అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

భారతదేశపు అగ్రగామి ఎస్‌యూవీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి తమ సరికొత్త మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని సెప్టెంబర్ 5నందు కోసం విన్యాసం మరియు కొత్త ఫీచర్లతో మారుతి సుజుకి ఎర్టిగా కారుకు పోటీగా విడుదల చేసింది.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

విడుదల ఐన సమయంనుంచి మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా కారును వదిలే కస్టమర్లు మారాజా కారు కొనటానికి ముందుకొస్తున్నారు. ఇందువలన మార్కెట్లో ఎర్టిగా ఎంపివి కారు అమ్మకం తక్కువయ్యి, మారాజా కారులు అధికంగా అమ్మబడుతొంది.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

మారాజో కారు విడుదలైన మొదటి నెలలో సుమారుగా 2,829 కారులు సేల్స్ ఐతే, అక్టోబర్ నెలలో 3,810 కారులు సేల్స్ అయ్యాయి. అంటే సేల్స్ లో 35 శాతం అధికం అయింది. అక్టోబర్ నెలలో 1,387 మారుతి సుజుకి ఎర్టిగా కారులు సేల్స్ అయ్యాయి.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

ఇందువలన ఎంపివి కారుల సేల్స్ లో మల్లి రాణించేందుకు మారుతి సుజుకి సంస్థ నెక్స్ట్ జనరేషన్ ఎర్టిగా కారును ఇదే నెల 21న విడుదల ఛేసోందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడప్పుడే కొత్త ఎర్టిగా కారు కొనుగోలు కోసం బుక్కింగ్ కూడా ప్రారంభించారు డీలర్లు. మరియు పాత జనరేషన్ ఎర్టిగా కారు ఖరీదు పై భారీగా డిస్కౌంట్ ఇస్తున్నారు.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

నెలనుంచి నెలకు అధికంగా అమ్మబడుతున్న మహీంద్రా మారాజో కారును గ్రాహకులు కొనాలని ఎందుకు ఇంటాగా ఎగబడుతున్నారో తెలుసుకోవటానికి ముందుకు చదవండి..

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

మహీంద్రా మరాజొ వేరియంట్లు

మహీంద్రా అండ్ మహీంద్రా తమ మరాజొ ఎమ్‌పీవీని నాలుగు విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది. అవి, ఎమ్2, ఎమ్4, ఎమ్6 మరియు ఎమ్8. అయితే, ఈ అన్ని వేరియంట్లు కూడా కేవలం డీజల్ ఇంజన్‌తో మాత్రమే లభ్యమవుతున్నాయి.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

మహీంద్రా మరాజొ డిజైన్

ప్రారంభంలో చెప్పినట్లుగా మహీంద్రా బృందం ఈ మరాజొ ఎమ్‌‌పీవీని షార్క్ చేప ఆధారంగా రూపొందించారు. కాస్త అటు ఇటుగా దీని రూపం షార్క్ చేపనే పోలి ఉంటుంది. ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న ఫ్రంట్ గ్రిల్ షార్క్ చేప పళ్ల మాదిరిగానే ఉంటుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు అగ్రెసివ్ డిజైన్ శైలిలో ఉండే బంపర్ వంటివి ఉన్నాయి.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

మరాజొ ఎమ్‌పీవీ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, 17-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్. వెనుక వైపున పదునైన ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఎత్తులో ఉన్నటువంటి స్టాప్ ల్యాంప్ మరియు స్పోర్టివ్ బంపర్ ఉన్నాయి.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

మహీంద్రా మరాజొ ఇంటీరియర్

మహీంద్రా మరాజొ ఇంటీయర్‌లో డ్యూయల్-టోన్ థీమ్ ఫినిషింగ్ కలదు. బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల డ్యాష్ బోర్డు మరియు సీట్లు, డోర్ ట్రిమ్స్ మరియు అప్‌హోల్‌స్ట్రే లేత గోధుమ రంగులో ఉన్నాయి.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

మహీంద్రా మరాజొ ఫీచర్లు

మహీంద్రా మరాజొ ఇంటీరియర్‌లో అత్యంత కీలకమైన 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఈ సెగ్మెంట్లోనే మొట్టమొదటిసారిగా సరౌండ్ కూలింగ్ టెక్నాలజీ గల రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్స్, ఎమ్ఐడి యూనిట్ గల డ్యూయల్-పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సరికొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు ఎయిర్‌క్రాఫ్ట్ స్టైల్ రూపొందించిన హ్యాండ్ బ్రేక్ లీవర్ వంటి విభిన్నమైన ఫీచర్లు ఉన్నాయి.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

మహీంద్రా మరాజొ 7 మరియు 8 సీటింగ్ లేఔట్లో లభ్యమవుతోంది. 7-సీటర్ వేరియంట్లోని మధ్య వరుసలో ఇద్దరు మాత్రమే ప్రయాణించే క్యాప్టెన్ సీట్లు ఉన్నాయి మరియు 8-సీటర్ వేరియంట్లో మధ్య వరుసలో ముగ్గురు ప్రయాణించే సౌలభ్యం ఉంది. క్యాబిన్‌ లోపల నలుమూలకు ఏసి అందేలా ఈ సెగ్మెంట్లో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి సరౌండ్ కూలింగ్ సిస్టమ్ వచ్చింది.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

భద్రత పరంగా మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎమ్‌పీవీ సెగ్మెంట్లో మొదటిసారిగా అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు ఇంపాక్ట్ సెన్సిటివ్ డోర్లు ఉన్నాయి. మరాజొ ఎమ్6 మరియు ఎమ్8 టాప్ ఎండ్ వేరియంట్లలో అదనంగా రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా, కార్నరింగ్ ల్యాంప్స్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ ఎమర్జెన్సీ కాల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

మహీంద్రా మరాజొ ఇంజన్ వివరాలు

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీలో సాంకేతికంగా 1.5-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 120బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు అందుతుంది.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

మహీంద్రా మరాజొ మైలేజ్

మహీంద్రా మరాజొ డీజల్ లీటరుకు 17.6 కిలోమీటర్లు ఇస్తుంది. మహీంద్రా త్వరలో మరాజొ ఎమ్‌పీవీని పెట్రోల్ వేరియంట్లో కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే, భారత్‌లో అధికారికంగా బిఎస్-6 ఉద్గార ప్రమాణాలు అమలయ్యేనాటికి పెట్రోల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.

అమ్మకాలలో మారుతి సుజుకి ఎర్టిగా కారును ఓడించిన మహీంద్రా మరాజో

మరాజొ లభించే రంగులు

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ మొత్తం ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. మెరైనర్ మెరూన్, షిమ్రింగ్ సిల్వర్, అక్వా మెరైన్, ఓషియేనిక్ బ్లాక్, పోసిడన్ పర్పులు మరియు ఐస్‌బర్గ్ వైట్.

Most Read Articles

Read more on: #mahindra #mpv #sales
English summary
Mahindra marazzo sales growth in october.
Story first published: Monday, November 12, 2018, 10:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X