TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
సరికొత్త ఫోర్డ్ ఆస్పైర్ విడుదల వివరాలు రివీల్
గత కొన్ని రోజులు నుండి ఆస్పైర్ ఫోటో గల ఫోర్డ్ ఆస్పైర్ ప్రొడక్షన్ ఆగిపోయిందనే స్టోరీలు ఇంటర్నెట్లో ఎక్కువగా కనబడుతున్నాయి. అవును, ప్రస్తుత తరానికి చెందిన ఫోర్డ్ ఆస్పైర్ ప్రొడక్షన్ నిలిచిపోయింది.
కానీ, తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు కొత్త తరానికి చెందిన ఫోర్డ్ ఆస్పైర్ అతి త్వరలో ప్రొడక్షన్ దశకు చేరుకోనున్నట్లు తెలిసింది. భారీ మార్పులు మరియు చేర్పులతో వస్తోన్న కొత్త తరం ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ఈ జూన్ 2018 నాటికి మార్కెట్లో విడుదలకు సిద్దమైనట్లు తెలిసింది.
అంతే కాకుండా, రిపోర్ట్స్ మేరకు నెక్ట్స్ జనరేషన్ ఫోర్డ్ ఆస్పైర్ కారులో ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోల్చుకుంటే భారీ అప్‌డేట్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నూతన ఆస్పైర్ ఫ్రంట్ డిజైన్‌లో కొత్తగా డిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు బంపర్‌తో పాటు రియర్ డిజైన్‌లోని అప్‌డేట్ టెయిల్ ల్యాంప్ సెక్షన్, బంపర్ మరియు అధునాతన అల్లాయ్ వీల్స్ రానున్నాయి.
తరువాత తరం ఫోర్డ్ ఆస్పైర్ ఇంటీరియర్‌లో ఇకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో పరిచయం చేసిన సరికొత్త సింక్3 టచ్‍స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానుంది. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి కనెక్టివిటి అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. క్యాబిన్ స్పేస్ విషయంలో ఎలాంటి మార్పు రావడం లేదు.


కొత్త తరం ఫోర్డ్ ఆస్పైర్ 121బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ 1.5-లీటర్ డ్రాగన్ సిరీస్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఫోర్డ్ ఇండియా తొలుత ఈ పెట్రోల్ ఇంజన్‌ను ఇకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో పరిచయం చేసింది.
డీజల్ వెర్షన్ ఆస్పైర్ కోసం అదే మునుపటి 1.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇంజన్ ఇందులో రానుంది. ఇది 98.9బిహెచ్‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫోర్డ్ ఆస్పైర్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభించనుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సరికొత్త ఫోర్డ్ ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా భారీ అప్‌డేట్స్‌తో రానుంది. పోటీగా ఉన్న ఇతర మోడళ్లను ఎదుర్కునేందుకు ప్రీమియమ్ ఫీచర్లను అందివ్వడానికి ఫోర్డ్ ప్రయత్నిస్తోంది. కొత్త తరం ఆస్పైర్ మార్కెట్లోకి విడుదలైతే, మారుతి డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, వోక్స్‌వ్యాగన్ అమియో మరియు న్యూ జనరేషన్ హోండా అమేజ్ వంటి కాంపాక్ట్ సెడాన్‌లతో పోటీపడనుంది.