ఎట్టకేలకు విడుదలకు సిద్దమైన మహీంద్రా ఎమ్‌పీవీ

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా యు321 కోడ్ పేరుతో అభివృద్ది చేసిన ఎమ్‌పీవీని ఈ ఏప్రిల్ 18 న విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిసింది. గత కొన్ని నెలలు మహీంద్రా తమ ఎమ్‌పీవీ వాహనాన్ని పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించింది. మహీంద్రా ఎమ్‌పీవీ విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వారికి ఎట్టకేలకు సమాధానం లభించింది.

మహీంద్రా ఎమ్‌పీవీ గురించి మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో...

మహీంద్రా ఎమ్‌పీవీ

మహీంద్రా అండ్ మహీంద్రా మోనోకోక్యూ బాడీ ఫ్రేమ్ ఆధారంగా రూపొందిస్తున్న మొట్టమొదటి మోడల్ ఈ యు321 కోడ్ పేరుతో అభివృద్ది చేసిన ఎమ్‌పీవీ. మహీంద్రా జైలో వంటి వాహనాల్లో వినియోగించిన బాడీ-ఆన్-ఫ్రేమ్ స్టైల్‌తో పోల్చితే మోనోకోక్యూ చాలా విభిన్నం మరియు ప్రత్యేకమైనది.

మహీంద్రా ఎమ్‌పీవీ

రహస్యంగా రహదారి పరీక్షలు నిర్వహిస్తున్నపుడు తీసిన ఫోటోలను గమనిస్తే, మహీంద్రా వారి అతి కఠినమైన డిజైన్ అంశాలను గుర్తించవచ్చు. ఇప్పటి వరకు మహీంద్రా లైనప్‌లో ఉన్న వాహనాలతో పోల్చుకుంటే ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. తక్కువ ఎత్తులో ఉన్న సీటింగ్ మరియు క్యాబిన్ ద్వారా సులభంగా కదలడం మరియు ఆగడానికి వీలవుతుంది.

మహీంద్రా ఎమ్‌పీవీ

ఫ్రంట్ డిజైన్ విషయానికి వస్తే, మహీంద్రా ఎక్స్‌యూవీ500 తరహాలో 7-స్లాట్ వర్టికల్ గ్రిల్ ఉంది. అంతే కాకుండా ఈ ఎమ్‌పీవీ వాహనంలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, బంపర్‌లో జొప్పించిన ఫాగ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి.

మహీంద్రా ఎమ్‌పీవీ

పరీక్షిస్తున్నటువంటి మహీంద్రా ఎమ్‌పీవీ సైడ్ ప్రొఫైల్ గమనిస్తే, పెద్ద పరిమాణంలో విశాలంగా ఉన్నటువంటి బాడీ, పెద్దగా ఉన్నటువంటి వీల్ ఆర్చెస్ మరియు 16-అంగుళాల 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనక వైపున నిలువుగా ఉన్నటువంటి టెయిల్ లైట్లు మరియు రియర్ డిక్కీ డోరు వాలుగా వెనక్కి వంచబడి ఉండటంతో ఢిక్కీని సులభంగా వాడుకోవచ్చు.

మహీంద్రా ఎమ్‌పీవీ

ఇంటీరియర్‌లో ఏడు మరియు ఎనిమిది ప్రయాణించే సీటింగ్ సామర్థ్యం కల్పిస్తోంది. విశాలమైన లెగ్ మరియు హెడ్ రూమ్, సౌకర్యవంతమైన లెథర్ సీట్లు, ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ సపోర్ట్ చేయగల పెద్ది పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు అనలాగ్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు రానున్నాయి.

మహీంద్రా ఎమ్‌పీవీ

సాంకేతికంగా మహీంద్రా ఎమ్‌పీవీలో శాంగ్‌యాంగ్ కోసం అభివృద్ది చేసిన 1.6-లీటర్ డీజల్ ఇంజన్ ఇందులో రానుంది. యు321 ఎస్‌యూవీతో పాటు తమ ఫ్యూచర్ మోడటళ్లలో కూడా ఉపయోగించుకోనున్న ఈ ఇంజన్ గరిష్టంగా 130బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా ఎమ్‌పీవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎమ్‌పీవీ వాహనాన్ని పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ చేస్తే, మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పీవీ మరియు టయోటా ఇన్నోవా క్రిస్టాతో పాటు 7 మరియు 8 సీటింగ్ సామర్థ్యంతో లభించే ఇతర మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

మహీంద్రా ఎమ్‌పీవీ

మహీంద్రా యు321 కోడ్ పేరుతో అభివృద్ది చేసిన ఎమ్‌పీవీని ఇప్పటి వరకు అధికారికంగా ఆవిష్కరించలేదు. అయితే, మార్కెట్ పరిస్థితులు మరియు పోటీని బట్టి చూస్తే రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో లభించే అవకాశం ఉంది.

మహీంద్రా ఎమ్‌పీవీ

1. డీజిల్ రైలింజన్లు అస్సలు ఆఫ్ చేయరెందుకు?

2.20 కోట్ల రుపాయల ఆ కారుకు 25 కోట్లు వెచ్చించి స్పెషల్ పెయింట్

3.రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

4.నో ఫ్లయింగ్ జోన్‌గా టిబెట్: ఇదీ అసలు రహస్యం!!

5.తలపాగా మ్యాచింగ్ కోసం 7 రోల్స్ రాయిస్ కార్లు కొనేశాడు

English summary
Read In Telugu: Mahindra MPV India Launch Details Revealed; Expected Price, Specifications & Key Features
Story first published: Thursday, April 12, 2018, 11:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark