ఇయాన్ స్థానాన్ని భర్తీ చేయనున్న సరికొత్త హ్యందాయ్ శాంట్రో

హ్యుందాయ్ మోటార్స్ దేశీయ విపణిలోకి ఏహెచ్2 కోడ్ పేరుతో అభివృద్ది చేసిన సరికొత్త స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వయసు పైబడిన హ్యుందాయా ఇయాన్ కారును మార

By Anil Kumar

హ్యుందాయ్ మోటార్స్ దేశీయ విపణిలోకి ఏహెచ్2 కోడ్ పేరుతో అభివృద్ది చేసిన సరికొత్త స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వయసు పైబడిన హ్యుందాయా ఇయాన్ కారును మార్కెట్ నుండి తొలగించి, దీని స్థానంలో అతి త్వరలో విడుదల చేయనున్న అతి చిన్న కారును ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది.

ఇయాన్ స్థానాన్ని భర్తీ చేయనున్న సరికొత్త హ్యందాయ్ శాంట్రో

సరికొత్త ఏహెచ్2 కోడ్ పేరు గల చిన్న హ్యాచ్‌బ్యాక్ కారును శాంట్రో పేరుతో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచార వర్గాల కథనం. సరికొత్త హ్యుందాయ్ శాంట్రో పూర్తి స్థాయిలో విడుదలైతే, మార్కెట్లో ఉన్న ఇయాన్ మరియు గ్రాండ్ ఐ10 మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది.

ఇయాన్ స్థానాన్ని భర్తీ చేయనున్న సరికొత్త హ్యందాయ్ శాంట్రో

అయితే, న్యూ శాంట్రో విడుదలతో ఇయాన్ కారుకు వీడ్కోలు పలకనుంది. దీంతో హ్యుందాయ్ ఇండియా యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ శాంట్రో కానుంది. శాంట్రో విడుదలతోనే మార్కెట్‌కు దూరం చేయకుండా, 2019లో కాస్త ఆలస్యంగా విక్రయాలను నిలిపేయనున్నట్లు సమాచారం.

ఇయాన్ స్థానాన్ని భర్తీ చేయనున్న సరికొత్త హ్యందాయ్ శాంట్రో

2020 నుండి అత్యంత కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో, ఈ నియమాలను పాటించలేని ఇయాన్‌ను శాస్వతంగా తొలిగించి, దీని స్థానంలో గ్రాండ్ ఐ10 ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన సరికొత్త శాంట్రో కారును హ్యుందాయ్ ఇండియా యొక్క ఎంట్రీ లెవల్ మోడల్‌గా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇయాన్ స్థానాన్ని భర్తీ చేయనున్న సరికొత్త హ్యందాయ్ శాంట్రో

హ్యుందాయ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును పలుమార్లు అత్యంత రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. రహస్యంగా సేకరించిన ఫోటోలను పరిశీలిస్తే, మునుపటి తరానికి చెందిన శాంట్రో యొక్క అదే టాల్ బాయ్ డిజైన్‌ను యథావిధిగా కొనసాగించినట్లు తెలుస్తోంది.

ఇయాన్ స్థానాన్ని భర్తీ చేయనున్న సరికొత్త హ్యందాయ్ శాంట్రో

తాజాగా లభించి సమాచారం మేరకు, "హ్యుందాయ్ ఇయాన్ తయారీకి కావాల్సిన విడి భాగాలను సప్లై చేసే సరఫరాదారులు ఇయాన్‌ను మార్కెట్ నుండి అతి త్వరలో శాస్వతంగా తొలగిస్తున్న విషయాన్ని స్పష్టం చేశారు. కేవలం మరో ఏడాదికి కావాల్సిన విడి భాగాలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు."

ఇయాన్ స్థానాన్ని భర్తీ చేయనున్న సరికొత్త హ్యందాయ్ శాంట్రో

"భారత్‌లో అద్భుతమైన విజయం సాధించిన హ్యుందాయ్ దిగ్గజం అత్యంత వివేకవంతమైన నిర్ణయం తీసుకుంది. నూతన ఉద్గార ప్రమాణాలను పాటించని మరియు భద్రత పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించిన ఇయాన్ కారును మార్కెట్ నుండి తొలగించి, దీని స్థానంలో అన్ని ప్రమాణాలను పాటించే హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టడం ఒక వ్యూహాత్మక నిర్ణయం అని వారు చెప్పుకొచ్చారు."

ఇయాన్ స్థానాన్ని భర్తీ చేయనున్న సరికొత్త హ్యందాయ్ శాంట్రో

ఇయాన్ మోడల్‌కు వీడ్కోలు పలికిన తరువాత, ఇయాన్ ఫ్లాట్‌ఫామ్‌ను పూర్తిగా పక్కకు పడేయడం లేదు. ఈ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా భవిష్యత్తుకు సంభందించిన పలు నూతన ఉత్పత్తుల అభివృద్దికి ఉపయోగించుకోనుంది.

ఇయాన్ స్థానాన్ని భర్తీ చేయనున్న సరికొత్త హ్యందాయ్ శాంట్రో

హ్యుందాయ్ ఇయాన్ సేల్స్ ఎప్పటికప్పుడు గణనీయంగా తగ్గిపోతూనే ఉన్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కూడా ఇయాన్ విక్రయాలు 13 శాతం తగ్గిపోతున్నాయి. ఏదేమైనప్పటికీ, చివరి ఆర్థిక సంవత్సరంలో హ్యుందాయ్ ఇయాన్ 1.7 శాతం వృద్దిని నమోదు చేసుకోగలిగింది.

ఇయాన్ స్థానాన్ని భర్తీ చేయనున్న సరికొత్త హ్యందాయ్ శాంట్రో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ మోటార్స్ ఇయాన్ కారును మార్కెట్ నుండి తొలగిస్తే, ప్రొడక్షన్ ప్లాంటులో దీని స్థానాన్ని నూతన శాంట్రో భర్తీ చేయనుంది. కాబట్టి, హ్యుందాయ్ వారి స్మాల్ హ్యాచ్‌బ్యాక్‌ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హ్యుందాయ్ ప్రస్తుత 99శాతం దేశీయంగా తయారైన విడి భాగాలతో నూతన హ్యాచ్‌బ్యాక్ తయారీని చేపడుతోంది కాబట్టి, వీలైనంత వరకు తక్కువ ధరలో ప్రవేశపెట్టేందుకు. ఈ కొత్త కారును వచ్చే పండుగ సీజన్ నాటికి పూర్తి స్థాయిలో విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Most Read Articles

English summary
Read In Telugu: New Hyundai Santro Will Be A Replacement To The Entry-Level Eon Hatchback
Story first published: Tuesday, August 7, 2018, 10:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X