హ్యుందాయ్ ఎక్సెంట్ కారులో తప్పనిసరిగా వచ్చిన సేఫ్టీ ఫీచర్లు ఇవే!!

హ్యుందాయ్ మోటార్స్ తమ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కారులో పలు అదనపు సేఫ్టీ ఫీచర్లను జోడించింది. అవును, హ్యుందాయ్ ఎక్సెంట్ అన్ని వేరియంట్లలో ఇప్పుడు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స

By Anil Kumar

హ్యుందాయ్ మోటార్స్ తమ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కారులో పలు అదనపు సేఫ్టీ ఫీచర్లను జోడించింది. అవును, హ్యుందాయ్ ఎక్సెంట్ అన్ని వేరియంట్లలో ఇప్పుడు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్లు తప్పనిసరిగా అందుబాటులోకి వచ్చాయి.

హ్యుందాయ్ ఎక్సెంట్ సేఫ్టీ ఫీచర్లు

గతంలో హ్యుందాయ్ ఎక్సెంట్ లభించే అన్ని వేరియంట్లో కేవలం డ్యూయల్ ఎయిర్ బ్యాగులు మాత్రమే లభించేవి, తాజాగా జరిగిన అప్‌డేట్స్‌తో ఏబిఎస్ మరియు ఇబిడి ఫీచర్లు కూడా స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి.

హ్యుందాయ్ ఎక్సెంట్ సేఫ్టీ ఫీచర్లు

అంతే కాకుండా, హ్యుందాయ్ ఎక్సెంట్ మిడిల్ వేరియంట్ ఇ+ ను తొలగించింది. దీంతో హ్యుందాయ్ ఎక్సెంట్ ఇప్పుడు నాలుగు వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతోంది. అవి, ఇ, ఎస్, ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్(ఒ).

హ్యుందాయ్ ఎక్సెంట్ సేఫ్టీ ఫీచర్లు

పలు భద్రత ఫీచర్ల జోడింపు అనంతరం, హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.5 లక్షలు మరియు డీజల్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.61 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

హ్యుందాయ్ ఎక్సెంట్ సేఫ్టీ ఫీచర్లు

హ్యుందాయ్ ఎక్సెంట్ అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. ఇవి వరుసగా, 82బిహెచ్‌పి-114ఎన్ఎమ్ మరియు 70బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు ఇంజన్ వేరియంట్లను 5-స్పీడ్ మ్యాన్యువల్ అదే విధంగా పెట్రోల్ వేరియంట్‌ను 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు.

హ్యుందాయ్ ఎక్సెంట్ సేఫ్టీ ఫీచర్లు

హ్యుందాయ్ ఎక్సెంట్ విపణిలో ఉన్న మారుతి సుజుకి డిజైర్ మరియు సరికొత్త హోండా అమేజ్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది. డిజైర్ మరియు అమేజ్ రెండు మోడళ్లలోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు ఏబిఎస్ కలిగి ఉన్నాయి. అయితే, ఈ రెండు సెడాన్ కార్లలో ఇబిడి రాలేదు. కాబట్టి, ఈ మూడింటిలో భద్రత పరంగా హ్యుందాయ్ ఎక్సెంట్ కారుదే పైచేయి.

హ్యుందాయ్ ఎక్సెంట్ సేఫ్టీ ఫీచర్లు

సేల్స్ విషయానికి వస్తే, హ్యుందాయ్ ఎక్సెంట్ మూడవ స్థానంలో నిలిచింది. వరుసగా తొలి రెండు స్థానాల్లో మారుతి డిజైర్ మరియు హోండా అమేజ్ కార్లు ఉన్నాయి. హోండా అమేజ్ ఇటీవల విడుదలైన మూడు నెలలో 30,000 సేల్స్ మైలురాయిని అందుకొంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ కూడా కొత్త తరం ఎక్సెంట్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.

హ్యుందాయ్ ఎక్సెంట్ సేఫ్టీ ఫీచర్లు

విశ్వసనీయమైన ఇంజన్ పనితీరు మరియు నమ్మదగిన మైలేజ్ ఇచ్చే హ్యుందాయ్ ఎక్సెంట్ కూడా ఈ సెగ్మెంట్లో నిలకడైన ఫలితాలు సాధిస్తోంది. ఇంటీరియర్ కూడా చాలా విశాలంగా ఉంటుంది మరియు సౌకర్యవంతమైన ప్రయాణానికి ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఎక్సెంట్ సేఫ్టీ ఫీచర్లు

తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ ఎక్సెంట్ లభించే అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్ మరియు ఇబిడి సేఫ్టీ ఫీచర్లు రావడంతో అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ సెడాన్‌గా నిలిచింది. ఈ అదనపు సేఫ్టీ ఫీచర్ల జోడింపుతో హ్యుందాయ్ ఎక్సెంట్ సేల్స్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Xcent Gets Additional Standard Safety Features
Story first published: Monday, August 27, 2018, 15:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X