ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్ ఆవిష్కరించిన ఫోర్డ్

Written By:
Recommended Video - Watch Now!
Tata Nexon Faces Its First Recorded Crash

అమెరికా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ తమ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని స్టార్మ్ ఎడిషన్‌లో ఆవిష్కరించింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క ఆఫ్ రోడ్ వెర్షన్ సరికొత్త ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్‌లో పరిచయం చేసింది.

 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్

ప్రస్తుతం బ్రెజిల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్ ఎస్‌యూవీ ధర 99,990 బ్రెజిల్ రియల్. మన కరెన్సీ దీని ధర రూ. 20 లక్షలుగా ఉంది. 20 లక్షల ఖరీదైన ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్‌లో ఉన్న ప్రత్యేకతలేంటో చూద్దాం రండి...

 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్

ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్ చూడటానికి ఇకోస్పోర్ట్ రెగ్యులర్ ఎస్‌యూవీని పోలి ఉన్నప్పటికీ, ఇందులో ఎన్నో అపూర్వమైన, అరుదైన ఫీచర్లను అందించింది. డిజైన్, ఫీచర్లు మరియు సాంకేతికత ఇలా అన్ని అంశాల పరంగా ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్ విభిన్నమైన ఎస్‌యూవీ.

 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్

డిజైన్ పరంగా చూసుకుంటే, ఫ్రంట్ ప్రొఫైల్‌లో STORM బ్యాడ్జింగ్ పేరుతో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ ఉంది. ఆఫ్ రోడ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన స్టార్మ్ ఎడిషన్‌లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న జెనాన్ హెడ్ ల్యాంప్స్, బ్లాక్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, బాడీ చుట్టూ మరియు బానెట్ మీద స్పోర్టివ్ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంది.

 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్

స్టార్మ్ ఎడిషన్ పేరుతో వచ్చిన ఇకోస్పోర్ట్ ఆఫ్ రోడ్ వెర్షన్ ఎస్‌యూవీలోని రెండు డోర్ల మీద STORM బ్యాడ్జింగ్ కలదు. ఎస్‌యూవీకి స్పోర్టివ్ నేచర్ కల్పించేందుకు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్‌ను డార్క్ లండన్ గ్రే కాంబినేషన్ పెయింట్ స్కీములో అందించింది.

 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్

బ్రౌన్, వైట్, గ్రే మరియు బ్లాక్ వంటి నాలుగు విభిన్న రంగుల్లో లభించే ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీలో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వీటికి మిచేలియన్ స్టాండర్డ్ టైర్లను అందివ్వడం జరిగింది.

 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్

ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్ ఇంటీరియర్ విషయానికి వస్తే, కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క క్యాబిన్ డ్యూయల్-టోన్ ఆరేంజ్ మరియు గ్రే రంగులతో పూర్తిగా అప్‌డేట్ చేయబడింది. STORM బ్యాడ్జింగ్ గల లెథర్ అప్‌హోల్‌స్ట్రే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్

ఫీచర్ల పరంగా, ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్‌లో 8.0-అంగుళాల పరిమాణంలో ఉన్న సింక్3 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు న్యావిగేషన్‌ను సపోర్ట్ చేస్తుంది.

2018 మారుతి స్విఫ్ట్ అంచనా విడుదల మరియు ధరల వివరాలు

మారుతి బాలెనో మరియు హ్యుందాయ్ ఐ20 లకు చెమటలు పుట్టించే టాటా కొత్త మోడల్

2018 కొత్త మారుతి స్విఫ్ట్ Vs పాత స్విఫ్ట్

 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్

సేఫ్టీ పరంగా స్టార్మ్ ఎడిషన్ అఫ్ రోడ్ వెర్షన్ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఏడు ఎయిర్ బ్యాగులు,యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, స్టెబిలిటి కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-అసిస్ట్, యాంటీ-రోల్ఓవర్ సిస్టమ్ మరియు పార్కింగ్ అసిస్ట్ కోసం రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్

ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్ ఎస్‌యూవీ ఇంజన్ విషయానికి వస్తే, సాంకేతికంగా ఇది పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 170బిహెచ్‌పి పవర్ మరియు 202ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్

అదే విధంగా ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్‌లోని 2.0-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 176బిహెచ్‌పి పవర్ మరియు 221ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌ల అనుసంధానం చేసిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ నుండి పవర్ మరియు టార్క్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఇండియా విభాగం గత ఏడాది నవంబరులో విపణిలోకి ఇకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 7.31 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ప్రస్తుతం, దేశీయంగా దీని విడుదల గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ సిగ్నేచర్ ఎడిషన్ పేరుతో టెస్టింగ్ నిర్వహిస్తోంది. కాబట్టి, సిగ్నేచర్ ఎడిషన్ మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

 ఫోర్డ్ ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్

ఒకవేళ, ఫోర్డ్ ఇండియా ఇకోస్పోర్ట్ స్టార్మ్ ఎడిషన్ ఆఫ్ రోడ్ వెర్షన్ కాంపాక్ట ఎస్‌యూవీని లాంచ్ చేసినప్పటికీ, అందులో 2.0-లీటర్ ఇంజన్ బదులు, 1.5-లీటర్ కెపాసిటి గల ఇంజన్ ఇంజన్‌లతో ప్రవేశపెడుతుంది. పవర్‌ఫుల్ వెర్షన్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీనే కావాలనుకుంటే బ్రెజిల్ వెర్షన్‌ను దిగుమతి చేసుకోవాల్సిందే.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: New Ford EcoSport Storm Edition Unveiled; Gets 4WD & Sporty Cosmetic Upgrades
Story first published: Wednesday, January 31, 2018, 13:46 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark