Just In
Don't Miss
- News
డీఎంకెతో ఎంఐఎం పొత్తు..? కుదరకపోతే ఒంటరిగానే... తమిళ గడ్డపై మజ్లిస్ మ్యాజిక్ పనిచేస్తుందా?
- Sports
బీసీసీఐ ఫిట్నెస్ టెస్ట్ విఫలమైన రాహుల్ తెవాటియా.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు డౌటే!
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కోనా ఎలక్ట్రిక్ వెహికల్ విడుదల వివరాలు వెల్లడించిన హ్యుందాయ్
మానవ జీవితంలో ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తు రవాణా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని చేపట్టాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉన్న ఎన్నో వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది మరియు తయారీ మీద దృష్టి సారించాయి.

తాజాగా, దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ దేశీయ విపణిలోకి ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. 2019 మలిసగంలో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సిద్దమైన్నట్లు కంపెనీ ప్రకటించింది.

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది. దీనిని ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. దేశీయంగా హ్యుందాయ్ విడుదల చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ కారు గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

హ్యుందాయ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సీఈఓ, వైకె కూ మాట్లాడుతూ, "ఈ ఏడాది నుండి 2020 మధ్య ఇండియన్ మార్కెట్లోకి హ్యుందాయ్ విడుదల చేయనున్న ఎనిమిది కొత్త మోడళ్లలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా ఉంది. దీనిని 2019 సంవత్సరం మలిసగంలో లాంచ్ చేయాలని భావిస్తున్నాము. తొలుత పూర్తి స్థాయిలో నిర్మించిన ఉత్పత్తులను దిగుమతి చేసుకుని విక్రయించనున్నట్లు వివరించాడు."

హ్యుందాయ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కథనం మేరకు, కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంప్లీట్లి నాక్డ్ డౌన్(CKD) యూనిట్‌గా దిగుమతి చేసుకుని తమిళనాడులోని ప్రొడక్షన్ ప్లాంటులో అసెంబుల్ చేసి, మార్కెట్లోకి తీసుకురానుంది. ఎలక్ట్రిక్ వెహికల్‌ను దేశీయంగా అసెంబుల్ చేయడంతో దిగుమతి ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి. దాంతో తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వెహికల్ రెండు విభిన్న వేరియంట్లలో లభ్యం కానుంది. వీటిలో ఒకటి తక్కువ రేంజ్ గల 39.2kW బ్యాటరీ మరియు మరొకటి అధిక రేంజ్ గల 64kW సామర్థ్యం ఉన్న బ్యాటరీతో లభ్యమవుతుంది.

39.2kW బ్యాటరీ వేరియంట్ 133బిహెచ్‌పి పవర్ మరియు 395ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది మరియు ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 299కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల 10 నిమిషాలు పడితుంది. అయితే, ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 54 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేయవచ్చు.

ఎక్కువ రేంజ్ గల 64kW బ్యాటరీ వేరియంట్ గరిష్టంగా 201బిహెచ్‌పి పవర్ మరియు 395ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరియు ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 469కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పూర్తి స్థాయిలో ఛార్జ్ అవ్వడానికి 9 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది, అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 54 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ వేరియంట్ గరిష్టంగా గంటకు167కిమీల వేగాన్ని అందుకుంటుంది.

కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో పాటు 2018-2020 మధ్య కాలంలో ఎనిమిది కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని హ్యుందాయ్ భావిస్తోంది. వీటిలో మూడు మోడళ్ల విడుదల ఇప్పటికే ఖాయం అయ్యాయి. మొదటిది సరికొత్త శాంట్రో, కార్లినో కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు కోనా ఎలక్ట్రిక్ కారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హ్యుందాయ్ ఇండియా విభాగం కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదలను ఖరారు చేసింది. ఛార్జింగ్ స్టేషన్ల కొరత సమస్య కోనా ఎలక్ట్రిక్ విడుదలకు పెద్ద సవాలుగా మారనుంది. కానీ, 2030 నాటికి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మాత్రమే అనుమతించాలని భారత ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా హ్యుందాయ్ తప్పకుండా కోనా ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది.
ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రమే పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది.