మరోసారి ధరల పెంపు చేపట్టిన ఏపీలోని కార్ల తయారీ సంస్థ

By Anil Kumar

ఆంధ్రప్రదేశ్‌ మొట్టమొదటి వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ తమ డి-మ్యాక్స్ పికప్ శ్రేణిలో ఉన్న వాహనాల మీద దేశవ్యాప్తంగా ధరలు పెంపు చేపట్టింది. ధరల పెంపు అనంతరం సవరించబడిన నూతన ధరలు సెప్టెంబరు 1, 2018 నుండి అమల్లోకి వస్తున్నట్లు ఇసుజు పేర్కొంది.

ఇసుజు మోటార్స్ ధరల పెంపు

ఇసుజు ఇండియా లైనప్‌లోని డి-మ్యాక్స్ శ్రేణిలోని రెగ్యులర్ క్యాబ్ మోడళ్ల నుండి 4X4 అడ్వెంచర్ పికప్‌ వెహికల్ డి-మ్యాక్స్ వి-క్రాస్ వరకు అన్ని మోడళ్ల మీద ధరల పెంపు చేపట్టినట్లు ప్రకటించింది. పెట్టుబడి భారం అధికమవ్వడంతో ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని వివరించింది.

ఇసుజు మోటార్స్ ధరల పెంపు

ఇసుజు మోటార్స్ తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు, అన్ని మోడళ్ల మీద రెండు నుండి మూడు శాతం ధరలు పెరిగే అవకాశం ఉంది. అంటే ఆయా మోడళ్ల ప్రస్తుతం ధరల ఆధారంగా రూ. 20,000 నుండి రూ. 50,000 వరకు పెరగవచ్చు.

ఇసుజు మోటార్స్ ధరల పెంపు

ఇసుజు మోటార్స్ ఈ సంవత్సరంలో ధరల పెంపు చేపట్టడం ఇది రెండవసారి. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి నెలలో అన్ని మోడళ్ల మీద రెండు నుండి మూడు శాతం ధరలు పెంచింది.

ఇసుజు మోటార్స్ ధరల పెంపు

ఇసుజు పికప్ రేంజ్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి, డి-మ్యాక్స్ క్యాబ్, డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ మరియు హై ఎండ్ మోడల్ డి-మ్యాక్స్ వి-క్రాస్. ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ మోడల్ స్టాండర్డ్ మరియు హై అనే మరో రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది.

ఇసుజు మోటార్స్ ధరల పెంపు

ఇసుజు ప్రారంభ మోడల్ డి-మ్యాక్స్ క్యాబ్ ధర రూ. 6.86 లక్షలతో ప్రారంభమయ్యి, మరియు వి-క్రాస్ హై ఎండ్ మోడల్‌లోని స్టాండర్డ్ మరియు హై వేరియంట్ల ధరలు వరుసగా రూ. 14.31 లక్షలు మరియు 15.81 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

ఇసుజు మోటార్స్ ధరల పెంపు

ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ టాప్ ఎండ్ వేరియంట్ 4X4 అడ్వెంచర్ మోడల్‌లో 2,499సీసీ కెపాసిటి గల టర్భో-ఇంటర్ కూల్డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ ప్రొడ్యూస్ చేసే 134బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఆల్ వీల్ డ్రైవ్ ద్వారా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

ఇసుజు మోటార్స్ ధరల పెంపు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇసుజు మోటార్స్ తమ పికప్ వెహికల్ శ్రేణిలో ఉన్న వాహనాల మీద ధరలు పెంపు చేపట్టింది. ప్రతి ఏడాది రెండవ సగభాగంలో ధరలు పెంపు తప్పనిసరిగా ఉంటుంది. దేశీయ దిగ్గజాలైన మారుతి సుజుకి, మహీంద్రా, టాటా మోటార్స్, హోండా కార్స్ మరియు మెర్సిడెస్ బెంజ్ ధరల పెంపు చేపట్టినట్లు ఇప్పటికే ప్రకటించింది.

Most Read Articles

Read more on: #isuzu #ఇసుజు
English summary
Read In Telugu: Isuzu Motors To Increase Prices Of D-Max Pickup Range From September
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X