మరో రెండు కొత్త వేరియంట్లలో విడుదలవుతున్న జీప్ కంపాస్

జీప్ ఇండియా తమ కంపాస్ ఎస్‌యూవీని మరిన్ని నూతన వేరియంట్లలో విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. రానున్న ఆరు నెలల్లోపు జీప్ కంపాస్ మరిన్ని కొత్త వేరియంట్లలో లభ్యం కానుంది. భారత్‌లో తమ భవిష్యత్ వ్యాపార ప్రణాళ

By Anil Kumar

జీప్ ఇండియా తమ కంపాస్ ఎస్‌యూవీని మరిన్ని నూతన వేరియంట్లలో విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. రానున్న ఆరు నెలల్లోపు జీప్ కంపాస్ మరిన్ని కొత్త వేరియంట్లలో లభ్యం కానుంది. భారత్‌లో తమ భవిష్యత్ వ్యాపార ప్రణాళికలను వెల్లడించిన జీప్, అతి త్వరలో మరో రెండు కొత్త మోడళ్లను కూడా విడుదల చేయనున్నట్లు తెలిసింది.

జీప్ కంపాస్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు

జీప్ ఇండియా ఖరారు చేసిన రెండు మోడళ్లలో ఒకటి కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఇది విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, టాటా నెక్సాన్ మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది. బహుశా ఇది జీప్ రెనిగేడ్ కావచ్చనే అనుమానాలు ఉన్నాయి.

జీప్ కంపాస్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు

జీప్ విడుదల చేయాలని భావిస్తోన్న మరో మోడల్ 7-సీటర్ ఎస్‌యూవీ. ఇదే కనుక నిజమైతే, విపణిలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు ఈ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

జీప్ కంపాస్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు

అమెరికా దిగ్గజం జీప్ దేశీయ విపణిలో సేల్స్ పరంగా మంచి ఫలితాలు కనబరుస్తోంది. జీప్ మొత్తం విక్రయాల్లో ఎక్కువ వాటా కలిగి ఉన్న కంపాస్ ఎస్‌యూవీని ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్లలో విడుదల చేసే విక్రయాలు పెంచుకోవాలని చూస్తోంది.

జీప్ కంపాస్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు

ఇందులో భాగంగానే, తాజాగా అందిన సమచారం మేరకు, జీప్ ఇండియా కంపాస్ ఎస్‌యూవీని నైట్ ఈగల్ మరియు ట్రయల్‌హాక్ అనే రెండు అదనపు వేరియంట్లలో ప్రవేశపెట్టేందుకు కసరత్తులు ప్రారంభించింది.

జీప్ కంపాస్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు

ట్రయల్‌హాక్ వేరియంట్‌ను జీప్ కంపాస్ లిమిటెడ్ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఇందులో రాక్ మోడ్ మరియు జీప్ యాక్టివ్ డ్రైవ్ లో రేంజ్ 4X4 సిస్టమ్ వంటి ఎన్నో అదనపు ఫీచర్లు ఉన్నాయి.

జీప్ కంపాస్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు

జీప్ కంపాస్ నైట్ ఈగల్ వేరియంట్‌ను కూడా లిమిటెడ్ వేరియంట్ ఆధారంగా డెవలప్‌ చేశారు. ఇందులో కాస్మొటిక్ హంగులు మినహాయిస్తే సాంకేతికంగా మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కానీ ప్రత్యేకమైన 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పలు రకాల గ్లాస్ బ్లాక్ డిజైన్ ఎలిమెంట్స్ అదే విధంగా సాలిడ్ షాడో బ్లాక్ లేదా మెటాలిక్ కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో ఎంచుకోవచ్చు.

జీప్ కంపాస్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు

జీప్ కంపాస్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఇందులోని 2.0-లీటర్ కెపాసిటి గల మల్టీజెట్ డీజల్ ఇంజన్ 170బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

జీప్ కంపాస్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు

జీప్ కంపాస్ పెట్రోల్ వేరియంట్లలోని 1.4-లీటర్ మల్టీఎయిర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 160బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ రెండు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.

జీప్ కంపాస్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు

ప్రస్తుతానికి కంపాస్ పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అదే విధంగా డీజల్ వేరియంట్లలో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఎంచుకునే అవకాశం ఉంది. కంపాస్ పెట్రోల్ ప్రారంభ ధర రూ. 15.34 లక్షలు మరియు డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 16.55 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

జీప్ కంపాస్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు

అతి త్వరలో విడుదల కానున్న జీప్ కంపాస్ కొత్త వేరియంట్ల ధరలు అంచనాగా...

  • నైట్ ఈగల్ పెట్రోల్ కంపాస్ ధర రూ. 21 లక్షలు
  • నైట్ ఈగల్ డీజల్ కంపాస్ ధర రూ. 22.5 లక్షలు
  • ట్రయల్‌హాక్ పెట్రోల్ కంపాస్ ధర రూ. 21.5 లక్షలు
  • ట్రయల్‌హాక్ డీజల్ కంపాస్ ధర రూ. 23.5 లక్షలు
  • జీప్ కంపాస్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    జీప్ కంపాస్ విడుదలైనప్పటి నుండి రికార్డ్ స్థాయి ఫలితాలు సాధిస్తోంది. అతి తక్కువ కాలవ్యవధిలో ఏకంగా 30,000 యూనిట్ల సేల్స్ సాధించింది. ఇప్పుడు సరికొత్త నైట్ ఈగల్ మరియు ట్రయల్‌హాక్ వేరియంట్లను విడుదల చేస్తే కంపాస్ సేల్స్ ఊపందకునే అవకాశం ఉంది.

Source: GaadiWaadi

Most Read Articles

Read more on: #jeep #జీప్
English summary
Read In Telugu: New Jeep Compass Variants To Launch In The Next Six Months — Includes The Night Eagle & Trailhawk
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X