Subscribe to DriveSpark

ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి వస్తున్న కొత్త కార్ మరియు బైక్ కంపెనీలు

Written By:
Recommended Video - Watch Now!
Bangalore Bike Accident At Chikkaballapur | Full Details - DriveSpark

భారత వాహన పరిశ్రమ ప్రతి ఏడాది 9 నుండి 10 శాతం వృద్దిని సాధిస్తోంది. 2016లో, భారత్ ప్రపంచవ్యాప్తంగా ఐదవ అతి పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీగా నిలిచింది. ప్రస్తుతం సాధిస్తున్న భారీ వృద్దితో 2020 నాటికి ఖచ్చితంగా మూడవ స్థానంలో నిలవనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

భారత వాహన పరిశ్రమ ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో కొన్ని అంతర్జాతీయ వాహన తయారీ దిగ్గజాలు లాభాదాయకమైన భారత్‌ విపణిలో కార్యకలాపాలు ప్రారంభిచేందుకు సిద్దమయ్యాయి. దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించనున్న నూతన కార్ అండ్ బైక్ కంపెనీలు ఏవో ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి...

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

1. కియా మోటార్స్

కియా మోటార్స్ భారతదేశపు రెండవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ యొక్క భాగస్వామ్యపు సంస్థ. హ్యుందాయ్ మరియు కియా 2019 నాటికి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సిద్దమయ్యాయి. కియా మోటార్స్ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద తమ నూతన ఉత్పత్తులను ఆవిష్కరించనుంది.

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

ఇండియాలో విడుదల చేసే మోడళ్ల గురించి కియా మోటార్స్ నుండి ఎలాంటి సమచారం లేదు. అయితే, బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల మీద కియా దృష్టిసారిస్తే, హ్యుందాయ్ మోటార్స్ ప్రీమియమ్ మోడళ్ల మీద ఫోకస్ పెట్టనుంది. కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పెనుగొండ సమీపంలో ప్రొడక్షన్ ప్లాంటును నిర్మిస్తోంది.

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

కియా మోటార్స్ భారత్‌లో సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మరియు స్మాల్ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లను టార్గెట్ చేయనుంది. ఈ సెగ్మెంట్ల క్రింద వచ్చే కార్లు మారుతి వితారా బ్రిజా, మారుతి బాలెనో, మారుతి సుజుకి ఆల్టో వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనున్నాయి.

విడుదల అంచనా: 2018 చివరి నాటికి

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

2. ఎమ్‌జి మోటార్స్

ఎమ్‌జి మోటార్స్ బ్రిటన్‌కు చెందిన విలాసవంతమైన ఖరీదైన కార్ల తయారీ సంస్థ. 1993లో ప్యాసింజర్ కార్ల తయారీ పరిశ్రమలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్ 2018లో పూర్తి స్థాయిలో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలో పలు రకాల మోడళ్ల టీజర్‌లను లాంచ్ చేస్తోంది.

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

ఎమ్‌జి మోటార్స్ తమ కార్ల తయారీని దేశీయంగానే చేపట్టనుంది. గత ఏడాది గుజరాత్‌లోని జనరల్ మోటార్స్‌కు చెందిన హలోల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటును సొంతం చేసుకుంది. ఈ తయారీ కేంద్రంగానే తమ అన్ని మోడళ్లను ఉత్పత్తి చేయనుంది.

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

ఎమ్‌జి మోటార్స్ తాజాగా విడుదల చేసిన టీజర్లలో హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్‌కు పోటీనిచ్చే ఎమ్‌జి జడ్ఎస్ అనే కాంపాక్ట్ ఎస్‌యూవీని రివీల్ చేసింది. దీనితో పాటు, మారుతి బాలెనో, హోండా జాజ్ హ్యుందాయ్ ఐ20 మరియు వోక్స్‌వ్యాగన్ పోలో కార్లకు పోటీగా ఎమ్‌జి3 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను సిద్దం చేస్తోంది.

