ఆటో ఎక్స్‌పో 2018: మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650 విడుదల: ధర రూ. 2.73 కోట్లు

Written By:

ఆటో ఎక్స్‌పో 2018: విపణిలోకి మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్650 విడుదల అయ్యింది. సరికొత్త మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650 ప్రారంభ ధర రూ. 2.73 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. మెర్సిడెస్ బెంజ్ సబ్ బ్రాండ్ అయిన మేబ్యాక్ క్రింద ఎస్650తో పాటు ఎస్560 కారును కూడా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.94 కోట్లుగా ఉంది.

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650 మరియు ఎస్560 గురించి మరిన్ని వివరాల కోసం...

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650

సరికొత్త మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650లో లగ్జరీ లిమోసిన్ కారులో ట్విన్-టుర్బో 6.0-లీటర్ వి12 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 5,500ఆర్‌పిఎమ్ వద్ద 621బిహెచ్‍‌‌పి పవర్ మరియు 2,300-4,200ఆర్‌పిఎమ్ మధ్య గరిష్టంగా 1,000ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Recommended Video - Watch Now!
New Honda Amaze Facelift Auto Expo 2018
మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650 ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది. మేబ్యాక్ ఎస్650 కేవలం 4.6 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగాన్ని 250కిలోమీటర్లకు ఎలక్ట్రికల్‌గా ఫిక్స్ చేశారు.

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650

అదే విధంగా ఎస్560 లో మెర్సిడెస్ ఏఎమ్‌జి నుండి సేకరించిన 4.0-లీటర్ కెపాసిటి గల ట్విన్-టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 462.5బిహెచ్‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్560 కేవలం 4.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 250కిలోమీటర్లు ఉండేటట్లు ఎలక్ట్రికల్‌గా లాక్ చేశారు.

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650

డిజైన్ పరంగా ఎస్-క్లాస్ యొక్క లగ్జరీ డిజైన మెర్సిడెస్ మేబ్యాక్ మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఈ మార్పులను మేబ్యాక్ ఫ్రంట్ డిజైన్‌లో గుర్తించవచ్చు. పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, పొడవాటి బానెట్, మేబ్యాక్ లోగో మరియు హుడ్ ఆర్నమెంట్లను అందించింది.

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650

మేబ్యాక్ ద్వారా లగ్జరీ ఫీల్ కలిగించేందుకు ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌లో క్రోమ్ లేయర్ ఉంది. సరికొత్త మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650లో అత్యంత పొడవైన వీల్ కలదు. దీంతో ఫ్రంట్ ప్యాసింజర్లతో పాటు రియర్ ప్యాసింజర్లకు కూడా విశాలమైన క్యాబిన్ స్పేస్ సాధ్యమైంది.

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650

సరికొత్త మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650లో మల్టీబీట్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, టెయిల్ లైట్లు, మ్యాజిక్ బాడీ కంట్రోల్, మ్యాజిక్ స్కై కంట్రోల్ మరియు క్రిస్టల్ డిజైన్ టెయిల్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు రాడార్ ఆధారంతో నియంత్రించబడే క్రూయిజ్ కంట్రోల్ ఇంకా ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎస్-క్లాస్ లగ్జరీ లిమోను మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్650 మరియు ఎస్560 ద్వారా మరో కొత్త లెవల్‌కు తీసుకెళ్లింది. భారీ ఇంటీరియర్ ఫీచర్లు, విలాసవంతమైన సౌకర్యాలు మరియు భద్రతకు పెద్ద పీట వేస్తూ ఎన్నో సేఫ్టీ ఫీచర్లను మెర్సిడెస్ తమ మేహబ్యాక్ సిరీస్‌లో పరిచయం చేసింది.

ధర భరం కాదనుకునే 40 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారు మెర్సిడెస్ మేబ్యాక్ సిరీస్ కార్లను ఎంచుకోవచ్చు.

English summary
Read In Telugu: Auto Expo 2018: Mercedes-Maybach S650 Launched In India At Rs 2.73 Crore
Story first published: Saturday, February 10, 2018, 15:06 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark