ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతున్న, అసహ్యించుకుంటున్న కార్ కలర్

Written By:
Recommended Video - Watch Now!
New Honda Amaze Facelift Auto Expo 2018

ఇండియాలో అమ్ముడయ్యే కార్లు పలు రకాల కలర్ ఆప్షన్లలో లభ్యమవుతున్నాయి. కస్టమర్ల దృష్టిని ఆకర్షించేందుకు కొన్ని కార్లు స్పెషల్ పెయింట్ స్కీములో విడుదలవుతాయి. అన్ని రకాల రంగుల్లో లభించే కార్లన్నింటికీ ఒకే తరహా ఆదరణ లభించదు. ప్రస్తుతం, ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యే కార్లు సుమారుగా తొమ్మిది నుండి పన్నెండు రకాల రంగుల్లో వస్తున్నాయి. అయితే, కేవలం కొన్ని రంగుల్లో ఉన్న కార్లను మాత్రమే ఇండియన్స్ ఎంచుకుంటున్నారు.

ఎంచుకునే కారు కలర్ ఎక్కువగా కస్టమర్ల అభిరుచికి ఆనుగుణంగా ఉంటుంది. చాలా మంది తమకు లైఫ్‌లో బాగా కలిసొచ్చేందుకు కలర్ ఎంచుకోవడానికి మొగ్గుచూపుతారు. మరి భారత్‌లో ఎక్కువగా ఎంచుకుంటున్న మరియు అసహ్యించుకుంటున్న కార్ కలర్ ఏంటో ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతున్న కార్ కలర్

ఇండియాలో ఎక్కువగా ఎంచుకుంటున్న మరియు మోస్ట్ పాపులర్ కలర్స్‌లో తెలుపు, సిల్వర్ మరియు నలుపు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ రంగు కార్లకే అధిక ప్రాధాన్యత ఉంది.

ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతున్న కార్ కలర్

చాలా మంది వైట్, సిల్వర్ మరియు బ్లాక్ ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం, ఎన్ని సంవత్సరాలు అయినా కొత్త వాటిలాగే ఉంటాయి. కొన్ని కంపెనీలు ప్రకాశవంతమైన మెటాలిక్ పెయింట్ స్కీమును అందిస్తాయి. ఈ రంగు కార్లు కొన్నేళ్లకు రంగులోని సహజత్వాన్ని కోల్పోయి డల్‌గా కనిపిస్తాయి.

ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతున్న కార్ కలర్

మరికొన్ని కార్లలో సిరామిక్ కోటింగ్ లేదా పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ కారు ఎక్ట్సీరియర్ మీద వేయిస్తారు. దీంతో, రంగులో సహజత్వాన్ని కోల్పోయిన కార్లు మళ్లీ ప్రకాశవంతంగా మెరుస్తాయి. అయితే, ఇలాంటి కార్ల రీసేల్ వ్యాల్యూ చాలా తక్కువగా ఉంటుంది.

ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతున్న కార్ కలర్

కానీ, తెలుపు, సిల్వర్ మరియు నలుపు రంగు కార్ల మీద నొక్కులు లేదా గీతలు పడకపోతే వీటికి మార్కెట్లో మంచి రీసేల్ వ్యాల్యూ లభిస్తుంది. ఈ మూడు రంగుల్లో తెలుపు రంగుకే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. 46 శాతం మంది ఇండియన్స్ తెలుపు రంగు కార్లను ఎంచుకున్నారు.

ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతున్న కార్ కలర్

తెలుపు రంగు ఎక్కువ కాలం మన్నుతుంది మరియు దీని నిర్వహణ కూడా చాలా తక్కువ. నలుపు రంగు కార్ల మీద దుమ్ము ధూళి పెద్దగా కనిపించదు అనుకుంటే పొరబడినట్లే, ఎందుకంటే తెలుపు రంగు కార్ల కంటే నలుపు రంగు కార్ల మీదే దుమ్ము అవశేషాలు స్పశష్టంగా కనిపిస్తాయి.

ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతున్న కార్ కలర్

ఇండియాలో కస్టమర్లు అసహ్యించుకుంటున్న కార్ కలర్స్

ఇండియాలో కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు బ్లూ, రెడ్, గ్రీన్, యెల్లో మరియు ఆరేంజ్ కలర్స్ అంటే అస్సలు ఇష్టపడరు. అంటే, వారందరికీ టేస్ట్ లేదనుకోకూడదు. నిజానికి, కలర్స్ కారు డిజైన్ మీద ఆధారపడి ఉంటాయి.

ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతున్న కార్ కలర్

ల్యాంబోర్ఘిని కార్లు యెల్లో కలర్‌లో చాలా బాగుంటాయి. కానీ, ఇదే కలర్ హోండా సిటీ లేదా మారుతి సియాజ్‌లో ఎలా ఉంటుందో ఊహించుకోండి.

ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతున్న కార్ కలర్

చాలా తక్కువగా ఎంచుకుంటున్న కలర్స్‌లో బీజి, బ్రౌన్, పింక్ మరియు లైట్ బ్లూ లేదా గ్రీన్ ఉన్నాయి. కారు కలర్ ఎంపిక అనేది ఫినిషింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, సాలిడ్, మెటాలిక్ లేదా మ్యాట్ పెయింట్ ఫినిషింగ్ ఉంది.

ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతున్న కార్ కలర్

ఇండియాలో ఉన్న మొత్తం కార్లలో 20 శాతం వరకు సిల్వర్ రంగులో, 11 శాతం గ్రే కలర్ ఉంటే నలుపు, ఎరుపు మరియు ఇతర రంగుల్లో 5 శాతం ఉన్నాయి. చాలా మందికి నీలం రంగు అంటే ఇష్టం, కానీ నీలం రంగు కార్ల సంఖ్య ఎరుపు లేదా నలుపు కంటే తక్కువ.

ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతున్న కార్ కలర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంచుకునే కార్ కలర్ కస్టమర్ యొక్క వ్యక్తిత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయం ఆధారంగానే కారు కలర్ ఎంచుకుంటారు. ఒక్కో రంగు ఒక కారుకు మాత్రమే సెట్ అవుతుంది. కానీ, ఆ రంగు అన్ని కార్లకు సెట్ అవ్వదు. కాబట్టి కారు కలర్ ఖచ్చితంగా దాని డిజైన్ మీద కూడా ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని కలర్లు బాగానే ఉంటాయి, మరి వైట్, సిల్వర్ మరియు బ్లాక్ వీటిలో మీకు నచ్చిన కార్ కలర్ ఏంటి...?

English summary
Read In Telugu: Can You Guess The Most Liked Car Colours In India? — Find Out The Most Hated Car Colours Too!
Story first published: Saturday, March 3, 2018, 13:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark