Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇండియన్ ఎక్స్‌పో 2018: ఐ20 యాక్టివ్ ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేసిన హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్స్ ప్రీమియమ్ క్రాసోవర్ సెగ్మెంట్లోకి ప్రవేశపెట్టిన ఐ20 యాక్టివ్ కొన్నాళ్లపాటు సెగ్మెంట్ లీడర్‌గా రాణించినప్పటికీ, కాలం ముందుకెళ్లేకొద్దీ ఇతర కంపెనీలు కొత్త మోడళ్లతో ఐ20 యాక్టివ్‌కు గట్టి పోటీని తీసుకొచ్చాయి.

ఇప్పుడు హ్యుందాయ్ తమ ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌ను అప్‌డేట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అతి త్వరలో ఢిల్లీలో ప్రారంభం కానున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద తమ సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్ ఐ20 యాక్టివ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఏడాదిలో మరో వారం రోజుల్లో మొదలయ్యే వాహన ప్రదర్శనలో ఆవిష్కరించిన అనంతరం, వెంటనే విపణిలోకి పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి సన్నద్దమైంది.

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఏడాదిలో మరో వారం రోజుల్లో మొదలయ్యే వాహన ప్రదర్శనలో ఆవిష్కరించిన అనంతరం, వెంటనే విపణిలోకి పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి సన్నద్దమైంది.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ ఫేస్‌లిఫ్ట్ విడుదలతో ఫోర్డ్ ఇటీవల ఆవిష్కరించిన ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారుకు గట్టి పోటీనివ్వనుంది. క్రాసోవర్ సెగ్మెంట్లో తన స్థానాన్ని పధిలం చేసుకోవడానికి హ్యుందాయ్ ఐ20 యాక్టివ్‌లో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా డిజైన్ అప్‌డేట్స్‌తో పాటు నూతన ఫీచర్లను పరిచయం చేయనుంది.

ఫేస్లిఫ్ట్ వెర్షన్‌లో పరిచయం చేయాలని చూస్తున్న ఐ20 యాక్టివ్ నిజానికి ఐ20 హ్యాచ్‌బ్యాక్ ఆధారిత మోడల్. అవే డిజైన్ లక్షణాలను పోలి ఉన్నప్పటికీ, క్రాసోవర్ తరహా రూఫ్ రెయిల్స్, స్కిడ్ ప్లేట్లు, బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వంటివి ఇందులో ప్రత్యేకంగా రానున్నాయి.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్‌లో సరికొత్త చతుర్భుజాకారంలో ఉన్న బ్లాక్ హనీకాంబ్ మెష్ ఫ్రంట్ గ్రిల్, స్వెప్ట్‌బ్యాక్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ మరియు సరికొత్త అల్లాయ్ వీల్స్ రానున్నాయి.
టిబెట్ మీదుగా ప్రయాణించలేకపోతున్న విమానాలు: ఎందుకో తెలుసా?
డెలివరీ తీసుకున్న 3 గంటల్లోపే విరిగిపోయిన యాక్సిల్స్
హ్యుందాయ్ శాంట్రో విడుదల వివరాలు

ఇంటీరియర్‌లో అత్యంత కీలకమైన మార్పులు జరగనున్నాయి. ఐ20 యాక్టివ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేయగల పెద్ద పరిమాణంలో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంకా ఎన్నో ఫీచర్లు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయ.

సాంకేతికంగా రెగ్యులర్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్న అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు ఐ20 యాక్టివ్ ఫేస్‌లిఫ్ట్‌లో వస్తున్నాయి. ఇందులోని 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ 82బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ టార్క్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 220ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్ పరంగా చూసుకున్నప్పటికీ, అవే గేర్‌బాక్సులు ఇందులో రానున్నాయి. పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు డీజల్ ఇంజన్ వెర్షన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో వస్తున్నాయి. అయితే, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరంగా ఎలాంటి సమాచారం లేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హ్యుందాయ్ మోటార్స్ తమ ఐ20 యాక్టివ్ ఫేస్‍లిఫ్ట్ క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్‌ను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించాలని ముందే ప్లాన్ చేసుకుంది. అయితే, అనూహ్యంగా ఫోర్డ్ తమ ఫ్రీస్టైల్ క్రాసోవర్‌ను తాజాగా ఆవిష్కరించి ఈ సెగ్మెంట్లో వేడిని మరింత రాజేసింది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్‌ను 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వెర్షన్‌లో ఆవిష్కరించింది. దీనికి గట్టి పోటీగా వస్తున్న హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ వివిధ వేరియంట్ల ఆధారంగా రూ. 7 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్య ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.
Trending DriveSpark Telugu YouTube Videos