TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
దేశీయ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి హ్యుందాయ్ ఆరంగేట్రం
హ్యుందాయ్ మోటార్స్ దేశీయ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి అతి త్వరలో తమ మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నద్దమవుతోంది. తొలుత జెనీవా మోటార్ షో లో ఆవిష్కరించిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దేశీయంగా తమ తొలి ఎలక్ట్రిక్ మోడల్‌గా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
కంపెనీ సమచారం మేరకు, కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంభందించిన విడి భాగాలను పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకొని చెన్నైలోని ప్రొడక్షన్ ప్లాంటులో అసెంబుల్ చేయనున్నట్లు తెలిసింది. 2020 నాటికి కంపెనీ విడుదల చేయాలని భావించిన 8 కొత్త కార్లలో కోనా ఎలక్ట్రిక్ ఒకటని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు.
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అంతర్జాతీయంగా రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అయితే, ఇండియన్ మార్కెట్ కోసం కేవలం ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను మాత్రమే తీసుకొచ్చే అవకాశం ఉంది.
కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎంట్రీ లెవల్ వేరియంట్లో 131బిహెచ్‌పి పవర్ మరియు 395ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటి ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. 39.3kWh యూనిట్ల సామర్థ్యం గల బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్‌తో సుమారు 300కిమీల మైలేజ్ ఇస్తుంది.
100kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఒక్క గంటలో 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుందని హ్యుందాయ్ వెల్లడించింది. సాధారణ ఏసి పాయింట్ ద్వారా పూర్తి ఛార్జ్ అవ్వడానికి 6 గంటల సమయం పడుతుంది.
హ్యుందాయ్ మోటార్స్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం లేదు. తొలుత ఢిల్లీ మరియు ముంబాయ్ నగరాల్లో ఆ తరువాత పలు ఇతర మెట్రో నగరాలలో పరిచయం చేయనుంది.
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 9.3 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 167కిలోమీటర్లుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న మోడల్ తరహాలోనే ఇండియన్ వెర్షన్ కోనా ఎస్‌యూవీని ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌ను ఏరోడైనమికల్‌గా తీర్చిదిద్దారు.
కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో బాడీ క్రింది వైపున బ్యాటరీలను అందించారు. కాబట్టి, క్యాబిన్ లేదా బూట్ స్పేస్‌ను బ్యాటరీలు హరించలేవు. ప్రస్తుతం ఇందులో పూర్తిగా మూసివేసిన ఫ్రంట్ గ్రిల్ మరియు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
హ్యుందాయ్ కోనా ఇంటీరియర్ విషయానికి వస్తే, సరికొత్త ఫీచర్లు ఉన్న డిజిటల్ డిస్ల్పే, హెడ్స్-అప్ డిస్ల్పే మరియు 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ముందువైపునున్న రెండు సీట్లు హీటెడ్ ఫంక్షన్ మరియు 8-దిశలలో అడ్జెస్ట్ చేసుకునే అవకాశం ఉంది.
భద్రత పరంగా ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కార్నరింగ్ సిస్టమ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉన్నాయి. అన్నింటికీ మించి న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (NCAP) క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ పొందింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అద్భుతమైన డైనమిక్స్‌తో అమితంగా ఆకట్టుకునే ఎక్ట్సీరియర్ డిజైన్ కలిగి ఉంది. ఇంటీరియర్ కూడా ఎంతో సౌకర్యకరంగా మరియు విశాలంగా ఉంది. ఈ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ అంశాల పరంగా కోనా ఎస్‌యూవీకి మంచి మార్కులే పడ్డాయి. భవిష్యత్ రవాణా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఆధారపడటంతో పెట్రోల్ మరియు డీజల్ వాహనాలకు దీటుగా అత్యద్భుతమైన కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.