సూపర్ కారులో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్: ఈ ఘనత సౌత్ ఇండియాదే!!

ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా..? అత్యంత అరుదైన పోర్షే 911 జిటి3(991.2 జనరేషన్) కారును కర్ణాటకలోని మంగళూరు నగరవాసి మ్యన్యుల్ గేర్‌బాక్స్‌తో తెప్పించుకున్నాడు.

By Anil

Recommended Video

Andhra Pradesh State Transport Bus Crashes Into Bike Showroom - DriveSpark

ప్రపంచ స్పోర్ట్స్ కార్ల శ్రేణిలో పోర్షే 911 జిటి3 అత్యంత అరుదైన కారు, ప్రత్యేకించి ఇండియాలో. 991.2 జనరేషన్ నుండి వచ్చిన రెండవ 911 జిటి3 స్పోర్ట్స్ కారు గత ఏడాది అక్టోబరులో విపణిలోకి లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇది భారతదేశపు గ్రీన్‌సిటీగా పేరుగాంచిన బెంగళూరులో ల్యాండ్ అయ్యింది.

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా..? అత్యంత అరుదైన పోర్షే 911 జిటి3(991.2 జనరేషన్) కారును కర్ణాటకలోని మంగళూరు నగరవాసి మ్యన్యుల్ గేర్‌బాక్స్‌తో తెప్పించుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కారు బహుశ మన ఇండియాలో మాత్రమే ఉంది కాబోలు....

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

స్పోర్ట్స్ మరియు సూపర్ కార్లు సాధారణంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తాయి. అయితే, పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్ మరియు డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ పిడికె గేరే‌బాక్స్‌లతో లభ్యమవుతోంది. వీటిలో మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ గల 911 జిటి3 సూపర్ కారు ఇప్పుడు సౌత్ ఇండియాలోకి ల్యాండ్ అయ్యింది.

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

పోర్షే 991.2 జనరేషన్‍‌‌కు చెందిన పోర్షే 911 జిటి3 బ్రాండ్ న్యూ సూపర్ కారు తప్పకుండా జిటి3 బ్యాడ్జ్ కలిగి ఉంటుంది. ఇప్పుడు బెంగళూరు పోర్షే సెంటర్‌కు చేరుకున్న 911 జిటి3 కారులో 4.0-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఫ్లాట్-6 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు.

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

విపరీతంగా శబ్దం చేస్తూ గర్జించే ఇంజన్ కారుకు వెనుక వైపున అందివ్వడం జరిగింది. ఇది 8,250ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 493బిహెచ్‌పి పవర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వద్ద 460ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ రియర్ వీల్స్‌కు సరఫరా అవుతుంది.

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

జర్మనీ నుండి బెంగళూరుకు చేరుకున్న పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న సూపర్ కారు కేవలం 3.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్న అందుకుంటుంది. మరియు 160కిమీల వేగాన్ని 7.6సెకండ్ల వ్యవధిలో చేరుకుంటుంది.

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

పిడికె ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ గల జిటి3తో పోల్చుకుంటే భారతదేశపు మొట్టమొదటి మ్యాన్యువల్ పోర్షే 911 జిటి మరింత వేగవంతమైనది. ఆటోమేటిక్ వెర్షన్‌కు ధీటుగా 80 నుండి 120కిమీల వేగాన్ని కేవలం 2 సెకండ్లలోనే చేధిస్తుంది.

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

సరికొత్త పోర్షే 911 జిటి3 పొడవు 4,562ఎమ్ఎమ్, వెడల్పు 1,852ఎమ్ఎమ్, ఎత్తు 1,271ఎమ్ఎమ్, వీల్ బేస్ 2,457ఎమ్ఎమ్‌గా ఉంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ జిటి3 బరువు పిడికె ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్‌ జిటి3 కంటే 15కిలోల తక్కువ బరువుతో మొత్తం 1,415కిలోలుగా ఉంది.

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

జిటి3 సూపర్ కారులో ముందు వైపున యాంటీ-రోల్ బార్ గల మెక్‌పర్సన్ ఫ్రంట్ యాక్సిల్ మరియు వెనుక వైపున మల్టీ లింక్ సెటప్ ఉంది. అంతే కాకుండా, అడ్జెస్టబుల్ డ్యాంపర్లు మరియు రియర్ వీల్ స్టీరింగ్ అనుసంధానంతో పాటు, డ్రైవింగ్ డైనమిక్స్ మెరుగుపరిచే ఛాసిస్‌ను మోటార్‌స్పోర్ట్స్ బృందం డెవలప్ చేసింది.

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

పోర్షే 911 జిటి3 ట్రాక్ ఫోకస్ట్ సూపర్ కారు, బెంగళూరుకు చేరుకున్న పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్ కారు సిల్వర్ పెయింట్ స్కీమ్‌లో ఉంది. రియర్ డిజైన్‌లో 4.0 బ్యాడ్జింగ్, సెంటర్ లాకింగ్ వీల్స్ మరియు ఎక్ట్సీరియర్‌లో విపరీతంగా ఉపయోగించిన కార్బన్-ఫైబర్‌ను గమనించవచ్చు.

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

ఇందులో భారీ పరిమాణంలో ఉన్న 20-అంగుళాల చక్రాలకు ముందు వైపు 245/35 జడ్ఆర్ 20 మరియు వెనుక వైపున 305/30 జడ్ఆర్ 20 కొలతల్లో ఉన్న మిచేలియన్ పైలట్ స్పోర్ట్ కప్ 2 టైర్లు ఉన్నాయి. భారతదేశపు తొలి మ్యాన్యువల్ పోర్షే 911 జిటి3 కారులో ఉన్న చక్రాలకు 380ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న స్టీల్ బ్రేకులు ఉన్నాయి.

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

ఇంటీరియర్‍‌లో సౌకర్యం, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంభందించిన అతి ముఖ్యమైన ఫీచర్లున్న మ్యాన్యువల్ వెర్షన్ 911 జిటి3 ఎంచుకున్నాడు. అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎయిర్-కండీషనింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

అయితే, పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్ ఇంటీరియర్‌లో మైక్రోఫైబర్ పదార్థంతో తయారు చేసిన అల్కంటారా సీట్లను మ్యాన్యువల్‌గా అడ్జెస్ట్ చేసుకునేలా అందివ్వడం జరిగింది. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు, మ్యాన్యువల్ అడ్జెస్టబుల్ సీట్లను అందివ్వడం కారు బరువు తగ్గడానికి సాధ్యంమైంది.

భారతదేశపు తొలి పోర్షే 911 జిటి3 మ్యాన్యువల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశపు తొలి 911 జిటి3 (991.2) మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కారు భారత్‌ను చేరింది. ఈ కారు చేరికతో బెంగళూరులో సూపర్ కార్ల సంఖ్య మరింత పెరిగింది.

కేవలం 9 జిటి3 కార్లు మాత్రమే భారత మార్కెట్లోకి విక్రయిస్తున్నట్లు తెలిసింది, అందులో ఒకటి ఈ అరుదైన మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల పోర్షే 911 జిటి3(991.2) సూపర్ కారు. ఏదేమైనప్పటికీ, మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను ఎక్కువగా ఇష్టపడే ఇండియన్స్ కోసం చివరికి సూపర్ కారు కూడా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో వచ్చింది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: This Is India's First Porsche 911 GT3 (991.2) With A Manual Gearbox
Story first published: Saturday, January 27, 2018, 15:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X