TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
కొత్త ఇంజన్ ఆప్షన్‌లో హ్యుందాయ్ వెర్నా విడుదల: ధర, ఇంజన్, ఫీచర్ల కోసం

హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి వెర్నా మిడ్ సైజ్ సెడాన్ కారును సరికొత్త 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో విడుదల చేసింది. హ్యుందాయ్ వెర్నా 1.4-లీటర్ పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.79 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
1.4-పెట్రోల్ ఇంజన్ గల హ్యుందాయ్ వెర్నా రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. అవి, ఇ(E) మరియు ఇఎక్స్(EX). వీటి ధరలు వరుసగా రూ. 7.79 లక్షలు మరియు రూ. 9.09 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు హ్యుందాయ్ తెలిపింది.
హ్యుందాయ్ మోటార్స్ గత ఏడాది ఆగష్టు నెలలో కొత్త తరం వెర్నా కారును విపణిలోకి ప్రవేశపెట్టింది. అప్పటి వరకు పూర్తి పడిపోయిన భారీగా పతనమైన సేల్స్ దీని విడుదలతో విపరీతంగా పుంజుకున్నాయి.
30,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ మరియు 2 లక్షలకు పైగా ఎంక్వైరీలు వచ్చినట్లు దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ వెల్లడించింది. అంతే కాకుండా వెర్నా మీద 10,500 యూనిట్ల కార్ల ఎగుమతికి భారీ ఆర్డర్ లభించింది.
కొత్త తరం హ్యుందాయ్ వెర్నా 2017 ఏడాదికి గాను ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకుంది. విడుదలైనప్పటి నుండి సరికొత్త హ్యుందాయ్ వెర్నా 1.6-లీటర్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో మాత్రమే లభించేది.
ఇప్పుడు, హ్యుందాయ్ తమ వెర్నాలో సరికొత్త 1.4-లీటర్ కెపాసిటి గల కప్పా డ్యూయల్ విటివిటి పెట్రోల్ ఇంజన్ పరిచయం చేసింది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 99బిహెచ్‌పి పవర్ మరియు 132ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ మైలేజ్ మరింత మెరుగుపడి 8 శాతం వరకు పెరిగినట్లు హ్యుందాయ్ ప్రకటించింది. దీని గరిష్ట మైలేజ్ లీటరుకు 19.1 కిలోమీటర్లుగా ఉంది.
Trending On DriveSpark Telugu:
ఎయిర్‌బ్యాగ్స్: ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాలు, చరిత్ర
ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో: వీటిలో ఏది బెస్ట్ ?
ఈ విమానం 2 గంటల్లో భూమ్మీద ఏ మూలకైనా చేరుకోగలదు
హ్యుందాయ్ తొలుత విడుదల చేసిన కొత్త వెర్నాలో 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ కలదు. సరికొత్త వెర్నాలోని 1.6-లీటర్ డీజల్ ఇంజన్ 126బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
అదే విధంగా వెర్నా 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 121బిహెచ్‌పి పవర్ మరియు 151ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో లభిస్తున్నాయి.
హ్యుందాయ్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ డైరక్టర్ రాకేష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ,"హ్యుందాయ్ వెర్నా మిడ్ సైజ్ సెడాన్ కార్లలో సూపర్ కార్ అని అన్నారు. 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ అదే విధంగా 1.4-లీటర్ ఇంజన్‌లతో పలు రకాల ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా వెర్నా కారును అందుబాటులో ఉంచినట్లు చెప్పుకొచ్చాడు."
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
1.6-లీటర్ కెపాసిటి గల ఇంజన్‌లతో లభించినపుడే అత్యుత్తమ సేల్స్ సాధించిన వెర్నా ఇప్పుడు తక్కువ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ వెర్షన్‌లో వచ్చింది. వెర్నా సెడాన్ కారును ఇష్టపడి కూడా బడ్జెట్ సమస్య కారణంగా ఇబ్బందిపడే వారికి 1.4-లీటర్ వెర్నా అత్యుత్తమ ఎంపికగా నిలవనుంది.
Trending DriveSpark Teluu YouTube Videos