వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ ఎస్‌యూవీ అధికారిక వివరాలు వెల్లడి
వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ అంతర్జాతీయ ఆవిష్కరణ నేపథ్యంలో తాజాగా టి-క్రాస్‌ను పరీక్షిస్తున్న ఒక వీడియోను వోక్స్‌వ్యాగన్ అధికారికంగా రివీల్ చేసింది. టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని వీడియో ద్వారా పూర్తిగా ర
జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ పేరుతో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించడానికి సిద్దమవుతోంది. వోక్స్‌వ్యాగన్ తమ టి-క్రాస్ ఎస్‌యూవీని ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటాకు పోటీగా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ అంతర్జాతీయ ఆవిష్కరణ నేపథ్యంలో తాజాగా టి-క్రాస్‌ను పరీక్షిస్తున్న ఒక వీడియోను వోక్స్‌వ్యాగన్ అధికారికంగా రివీల్ చేసింది. టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని వీడియో ద్వారా పూర్తిగా రివీల్ చేసింది.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ ఎస్‌యూవీని తొలుత అంతర్జాతీయ విపణిలో విడుదల చేసి, 2020 నాటికల్లా దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది. ఇంటర్నేషనల్ మోడల్ టి-క్రాస్ ఎస్‌యూవీతో పోల్చుకుంటే ఇండియన్ వెర్షన్‌ను దేశీయ రహదారులకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు.

ప్రపంచ విపణి కోసం సిద్దమవుతున్న టి-క్రాస్ ఎస్‌యూవీని వోక్స్‌వ్యాగన్ వారి ఫ్లెక్సిబుల్ ఎమ్‌క్యూబీ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తుండగా, ఇండియన్ వెర్షన్ టి-క్రాస్ మోడల్‌ను ఎమ్‌క్యూబీ ఏఓ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తున్నారు. డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లు, సేఫ్టీ మరియు పలు రకాల ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లు ఇండియన్ టి-క్రాస్‌లో విభిన్నంగా ఉండనున్నాయి.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్లో దేశీయంగా తయారవుతున్న 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించే అవకాశం ఉంది.

వోక్స్‌వ్యాగన్ వారి శక్తివంతమైన 1.0-లీటర్ ఇంజన్ గరిష్టంగా 115బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. తక్కువ ధరతో అందించే ఉద్దేశ్యంతో పూర్తి స్థాయిలో దేశీయంగా తయారయ్యే ఇంజన్‌లను ఉపయోగించనుంది.

వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ డీజల్ వేరియంట్ కోసం ప్రస్తుతం పోలో మరియు వెంటో కార్లలో ఉన్నటువంటి 1.5-లీటర్ ఇంజన్ అందివ్వనుంది. కానీ, 2020 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చే బిఎస్-VI ఉద్గార ప్రమాణాలను పాటించేలా ఈ ఇంజన్‌ను మరింత అభివృద్ది చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్‌మిషన్ పరంగా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లు ఉండవచ్చు.

వోక్స్‌వ్యాగన్ ఇండియా విభాగం దేశీయంగా ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్ ఎస్‌యూవీలకు పోటీగా టి-క్రాస్ ఎస్‌యూవీని తీసుకొస్తోంది. కానీ, వోక్స్‌వ్యాగన్ 2.0 స్ట్రాటజీలో భాగంగా ఇది క్రెటా మరియు డస్టర్ కంటే ఖరీదైన మోడల్‌గా రానుంది. కాబట్టి రెనో క్యాప్చర్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది.

ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి వోక్స్‌వ్యాగన్ గ్రూపు ఇప్పటి వరకు ప్రవేశించలేదు. ఈ విభాగంలో ఉన్న ఇతర మోడళ్లు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో వోక్స్‌వ్యాగన్ 2.0 స్ట్రాటజీలో భాగంగా టి-క్రాస్ ఎస్‌యూవీని లాంచ్ చేయాలని నిర్ణయించుకుంది.
Image courtesy:6,7,8


Click it and Unblock the Notifications








