అడ్డంగా దొరికిపోయిన మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ: ఒరిజినల్ ఫోటోలు

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. సెప్టెంబరు 3, 2018 న మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీని విడుదల చేసేందుకు కసరత్తులు ప్ర

By Anil Kumar

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. సెప్టెంబరు 3, 2018 న మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీని విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

అయితే, ఇటీవల మహీంద్రా డీలర్లు మరాజొ ఎమ్‌పీవీని రహస్యంగా టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా తీసిన ఫోటోలు ఇంటర్నెట్ వేదికగా లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో మహీంద్రా మరాజొ పూర్తిగా రివీల్ అయ్యింది.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీని షార్క్ చేప డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజైన్ చేశారు, అందుకే దీని ఫ్రంట్ డిజైన్ షార్క్ ఫిష్ ఆకారంలో ఉంటుంది. చేప పళ్లను పోలి ఉండే నిలువుటాకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, క్రోమ్ సొబగులు మరియు కండలు తిరిగిన బంపర్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

మహీంద్రా మరాజొ సైడ్ డిజైన్ విషయానికి వస్తే, చాలా పొడవుగా ఉంటుంది మరియు మరాజొ ఓవరాల్ డిజైన్ ఎంతో పదునుగా ఉంటుంది. విలాసవంతమైన అనుభవాన్నిచ్చే స్పోర్టివ్ అల్లాయ్ వీల్స్, టర్న్ ఇండికేటర్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, క్రోమ్ హంగులు గల డోర్ హ్యాండిల్స్, పదునైన ఆకారంలో ఉన్న ఎల్ఈడీ టెయిల్ లైట్ క్లస్టర్ మరియు స్పోర్టివ్ ఫీల్‌నిచ్చే బాడీ క్లాడింగ్ కలదు.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

అంతే కాకుండా, మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీలో ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్ కలదు, అదే విధంగా ఇది 7 మరియు 8 సీటింగ్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. 7-సీటర్ వేరియంట్లోని మధ్య వరుసలో ఇద్దరు మాత్రమే ప్రయాణించేలా రెండు సెపరేట్ సీట్లు ఉంటాయి మరియు 8-సీటర్ వేరియంట్లో ముగ్గురు కూర్చునే అవకాశమున్న పొడవాటి సీటు కలదు.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

మహీంద్రా మరాజొ సాంకేతికంగా 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 125బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మరాజొ ఎమ్‌పీవిని తొలుత డీజల్ ఇంజన్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లాంచ్ చేసి, మలి దశలో పెట్రోల్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్ పరిచయం చేసే అవకాశం ఉంది.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

మహీంద్రా మరాజొ ఇంటీరియర్‌లో ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డు మరియు బీజీ కలర్ సీట్లు మరియు అప్‌హోల్‌స్ట్రే ఉన్నాయి. అంతే కాకుండా, క్యాబిన్‌లో రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్స్ గల సెగ్మెంట్ ఫస్ట్ సరౌండ్ కూలింగ్ టెక్నాలజీ వచ్చింది. భద్రత పరంగా ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ

తెలుగుడ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

ఎస్‌యూవీల తయారీకి బాగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా ఎమ్‌పీవీ వాహనాల సెగ్మెంట్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ మోడల్‌ను లాంచ్ చేయలేదు. దీంతో దేశీయ ఎమ్‌పీవీ సెగ్మెంట్లో ఉన్న మారుతి ఎర్టిగా మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా వాహనాల సరసన చేరనుంది. మహీంద్రా మరాజొ సుమారుగా రూ. 10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వివరాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

Source: TeamBHP

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra Marazzo MPV Fully Revealed Ahead Of Launch
Story first published: Thursday, August 30, 2018, 12:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X