విడుదలకు ముందే హోండా అమేజ్ వేరియంట్లు లీక్

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ మే 16, 2018 న సరికొత్త హోండా అమేజ్ విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

By Anil Kumar

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ మే 16, 2018 న సరికొత్త హోండా అమేజ్ విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే, హోండా అమేజ్ విడుదలకు ముందే, ఇది లభించే వేరియంట్లు మరియు కొన్ని ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి.

విడుదలకు ముందే హోండా అమేజ్ వేరియంట్లు లీక్

మునుపటి హోండా అమేజ్‌ కారుతో పోల్చితే, సరికొత్త అమేజ్ డిజైన్ పరంగా పూర్తిగా మారిపోయింది. నూతన డిజైన్ ఫిలాసఫీలో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా మునుపటి మోడల్‌కు ఏ మాత్రం పొంతన లేని శైలిలో ఉంది.

విడుదలకు ముందే హోండా అమేజ్ వేరియంట్లు లీక్

సరికొత్త 2018 హోండా అమేజ్ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యం కానుంది. అవి, ఇ, ఎస్, వి మరియు విఎక్స్. భద్రత పరంగా హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఐఎస్ఒపిక్స్ చైల్డ్ సీట్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్లు అమేజ్ అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా రానున్నాయి.

విడుదలకు ముందే హోండా అమేజ్ వేరియంట్లు లీక్

హోండా అమేజ్ బేస్ ఇ వేరియంట్లో క్రోమ్ గ్రిల్, పియానో బ్లాక్ కన్సోల్ గల డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్, ఎయిర్ కండీషనింగ్ మరియు డ్రైవర్ సైడ్ ఆటోమేటిక్ విండ్ డౌన్ ఫీచర్ ఉంది. ఇవి మినహాయిస్తే, అమేజ్ బేస్ వేరియంట్లో సౌకర్యం మరియు లగ్జరీకి సంభందించి మరే ఇతర ఫీచర్లు రాలేదు.

విడుదలకు ముందే హోండా అమేజ్ వేరియంట్లు లీక్

హోండా అమేజ్ ఎస్ వేరియంట్లో టర్న్ ఇండికేటర్స్ గల ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే మరియు ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. అంతే కాకుండా, కీలెస్ ఎంట్రీ, ఆడియో కంట్రోల్స్ గల టిల్ట్ స్టీరింగ్ వీల్, 2-డిఐఎన్ ఫోర్-స్పీకర్ ఆడియో సిస్టమ్ మరియు అడ్జెస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి అదనపు ఫీచర్లు దీని సొంతం.

విడుదలకు ముందే హోండా అమేజ్ వేరియంట్లు లీక్

హోండా అమేజ్ వి మరియు వి సివిటి వేరియంట్లలో ఎల్ఇడి పొజిషన్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెల్‌కమ్ లైట్ గల ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ డిక్కీ డోర్ ఓపెనింగ్ ఫీచర్లతో పాటు, సివిటి మోడల్‌లో పెడల్ షిఫర్స్ కూడా ఉన్నాయి.

విడుదలకు ముందే హోండా అమేజ్ వేరియంట్లు లీక్

హోండా అమేజ్ టాప్ ఎండ్ విఎక్స్ వేరియంట్లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. క్రూయిజ్ కంట్రోల్, వాయిస్ గుర్తించే టెక్నాలజీ మరియు వన్-టచ్ ఆటో అప్/డౌన్ ఫంక్షన్ గల డ్రైవర్ సైడ్ విండో వంటి ఫీచర్లు ఉన్నాయి.

విడుదలకు ముందే హోండా అమేజ్ వేరియంట్లు లీక్

సాంకేతికంగా హోండా అమేజ్ అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యం కానుంది. వీటిలో పెట్రోల్ మోడల్ 89బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్, అదే విధంగా డీజల్ మోడల్ 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్ ఆప్షన్‍‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఎంచుకోవచ్చు.

విడుదలకు ముందే హోండా అమేజ్ వేరియంట్లు లీక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నూతన హోండా అమేజ్ పాత మోడల్‌తో పోల్చుకుంటే పూర్తి స్థాయిలో కొత్త రూపాన్నికలిగి ఉంది. కొత్త తరం హోండా అమేజ్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ లగ్జరీ ఫీల్ కలిగిస్తుంది. మరో ముఖ్యమైన అంశం, అమేజ్ లభించే అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్, ఇబిడి వంటి ఫీచర్లు తప్పనిసరిగా రావడం.

రూ. 5.5 లక్షల నుండి రూ. 9 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉన్న హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ విపణిలో ఉన్న మారుతి డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, వోక్స్‌వ్యాగన్ అమియో, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ వంటి కాంపాక్ట్ సెడాన్ మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: New Honda Amaze 2018 Variants Revealed Ahead Of Launch
Story first published: Tuesday, May 8, 2018, 11:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X