సరికొత్త అమేజ్ కారును ఆవిష్కరించిన హోండా: డిజైర్ పతనం గ్యారంటీ!!

Written By:
Recommended Video - Watch Now!
New Honda Amaze Facelift Auto Expo 2018

ఆటో ఎక్స్‌పో 2018: హోండా కార్స్ ఇండియా విభాగం ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేదికలో సరికొత్త ఆమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న అమేజ్ సెడాన్‌తో పోల్చుకుంటే ఇది పూర్తి భిన్నంగా ఉంది.

ఈ నూతన హోండా అమేజ్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వస్తే మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు టాటా టిగోర్ కార్ల కథ కంచికే అని చెప్పవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోల కోసం....

హోండా అమేజ్

హోండా అమేజ్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వస్తే మారుతి డిజైర్ మరియు హ్యుందాయ్ ఎక్సెంట్ కార్లను ఎంచుకోవడం దండగనే చెప్పాలి. పాత అమేజ్‌తో పోల్చుకుంటే కొత్త తరం అమేజ్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంది.

హోండా అమేజ్

హోండా కార్స్ ఇండియా యొక్క పాపులర్ మిడ్ సైజ్ సెడాన్ కారు హోండా సిటి ఆధారంగా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును అభివృద్ది చేసింది. ఫ్రంట్ డిజైన్‌లో పదునైన హెడ్ ల్యాంప్స్, రెండు హెడ్ ల్యాంప్స్‌‍కు మధ్యలో స్పోర్టివ్ ఫ్రంట్ గ్రిల్ మరియు హోండా బ్యాడ్జ్ ఉన్నాయి.

హోండా అమేజ్

న్యూ హోండా అమేజ్ సైడ్ డిజైన్‌లో ప్రధానమైన క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ నుండి డోర్ హ్యాండిల్స్ పైభాగం మీదుగా రియర్ టెయిల్ ల్యాంప్స్ అంచుల వరకు ఉన్నాయి. సరికొత్త హోండా అమేజ్‌లో 15-అంగుళాల వీల్స్ ఉన్నాయి. పాత అమే‌జ్‌లో 14-అంగుళాల వీల్స్ ఉండేవి.

హోండా అమేజ్

రియర్ డిజైన్‌ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. సి-ఆకారంలో ఉన్న టెయిల్‌లైట్లు క్రోమ్ పట్టీ ద్వారా హోండా అమేజ్ బ్యాడ్జ్‌ను కలుపుతాయి. అదనపు డిజైన్ అంశాలలో డిక్కీ డోర్ మీద ఉన్న స్పాయిలర్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న రియర్ బంపర్ ఉన్నాయి.

హోండా అమేజ్

ఎక్ట్సీరియర్ తరహాలోనే హోండా అమేజ్ ఇంటీరియర్ కూడా పూర్తిగా మారిపోయింది. హోండా కథనం మేరకు, అమేజ్ కాంపాక్ట్ సెడాన్ ఇంటీరియర్ మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే మరింత విశాలంగా ఉంది.

హోండా అమేజ్

హోండా అమేజ్ ఇంజన్ స్పెసిఫికేషన్స్

సరికొత్త హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారులో అవే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. అయితే, ఇవి అత్యుత్తమ పవర్ మరియు మైలేజ్ ఇస్తాయని హోండా పేర్కొంది.

హోండా అమేజ్

1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 87బిహెచ్‌పి పవర్ మరియు 4,500ఆర్‌పిఎమ్ వద్ద 109ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా అమేజ్

1.5-లీటర్ డీజల్ ఇంజన్‌ పవర్‌ కొద్దిగా పెరిగింది. ఇది 98బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌‌బాక్స్‌తో లభ్యమవుతున్నాయి.

హోండా అమేజ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ ఫస్ట్ జనరేష్ అమేజ్‌తో పోల్చుకుంటే ఇంజన్ మినహా ప్రతి ఒక్క అంశం పరంగా భారీ మార్పులకు గురయ్యింది. కండలు తిరిగిన శరీరాకృతి , ఆకర్షణీయమైన ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్ పోటీదారులకు చుక్కలు చూపిస్తుంది.

జపాన్ దిగ్గజం హోండా మోటార్స్ ఈ సెకండ్ జనరేష్ అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును వచ్చే ఏడాది ప్రారంభం నాటికి విడుదల చేయనుంది.

బాంబు పేల్చిన మారుతి: అద్భుతమైన మైలేజ్, అదిరే ఫీచర్లతో చీపెస్ట్ స్విఫ్ట్ విడుదల

English summary
Read In Telugu: Auto Expo 2018: New Honda Amaze Revealed - To Rival The Maruti Dzire

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark