2017లో అత్యధికంగా గూగుల్ చేసిన టాప్ 10 కార్లు

By Anil

కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. 2017 ఏడాది ఇండియన్ ఆటో ఇండస్ట్రీలో ఎన్నో మార్పులకు కారణమయ్యింది. పెరుగుతున్న కస్టమర్లకు అనుగుణంగా కార్ల కంపెనీలు కొత్త కార్లను విడుదల చేస్తే, ఆశించిన ఫలితాలు లభించక కొన్ని కార్లు ఇదే ఏడాదిలో మార్కెట్ నుండి శాశ్వతంగా దూరమయ్యాయి. ఏదేమైనప్పటికీ చాలా వరకు సానుకూల పరిస్థితులే చోటు చేసుకున్నాయి.

ఇక కార్ల కోసం ఇండియన్స్ మునుపెన్నడూ లేనవిధంగా గూగుల్‌లో శోధించారు. గూగుల్‌లో అత్యధికంగా జరిపిన వెతుకులాటలో నిలిచిన టాప్ 10 కార్లను డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనంగా మీ కోసం అందిస్తోంది....

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన టాప్ 10 కార్లు

10. వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ

వోక్స్‌వ్యాగన్‌కు చెందిన తొలి మోస్ట్ పవర్ ఫుల్ హ్యాచ్‌బ్యాక్ పోలో జిటిఐ ఈ జాబితాలో ఆశ్చర్యకరంగా స్థానం సంపాదించుకుంది. గూగుల్‌లో ఎక్కువ మంది జరిపిన శోధనలో వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ పదవ స్థానంలో నిలిచింది.

Recommended Video - Watch Now!
Shocking Car Accident That Happened In Karunagappally, Kerala
2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

1.8-లీటర్ టిఎస్ఐ నాలుగు సిలిండర్ల ఇన్ లైన్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 189.4బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 7-స్పీడ్ డైరక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్ గల రెండు డోర్లున్న హ్యాచ్‌బ్యాక్ కేవలం 6.1 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

09. వోల్వో ఎక్స్‌సి60

భారతదేశపు మోస్ట్ పవర్ ఫుల్ మరియు హాట్ హ్యాచ్‌బ్యాక్ పోలో కారు పదవ స్థానానికి పరిమితమైందనుకుంటే, ఇక జాబితాలో లగ్జరీ కార్లకు చోటు దొరకడం కష్టమే అనుకుంటారు. కానీ, ఆశ్చర్యకరంగా వోల్వో ఎక్స్‌సి60 లగ్జరీ కారు ఈ లిస్టులో తొమ్మిదవ స్థానం దక్కించుకుంది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

వోల్వో గత ఏడాది డిసెంబరులో వోల్వో ఎక్స్‌సి60 ఎస్‌యూవీని లాంచ్ చేసింది. సరికొత్త వోల్వో ఎక్స్‌సి60 లగ్జరీ ఎస్‌యూవీలో 1969సీసీ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల ట్విన్ టుర్బో డీజల్ ఇంజన్ కలదు. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 233బిహెచ్‌పి పవర్ మరియు 480ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

8. మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ

మెర్సిడెస్ బెంజ్ తమ సిఎల్ఎ లగ్జరీ సెడాన్ కారును డిసెంబర్ 2016లో విడుదలయ్యింది. అయితే, దీని గురించి కూడా అధికంగా సంఖ్యలో గూగుల్ చేశారు. దీంతో మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ గూగుల్ సెర్చ్ పరంగా 8 వ స్థానంలో నిలిచింది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

మెర్సిడెస్ బెంజ్ సిల్ఎ రెండు ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి, 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.1-లీటర్ డీజల్ ఇంజన్. మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ కోఎఫిషియంట్ ఆఫ్ డ్రాగ్ వ్యాల్యూ(బరువును లాగే సామర్థ్యం) 0.25గా ఉంది. ప్రపంచంలో ఈ విలువ అతి తక్కువగా ఉన్న మోడల్ ఇప్పటి వరకు ఇదే.

Trending On DrivSpark Telugu:

వస్త్రధారణ చూసి అవమానించిన షోరూమ్‌లోనే ఖరీదైన బైకు కొన్నాడు!!

ఇది సింగపూర్ ఎయిర్ పోర్ట్‌ కాదు: AP లోని ఒక APSRTC బస్టాండ్

కేవలం రూ. 19,990 లకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

7. మారుతి సుజుకి సెలెరియో

ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తొలిసారిగా పరిచయం చేసిన కారు మారుతి సెలెరియో ఏఎమ్‌టి. విపణిలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ శకాన్ని ఆరంభించిన సెలెరియో గురించి గూగుల్ సెర్చింజన్‌లో ఎక్కువ మంది శోధించారు.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

తక్కువ ఇంజన్ సామర్థ్యంతో లభించే బెస్ట్ ఆటోమేటిక్ కారుగా మారుతి సెలెరియో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించే మారుతి సెలెరియో ఏఎమ్‌టి 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

6. టయోటా ఎటియోస్

టయోటా ఎటియోస్ హ్యాచ్‌బ్యాక్ 2017లో మోస్ట్ ట్రెండింగ్ కార్ల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. విపణిలో క్యాబ్ కోసం ఎక్కువగా ఎంచుకుంటున్న టయోటా ఎటియోస్ నిజజీవితంలో అత్యుత్తమ నాణ్యతగల కారుగా నిరూపించుకుంది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

