వెనుక వైపున పై భాగంలో షార్క్ ఫిని యాంటెన్నా కలదు. క్రెటాకు ఎస్‍‌యూవీని రూపాన్ని తీసుకొచ్చే అధునాతన అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేసిన హ్యుందాయ్

క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ రివీల్ కాలేదు. అయితే, 2018 క్రెటా ఎస్‌యూవీలో ఖచ్చితంగా డ్యూయల్-టోన్ థీమ్ ఇంటీరియర్ రానుంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంకా ఎన్నో అత్యాధునిక ఫీచర్లు రానున్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేసిన హ్యుందాయ్

సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగడం లేదు. క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ అవే మునుపటి ఇంజన్ ఆప్షన్స్‌లో లభ్యం కానుంది. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని 1.6-లీటర్ పెట్రోల్, 1.4-లీటర్ డీజల్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్ అదే విధంగా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో ఎంచుకోవచ్చు.

Rushlaneహ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేసిన హ్యుందాయ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి ఇప్పటి వరకు సరైన పోటీ రాలేదు. అయినప్పటికీ, కస్టమర్లకు కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్ వెర్షన్‌లో అందుబాటులో ఉంచేందుకు క్రెటా ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రెటాతో పోల్చుకుంటే ప్రధానంగా గుర్తించదగిన మార్పులేమీ పెద్దగా చోటు చేసుకోలేదు.

Source: Rushlane

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Creta Facelift Spotted Testing In India; Expected Price, Specs And Features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X