విడుదల అంచనా: 2018 మధ్య భాగానికి

Trending On DriveSpark Telugu:

సరదా కోసం చేసిన బైక్ రైడ్‌లో 11 ఏళ్ల చిన్నారిని చంపేశాడు, చితకబాదిన గ్రామస్థులు...

ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి చరిత్ర మిగిల్చిన నిజాలు

2018లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం విడుదలయ్యే కార్లు

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

3. నార్టన్

బ్రిటన్‌కు చెందిన దిగ్గజ మోడ్రన్ క్లాసిక్ బైకుల తయారీ సంస్థ నార్టన్ మోటార్ సైకిల్స్ 2018లో తమ బైకులను పరిమిత సంఖ్యలో దిగుమతి చేసుకుని విక్రయించనుంది. తరువాత 2019 నుండి దేశీయంగా తయారు చేసిన బైకులను లాంచ్ చేయనుంది.

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

నార్టన్ కంపెనీ కైనటిక్ సంస్థతో చేతులు కలిపింది. అహ్మద్‌నగర్ కైనటిక్ ప్లాంటులో నార్టన్ కమాండో మరియు డామినేటర్ బైకులను ఉత్పత్తి చేయనుంది. నార్టన్ కమాండో శ్రేణిలో కమాండో 961 స్పోర్ట్ మరియు కమాండో 961 కెఫే రేసర్ బైకులు ఉన్నాయి. అదే విధంగా నార్టన్ డామినేటర్ శ్రేణిలో స్పోర్ట్ మరియు డామిరేసర్ అనే మోడళ్లు ఉన్నాయి.

విడుదల అంచనా: 2018 చివరి నాటికి

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

4. SWM

బహుశా చాలా మందికి ఎస్‌డబ్ల్యూఎమ్(SWM) బ్రాండ్ పేరు గురించి తెలిసుండకపోవచ్చు. SWM అంటే స్పీడీ వర్కిగ్ మోటార్ సైకిల్స్ అని అర్థం. ఇటాలియన్‌కు చెందిన ఖరీదైన బైకుల తయారీ సంస్థ SWM మోటార్ సైకిల్స్ కూడా ఏడాదే విపణిలోకి ప్రవేశించనుంది.

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

SWM కంపెనీ సూపర్‌డ్యూయల్ టి మిడిల్ వెయిట్ అడ్వెంచర్ టూరర్ బైకును లాంచ్ చేయనుంది. 600సీసీ కెపాసిటి గల ఈ బైకు ధర సుమారుగా 6 లక్షల రుపాయలు ఎక్స్-షోరూమ్‌గా ఉండనుంది.

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

SWM సూపర్‌డ్యూయల్ టి బైకును మహారాష్ట్రలోని కైనటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటులో అసెంబుల్ చేయనుంది. ఈ అడ్వెంచర్ బైకు టి అనే టూరింగ్ వెర్షన్‌లో, ఎక్స్ అనే ఆఫ్ రోడ్ వెర్షన్ వేరియంట్లో రానుంది.

విడుదల అంచనా: 2018 తొలి సగంలో

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

5. జావా

జావా బ్రాండ్‌కు ఇండియాలో ఎలాంటి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1990 కాలంలో ఇండియన్ మార్కెట్ నుండి నిష్క్రమించిన జావా మోటార్ సైకిల్స్ బ్రాండ్ ఇప్పుడు మళ్లీ వస్తోంది. దేశీయ విభిన్న వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా జావా బ్రాండుకు ఊపిరిపోయనుంది.

కొత్త కార్ అండ్ బైక్ కంపెనీలు

మహీంద్రా తమ మోజో బైకుల్లో అందించిన ఇంజన్‌నే జావా బ్రాండ్ మోటార్ సైకిళ్లలో కూడా అందించే అవకాశం ఉంది. అయితే, గతంలో 350సీసీ ఓహెచ్‌సి ఇంజన్‌తో లభించే బైకులకు, మరియు ఇప్పుడు రానున్న బైకులకు మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో అనే ఆశ్చర్యంతో వేచి చూడాల్సిందే మరి.

విడుదల అంచనా: 2018లో ఆలస్యంగా

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: New Car/ Bike Manufacturers To Enter India In 2018
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark