ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ కార్ల సరఫరాకు సిద్దమే: కియా మోటార్స్

Written By:

ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేయడానికి ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలను ఆహ్వానించి నిర్వహించే టెండర్లలో పాల్గొనడానికి కియా మోటార్స్ ఇండియా సిద్దమైనట్లు తెలిసింది.

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న పెనుకొండ కియా కార్ల తయారీ ప్లాంటులో ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే, వేలం పాటలో పాల్గొనే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

కియా ఎలక్ట్రిక్ కార్లు

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ భాగస్వామ్యపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ 2019 ద్వితీయార్థం నుండి విణిలోకి ప్రవేశించడానికి ఏర్పాట్లను చకచకా పూర్తి చేసుకుంటోంది.

కియా ఎలక్ట్రిక్ కార్లు

బహుశా 2021 నాటికి కియా మోటార్స్ తమ రెండవ లేదా మూడవ మోడల్‌గా ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. ఏదేమైనప్పటికీ, ఎలక్ట్రిక్ మరియు ఉద్గార రహిత కార్ల తయారీ పట్ల ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోనున్నట్లు కియా పేర్కొంది.

కియా ఎలక్ట్రిక్ కార్లు

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(EESL) మార్చి 9 న తాజాగా 10,000 ఎలక్ట్రిక్ కార్ల కోసం టెండర్ ఆహ్వానించింది. గత ఏడాది 500 ఎలక్ట్రిక్ కార్ల కోసం EESL ప్రాథమిక టెండర్ నిర్వహించగా, టాటా మోటార్స్ మరియు మహీంద్రా ఎలక్ట్రిక్ టెండర్ దక్కించుకున్నాయి.

కియా ఎలక్ట్రిక్ కార్లు

కియా కంపెనీకి చెందిన ఇతర అధికారులు కథనం మేరకు, కియా అంతర్జాతీయ లైనప్‌లో ప్రధానంగా హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఫ్యూయల్ సెల్ మరియు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. భారత్‌లో ఛార్జింగ్ స్టేషన్ల మౌళిక వసతుల సంసిద్దత మరియు మార్కెట్ పరిస్థితులకు అనుగుణమైన మోడళ్లను ఎంచుకుని విపణిలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Recommended Video - Watch Now!
నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ | Tata Nexon AMT Details, Specifications - DriveSpark
కియా ఎలక్ట్రిక్ కార్లు

ప్రభుత్వ మరియు ప్రయివేట్ సంస్థలకు ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసే టెండర్లలో పాల్గొనడమే కాకుండా, ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేసేందుకు ఉన్న ఇతర మార్గాలను ఎంచుకోవడానికి కూడా కియా మోటార్స్ సిద్దంగా ఉంది.

కియా ఎలక్ట్రిక్ కార్లు

కియా మోటార్స్ ఇండియా ప్రొడక్షన్ ప్లాంట్ ప్రాథమిక వార్షిక తయారీ సామర్థ్యం 3,00,000 లక్షల యూనిట్లుగా ఉంది. అంతే కాకుండా, రానున్న మూడు నుండి నాలుగేళ్ల లోపు భారతదేశపు మూడవ లేదా నాలుగవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా రాణించాలనే లక్ష్యంతో ఉంది.

కియా ఎలక్ట్రిక్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసే టెండర్‌లో కియా మోటార్స్ పాల్గొనడమనేది, భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడానికి ఉన్న చక్కటి మార్గం అని చెప్పవచ్చు. కియా మోటార్స్ ప్రభుత్వ వేలం పాటలో పాల్గొనడం మార్కెట్ పరిస్థితుల అంచనా, మరియు పోటీదారులు నిర్ణయించే ధరలు ఇంకా ఎన్నో అంశాలను అర్థం చేసుకోవడంలో సహాయపడనుంది.

English summary
Read In Telugu: Kia Motors India Will Bid For Supply Of Electric Cars To The Government — But There Is A Catch!

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark