2018 ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌ను పండుగ సీజన్ కోసం సిద్దం చేసిన మారుతి

మారుతి సుజుకి 2018 ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌పీవీని పరీక్షిస్తూ పట్టుబడింది. తాజాగా అందిన ఫోటోల ప్రకారం, ఎక్ట్సీరియర్ డిజైన్ అంశాలు మరియు ఫీచర్లు గుర్తించడానికి వీల్లేకుండా ప్రొడక్షన్ వెర్షన్‌కు చేరుకున

By Anil Kumar

మారుతి సుజుకి 2018 ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌పీవీని పరీక్షిస్తూ పట్టుబడింది. తాజాగా అందిన ఫోటోల ప్రకారం, ఎక్ట్సీరియర్ డిజైన్ అంశాలు మరియు ఫీచర్లు గుర్తించడానికి వీల్లేకుండా ప్రొడక్షన్ వెర్షన్‌కు చేరుకున్న ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌కు తుది పరీక్షలు నిర్వహించింది.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

రెండవ తరానికి చెందిన ఎర్టిగా ఫేస్‌‌లిఫ్ట్ ఎమ్‌పీవీని ఈ ఏడాది ప్రారంభంలో ఇండోనేషియాలో ఆవిష్కరించారు. ఏదేమైనప్పటికీ, ఇండియన్ వెర్షన్ ఎర్టిగా తుది పరీక్షలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎర్టిగా ఎమ్‌పీవీ మరికొన్ని నెలల్లో పండుగ సీజన్ ప్రారంభమయ్యే నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇండోనేషియాలో ఆవిష్కరించిన ఎర్టిగాతో పోల్చుకుంటే ఇండియన్ వెర్షన్ ఎర్టిగాలో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

రహస్యంగా తీసిన ఫోటోల మేరకు, 2018 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ గమనిస్తే క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ మరియు కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు రానున్నాయి. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కోసం 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ పరిచయయ్యే ఛాన్స్ ఉంది.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

2018 మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పీవీ సాంకేతికంగా కె15బి సిరీస్ ఇంజన్ ఆప్షన్‌లో లభ్యం కానుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 102బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మునుపటి 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానాన్ని భర్తీ చేస్తుంది.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

డీజల్ వెర్షన్ ఫేస్‌లిఫ్ట్ ఎర్టిగా ఎస్‌యూవీలో అదే మునుపటి 89బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే ఫియట్ 1.3-లీటర్ డీజల్ ఇంజన్ కొనసాగింపుగా రానుంది. ఏదేమైనుప్పటికీ, మారుతి బృందం సరికొత్త 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌ను అభివృద్ది చేస్తోంది. అయితే, భవిష్యత్తులో దీనిని ప్రవేశపెట్టనుంది.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

అప్‌కమింగ్ 2018 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‍‌‌లో ఐఎస్ఒఫిక్స్ సీట్లు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్లూటూత్ కనెక్టివిటి సపోర్ట్ గల 7-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెండవ తరానికి చెందిన 2018 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి విడుదల కానుంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎర్టిగా ఎమ్‌పీవీ ధరల శ్రేణి రూ. 6.5 లక్షల నుండి రూ. 11 లక్షల మధ్య ఉండవచ్చు.

Source: AutocarIndia

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Maruti Suzuki Ertiga Facelift Spotted Testing In India — Launch Expected Soon
Story first published: Monday, June 11, 2018, 16:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X