2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు

By Anil Kumar

హ్యుందాయ్ ఇండియా విపణిలోకి సరికొత్త 2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ విడుదలకు చకచకా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. క్రెటా ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ ప్రారంభించినట్లు ఇప్పటికే ప్రచురించాము. అయితే, తాజాగా హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ లభ్యం కానున్న వేరియంట్లు మరియు ఫీచర్లు వివరాలు రహస్యంగా లీక్ అయ్యాయి.

2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఆరు విభిన్న వేరియంట్లలో లభించనుంది. ఇ, ఇ+, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ డ్యూయల్ టోన్ మరియు ఎస్ఎక్స్(ఒ). డిజైన్ పరంగా, సరికొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ పరంగా క్యాస్కేడింగ్ గ్రిల్, స్కిడ్ ప్లేట్లు, డ్యూయల్ టోన్ బంపర్ మరియు స్ల్పిట్ టెయిల్ క్లస్టర్ వంటి హైలైట్లతో పాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో చేతికి తొడిగే స్మార్ట్ కీ బ్యాండ్, ఆరు దిశలలో ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి పలు నూతన ఫీచర్లు పరిచయం అవుతున్నాయి. ఎస్ఎక్స్ ఆటోమేటిక్ వేరియంట్లో కేవలం సన్ రూఫ్ మాత్రమే వస్తోంది, మిగతా అన్ని ఫీచర్లు ఎస్ఎక్స్(ఒ) వేరియంట్లో లభిస్తాయి.

2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు

2018 హ్యుందాయ్ క్రెట్ ఫేస్‌లిఫ్ట్ ప్యాసన్ ఆరేంజ్ మరియు మెరైన్ బ్లూ అనే రెండు నూతన కలర్ ఆప్షన్స్‌లో లభ్యం కానుంది. అంతే కాకుండా, బ్లాక్ సన్ రూఫ్‌తో డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో కూడా లభిస్తుంది. దీనితో పాటు గతంలో లభించే ఫాంటమ్ బ్లాక్ రూఫ్ గల పోలార్ వైట్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ యథావిధిగా లభిస్తుంది.

2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు

భద్రత పరంగా 2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభ్యమవుతాయి. క్రెటా ఫేస్‌లిఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరాతో పాటు ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటివి ఉన్నాయి.

2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు

క్రెటా ఫేస్‌లిఫ్ట్ సాంకేతికంగా అవే మునుపటి ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో లభించనుంది. క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను 1.4-లీటర్ డీజల్, 1.6-లీటర్ డీజల్ మరియు 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో, 1.6-లీటర్ ఇంజన్‌లను 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అదే విధంగా 1.4-లీటర్ ఇంజన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

2018 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం విపణిలో ఉన్న క్రెటా ఎస్‌యూవీతో పోల్చితే, 2018 క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎన్నో అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది. ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్ల పరంగా క్రెటా ఫేస్‌లిఫ్ట్ పూర్తిగా అప్‌డేట్ చేసింది. తాజా పరిణామాల దృష్ట్యా హ్యుందాయ్ ఇండియా క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను ఈ నెల చివరి నాటికి మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

Source: TeamBHP

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Creta 2018 Facelift Variants And Features Leaked Ahead Of Launch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X