Just In
- 22 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 1 day ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Finance
బంగారం నిరోధకం, ఈ వారం ప్రభావం చూపే అంశాలు ఇవే
- News
జగన్..ఎన్డీఏ వైపే?: హోదా ఇస్తే ఎందాకైనా: మోడీ అఖిల పక్షానికి ముందే ఆ నిర్ణయం: ఎంపీలతో
- Movies
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 - స్టేజ్ 4 ఫలితాలు
భారతదేశపు అతి పెద్ద ర్యాలీ మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 స్టేజ్ 4 పూర్తయ్యింది. డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీలో విజేతలను నిర్ణయించే స్టేజ్ 4 ఆద్యంతం ఉత్కంఠతో థార్ ఎడారుల్లోని అత్యంత కఠినమైన మార్గంలో దాదాపు ఇండియా-పాకిస్తాన్ బార్డర్ వరకు ర్యాలీ కొనసాగింది.

డెసర్ట్ స్టార్మ్ 2018లో చివరి దశ ర్యాలీ స్టేజ్ 4 జైసల్మీర్‌లోని మారియట్ హోటల్ నుండి ప్రారంభమైంది. ర్యాలీని ముందుగా మోటో కెటగిరీతో ప్రారంభించారు. ర్యాలీని 4ఎ మరియు 4బి గా విభజించి, తరువాత నైట్ స్టేజ్‌లో కొనసాగించారు.

స్టేజ్ 4 లోని తొలి సెక్షన్ మొత్తం సమతలంగా ఉన్న టుర్కన్ కి బస్తి పరిసర ప్రాంతాల్లో సాగింది. ఇరుకైన మలుపులు మరియు పొడవాటి మార్గాలు ఈ సెక్షన్‌ను కాస్త ఇంట్రెస్టింగ్‍గా మలిచింది.

ర్యాలీ జరిగిన మొదటి సెక్షన్‌లో నేలలు చదునుగా ఉండటంతో, అత్యంత వేగంతో దూసుకెళ్లే కార్లు మరియు మోటార్‌సైకిళ్లను సుదూర దూరాల వరకు గమనించవచ్చు. ముందు వెళ్లే వాహనాల కారణంగా చెలరేగే దుమ్ము ఇతర రైడర్లను తప్పుదోవ పట్టించే విధంగా పెద్ద సీన్ క్రియేట్ చేసింది.


స్టేజ్ 4 లోని తరువాత సెక్షన్ ర్యాలీ థార్ ఎడారిలోని ఇసుక దిబ్బల మీదుగా సాగింది. ఈ మార్గాన్ని మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ నిర్వాహకులు ముందుగానే నిర్ణయించారు. ఈ మార్గంతో డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ ముగిసింది.

దుమ్ముతో కూడిన చల్లటి గాలుల, భగ భగ మండుతున్న భానుడిని ఎదుర్కొని మరీ పోటీదారులు ర్యాలీని ముగింపు దశకు తీసుకొచ్చారు. చుట్టూ ఇసుక తిన్నెలతో నిండిన ఎడారి కావడంతో ఎటు చూసినా ఒకేలా ఉండటం మరియు దిక్కులుపిక్కటిల్లేలా వస్తున్న మోటార్ సైకిళ్ల శబ్దం చివరి దశ ర్యాలీని తీవ్ర ఉత్కంఠానికి గురిచేసింది.

రాత్రి నుండి జరగాల్సిన సెకండ్ సెక్షన్ (4B) ర్యాలీని నిర్వాహకులు రద్దు చేశారు. తుది ఫలితాల ప్రకటనకు ఒక్కరోజే మిగిలింది. నాలుగు రోజుల శ్రమ అనంతరం అన్ని విభాగాల్లో విజేతలను ఖరారు చేసే దశకు ర్యాలీ చేరుకుంది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ ఫలితాలు
మోటో 4A విభాగంలో:
1. అరోనే మరె (#3) 02:14:43
2. శాంటోలినొ లొరెంజో (#2) 02:06:54
3. సంజయ్ కుమార్ (#6) 02:29:51

ఎక్స్‌ప్లోర్ విభాగంలో 4B చివరి వరకు
1. నిపున్ అగర్వాల్, కబీర్ మన్‌షరమణి (#301) 0:55:48
2. మనోజ్ వైద్య, సుక్రితి గోయెల్ (#317) 0:58:51
3. మనీష్ బజాజ్, శశాంక్ అగర్వాల్ (#306) 01:01:38

ఎన్‌డ్యూర్ 4B చివరి వరకు
1. రుచిత్ జడ్వా, ఆదిత్య గర్గ్ (#214) 00:47:36
2. అశీష్ బుద్ద, అరిందమ్ ఘోష్ (#203) 00:59:54
3. వివేక్ విక్రమ్ సింగ్, సబతుల్లా ఖాన్ (#208) 01:13:00

ఎక్స్‌ట్రీమ్ 4B చివరి వరకు
1. అభిషేక్ మిశ్రా, వి వేణు రమేష్‌కుమార్ (#103) 10:54:54
2. రాజ్ సింగ్ రాథోర్, సాగర్ మల్లప్ప (#104) 11:30:57
3. నిజు పాడియా, నిరవ్ మెహ్తా (#106) 12:14:14

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మారుతి సుజుకి మరియు ఎగ్జాన్ మొబిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డెసర్ట్ స్టార్మ్ 2018 16 ఎడిషన్ నాలుగ స్టేజ్ ముగియడంతో ర్యాలీ ముగింపు దశకు వచ్చింది. కేవలం చివరి స్టేజ్‌లోని రెండవ సెక్షన్ ఫలితాలు మాత్రమే పెండింగులో ఉన్నాయి.
మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 తుది ఫలితాలు మరియు విజేతల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి. అంత వరకు క్రింది గ్యాలరీలోని ర్యాలీ ఫోటోలను వీక్షించండి...