TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
హోండా నుండి వితారా బ్రిజా, నెక్సాన్ ఎస్‍యూవీలకు పోటీగా వస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో తమ బ్రియో ద్వారా చిన్న సక్సెస్ అందుకుంది. అయితే, ఇది ఎక్కువ కాలం నిలవలేదు. అయితే, హ్యాచ్‌బ్యాక్, సెడాన్, క్రాసోవర్ కార్ల సెగ్మెంట్లో మాత్రమే ఉన్న హోండా మోటార్స్ ఇప్పుడు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కూడా తమ లక్కును పరీక్షించుకోవాలని చూస్తోంది.
ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఉన్న 5.55 శాతం వాటాను 10 శాతానికి పెంచుకునే లక్ష్యంలో భాగంగా హోండా అమేజ్ ఆధారిత సబ్-నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టాలని చూస్తోంది.
హోండా కనుక కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొస్తే విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, టాటా నెక్సాన్ మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు ఈ సెగ్మెంట్ ఆధారిత మోడళ్లకు గట్టి పోటీనివ్వడం ఖాయం.
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ యోయిచిరో యుయెనో మీడియాతో మాట్లాడుతూ, "ఎస్‌యూవీ నుండి చిన్న కార్ల మధ్య ఉన్న స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తున్నాం, భారత్‌లో శరవేగంగా వృద్ది చెందుతున్న మార్కెట్, మరికొన్నేళ్లలో చిన్న కార్ల సెగ్మెంట్ కంటే కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంటో ఎన్నో అవకాశాలను కల్పించనుంది. అందుకే పలు రకాల ఎస్‌యూవీలను భారత్ కోసం పరిశీలిస్తున్నట్లు" చెప్పుకొచ్చాడు.
ప్రత్యేకించి హోండా మోటార్స్ తాజాగా ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించిన కొత్త తరం అమేజ్ సెడాన్ ఆధారంతో కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ది చేయాలని హోండా భావిస్తోంది. రెండవ తరానికి చెందిన అమేజ్ సెడాన్ కారును 2యుఎ కోడ్ పేరుతో డెవలప్ చేశారు. ఇదే ఫ్లాట్‌ఫామ్ మీదనే కొత్త ఎస్‌యూవీ కోసం అధ్యయనం చేస్తున్నారు.
హోండా సిటి కారు ఇప్పుడు అంతంత మాత్రం ఫలితాలే సాధిస్తోంది. అయితే, హోండా వారి క్రాసోవర్ ఎస్‌యూవీ డబ్ల్యూఆర్-వి హోండా ఊహించినదానికంటే మంచి ఫలితాలు సాధిస్తోంది. సిటి తరువాత డబ్ల్యూఆర్-వి హోండాకు రెండవ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. బహుశా ఈ ఫలితాలే హోండాను కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ వైపు ఆలోచించేలా చేసిందని చెప్పవచ్చు.
హోండా మోటార్స్ తమ అమేజ్ కాంపాక్ట్ సెడాన్ ఆధారిత సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయాలని నిర్ణయించకుంది. సాంకేతికంగా అమేజ్‌లోని అవే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లు మరియు హోండా సిటి లోని ఫీచర్లను అందించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో యుటిలిటి వెహికల్ సెగ్మెంట్ సుమారుగా 25 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. గత కొన్నేళ్ల నుండి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఈ 25 శాతం కాస్త 30 శాతానికి చేరుకుంటోంది.
హోండా మోటార్స్ అమేజ్ ఆధారిత కాంపాక్ట్ ఎస్‌యూవీతో పాటు ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు రెనో క్యాప్చర్ ఎస్‌యూవీలకు పోటీగా హోండా హెచ్ఆర్-వి తీసుకురావాలని భావిస్తోంది.
అంతే కాకుండా, కొత్త తరానికి చెందిన బ్రియో హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. విపణిలో ఉన్న హోండా సిటి, డబ్ల్యూఆర్-వి, జాజ్ మరియు న్యూ హోండా అమేజ్ కంపెనీకి కావాల్సిన సేల్స్ సాధించిపెడితే, సిఆర్-వి, సివికి మరియు అకార్డ్ కార్లు హోండా బ్రాండ్ విలువను పెంచుతాయని హోండా భావిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హోండా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో బిఆర్-వి తరహా సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. డబ్ల్యూఆర్-వి మంచి ఫలితాలను సాధిస్తుండటంతో డబ్ల్యూఆర్-వి నుండి కొన్ని అంశాలను సేకరించి తమ అప్ కమింగ్ ఎస్‌యూవీలో అందించే అవకాశం ఉంది. ఇప్పటికే విపరీతమైన పోటీ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్న హోండా మోటార్స్ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలంటే దీని విడుదల కోసం వేచి ఉండాల్సిందే...