టయోటా ఎటియోస్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. దేశీయంగా వాణిజ్య అవసరాలకు అధికంగా ఎంచుకుంటున్న వాటిలో టయోటా ఎటియోస్ మొదటి స్థానంలో నిలిచింది. వ్యక్తి గత అవసరాలకు ఎంచుకునేవారు చాలా తక్కువే అయినప్పటికీ, టయోటాకు మంచి సేల్స్ సాధించిపెడుతోంది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

5. మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి గత ఏడాది ప్రారంభంలో యువ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ ప్రీమియమ్ మరియు క్విర్కీ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ సరికొత్త ఇగ్నిస్ కారును లాంచ్ చేసింది. ప్రతి యువ మరియు సిటీ కొనుగోలుదారులను అమితంగా ఆకట్టుకునే ఇగ్నిస్ గురించి అధికంగానే శోధించారు.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

స్టైలిష్ లుక్ మరియు అట్రాక్టివ్ డిజైన్‌లో ఉన్న ఇగ్నిస్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వెర్షన్‌తో పాటు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో కూడా లభిస్తోంది. అధునాతన ఇంటీరియర్ ఫీచర్లను అందించింది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

4. టాటా నెక్సాన్

అత్యధికంగా గూగుల్ చేసిన కార్లలోని టాప్ 10 జాబితాలో టాటా నెక్సాన్ 4 వ స్థానం దక్కించుకుంది. భారత్‌లో అత్యధిక ఆదరణ పొందుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి టాటా తమ తొలి ఎస్‌యూవీ నెక్సాన్ ను ప్రవేశపెట్టింది. భారీ అంచనాలతో విడుదలైన నెక్సాన్‌కు గూగుల్‌లో నెటిజన్ల నుండి మంచి ఆదరణ లభించింది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

గూగుల్ వేదికగా ఎక్కువ మంది వెతికిన కార్ల జాబితాలో నిలిచిన టాటా నెక్సాని నిజానికి ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తీవ్ర అలజడని సృష్టించింది. విపణిలో మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లకు గట్టి పోటీనిచ్చిన నెస్సాన్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

3. టాటా హెక్సా

టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా అభివృద్ది చేసి, విడుదల చేసిన హెక్సా నిజానికి ఎస్‌యూవీల మార్కెట్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోంది. టాటా తమ అరియా ఎస్‌యూవీ ఆధారంగా నిర్మించినప్పటికి మంచి డిమాండ్ లభిస్తోంది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచిన హెక్సా మీద కస్టమర్ ఫిర్యాదులు కూడా తక్కువగానే ఉన్నాయి. దీనికి తోడు రాజీలేని అత్యాధునిక డిజైన్, శక్తివంతమైన ఇంజన్, అడ్వాన్స్‌డ్ ఇంటీరియర్ ఫీచర్లు మరియు ధరకు తగ్గ విలువలను కలిగి ఉంది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

2. జీప్ కంపాస్

అమెరికాకు చెందిన లగ్జరీ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం జీప్ 2017లో కంపాస్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. 2017లో విడుదలైన వాటిలో అతి ముఖ్యమైన బెస్ట్ లాంచ్‌గా జీప్ కంపాస్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. 50 లక్షల నుండి కోటి రుపాయల పైబడి ధరలతో తమ వాహనాలను లాంచ్ చేసే జీప్, ఆశ్చర్యంగా 15 నుండి 20 లక్షల ధరల శ్రేణిలో కంపాస్‌ను విడుదల చేసింది మార్కెట్‌కు షాకిచ్చింది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

మంచి బ్రాండ్, ఎన్నో ఫీచర్లు, ధరకు తగ్గ విలువలు, అత్యున్నత నిర్మాణ మరియు భద్రతా ప్రమాణాలతో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభించే జీప్ కంపాస్ భారీ విజయాన్ని అందుకుంది. జీప్ దేశీయంగా తయారు చేసిన కంపాస్ ఎస్‌యూవీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

1. మారుతి సుజుకి స్విఫ్ట్

భారతీయ కారు కొనుగోలుదారులకు మారుతి స్విఫ్ట్ యధావిధిగా మళ్లీ బెస్ట్ కారుగా మారుతి స్విఫ్ట్ నిలిచింది. కార్ల గురించి ఎక్కువ మంది చేసిన వెతుకులాటలో మారుతి స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. మారుతి అతి త్వరలో కొత్త తరం స్విఫ్ట్ కారును విడుదల చేయనున్న నేపథ్యంలో ఇప్పుడున్న స్విఫ్ట్ ప్రొడక్షన్‌ను నిలిపివేసింది.

2017లో అత్యధికంగా గూగుల్ చేసిన కార్లు

నిజమే, మారుతి సుజుకి తమ సెకండ్ జనరేషన్ స్విప్ట్ కార్ ప్రొడక్షన్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికింది. ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా భారీ మార్పులకు గురైన థర్డ్ జనరేషన స్విఫ్ట్ హ్యాచ్‍‌బ్యాక్‌ను ఈ 2018లో పూర్తి స్థాయిలో లాంచ్ చేయనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Most Trending CarsIn 2017 In India — List Of Top Searched Vehicles In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X