మారుతి వితారా బ్రిజాకు సరాసరి పోటీని తీసుకొస్తున్న మహీంద్రా

మహీంద్రా భాగస్వామ్యపు సంస్థ శాంగ్‌యాంగ్ అంతర్జాతీయ మార్కెట్ లైనప్‌లో ఉన్న టివోలి ఆధారంగా ఎస్201 ఎస్‌యూవీని అభివృద్ది చేసి, నిర్మించింది. ప్రస్తుతం దీనికి తుది దశ పరీక్షలు నిర్వహిస్తోంది. అతి త్వరలో ప

By Anil Kumar

ఎస్‌యూవీల తయారీకి పేరుగాంచి దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి ఇప్పటికే ఎన్నో ఎస్‌యూవీలను ప్రవేశపెట్టింది. అయితే, ప్రయోగాలన్నీ ఫలించలేదు. సగానికి పైగా మోడళ్లు కస్టమర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. బొలెరో, స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 వంటి ఎస్‌యూవీలు మినహాయిస్తే మిగతా మోడళ్లు పెద్దగా రాణించలేకపోయాయి.

మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీ

ఈ నేపథ్యంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఉన్న డిమాండ్ దృష్ట్యా సరికొత్త ఎస్‌యూవీని సిద్దం చేసింది. విపణిలో ఉన్న మారుతి బ్రిజా, టాటా నెక్సాన్ మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మోడళ్లకు సరాసరి పోటీనిచ్చే ఈ ఎస్‌యూవీని ఎస్201 పేరుతో అభివృద్ది చేసి, ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది.

మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీ

తమిళనాడులోని పాండిచ్చేరిలో జాతీయ రహదారి మీద రహస్యంగా రహదారి పరీక్షలు నిర్వహిస్తుండగా సేకరించిన ఇంటీరియర్ మరియ ఎక్ట్సీరియర్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలను పరిశీలిస్తే, మారుతి బ్రిజా ఎస్‌యూవీకి బలమైన పోటీ ఖాయమని చెప్పవచ్చు.

మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీ

మహీంద్రా భాగస్వామ్యపు సంస్థ దక్షిణ కొరియాకు చెందిన శాంగ్‌యాంగ్ అంతర్జాతీయ మార్కెట్ లైనప్‌లో ఉన్న టివోలి ఆధారంగా ఎస్201 ఎస్‌యూవీని అభివృద్ది చేసి, నిర్మించింది. డిజైన్ మరియు బాడీ ప్యానళ్లు కూడా దాదాపు టివోలి ఎస్‌యూవీనే పోలి ఉన్నాయి.

మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీ

రహస్యంగా తీసిన ఇంటీరియర్ ఫోటోలను పరిశీలిస్తే, మహీంద్రా ఎస్201 ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు బీజి కలర్ డ్యాష్‌బోర్డ్ రానుంది. డ్యాష్‌బోర్డులో ఫాక్స్ అల్యూమినియం ప్యానల్ ఉంది. స్టీరింగ్ వీల్ మీద బ్లూటూత్ మరియు ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి.

మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీ

ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో రెండు పెద్ద డయల్స్, మల్టీ-ఫంక్షన్ సెంటర్ డిస్ల్పే ఉన్నాయి. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అచ్చం శాంగ్‌యాంగ్ టివోలి ఎస్‌యూవీలోని ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌నే పోలి ఉంటుంది.

మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీ

డ్యాష్‌బోర్డ్ మధ్యలో 7-అంగుళాల పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ ఉంది. ఇందులో అండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్ల ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి ఫీచర్ వచ్చే అవకాశం ఉంది. న్యావిగేషన్ మరియు రివర్స్ కెమెరా డిస్ల్పే వంటి ఎన్నో అదనపు ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీ

డ్రైవర్ మరియు కో-డ్రైవర్ మధ్యలో ఉన్న పియానో బ్లాక్ సెంట్రల్ కన్సోల్ గమనించవచ్చు. సెంటర్ కన్సోల్‌లో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ యుఎస్‌బి పోర్ట్స్, ఏయుఎక్స్ ఇన్‌పుట్ జాక్ మరియు 12వోల్ట్ సాకెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మధ్యలో ఉన్న టచ్‌స్క్రీన్ సిస్టమ్‌కు ఇరువైపులా పొడవాటి ఏ/సి వెంట్స్ అందివ్వడం గుర్తించవచ్చు.

మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీ

అతి త్వరలో మార్కెట్లోకి విడుదలయ్యేందుకు సిద్దమవుతున్న మహీంద్రా ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీ సాంకేతికంగా 1.5-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల టర్భో పెట్రోల్ ఇంజన్‌లతో రానుంది. రెండు ఇంజన్ ఆప్షన్‌లను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు.

మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీ

మహీంద్రా ఎస్201 కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్‌లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, రూఫ్ రెయిల్స్, రియర్ స్పాయిలర్ మరియు వైపర్లు అదే విధంగా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

మహీంద్రా ఎస్201 ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎస్‌యూవీల తయారీకి పెట్టింది పేరుగా రాణించిన మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల కాలంలో పట్టును కోల్పోతోంది. దీంతో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఎలాగైనా తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు శాంగ్‌యాంగ్ టివోలి ఆధారిత ఎస్201 ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసింది. అతి త్వరలో విడుదల ఉన్న నేపథ్యంలో ఎస్201 ఎస్‌యూవీకి తుది దశ పరీక్షలు నిర్వహిస్తోంది.

మహీంద్రా ఎస్201 ఎస్‌‌యూవీ విడుదలైతే, మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీతో పాటు పలు ఇతర క్రాసోవర్ ఎస్‌యూవీలకు కూడా గట్టి పోటీనివ్వనుంది.

Image Courtesy: Vikatan.com

Most Read Articles

English summary
Read In Telugu: The Mahindra S201 Compact SUV Interiors Spied — To Rival The Maruti Vitara Brezza
Story first published: Monday, June 4, 2018, 18:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X