హోండా సిటీ కంటే అధిక మైలేజ్‌తో వస్తున్న హోండా సివిక్

Written By:
Recommended Video - Watch Now!
New Honda Amaze Facelift Auto Expo 2018

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2018లో తమ కొత్త తరం సివిక్ సెడాన్ కారును ఆవిష్కరించింది. పదవ తరానికి చెందిన హోండా సివిక్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది.

హోండా సివిక్ మైలేజ్

విపణిలో ఉన్న స్కోడా ఆక్టావియా, టయోటా కరోలా ఆల్టిస్ మరియు హ్యుందాయ్ ఎలంట్రాలకు పోటీగా వస్తున్న హోండా సివిక్ మైలేజ్ హోండా ఇండియా లైనప్‌లో ఉన్న సిటి సెడాన్ కంటే అధికంగా ఉంది. యూరప్ మరియు ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న హోండా సివిక్ ఇంజన్, మైలేజ్ మరియు ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి.

హోండా సివిక్ మైలేజ్

హోండా సివిక్ డీజల్ వేరియంట్ మైలేజ్ వివరాలను వెల్లడించింది. సివిక్ సెడాన్ లీటర్‌కు 29.4కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న హోండా సిటి డీజల్ సెడాన్ వేరియంట్ కంటే అధికం.

హోండా సివిక్ మైలేజ్

సాంకేతికంగా, 2018 హోండా సివిక్ డీజల్ వెర్షన్‌లో 1.6-లీటర్ కెపాసిటి గల ఐ-డిటిఇసి నాలుగు సిలిండర్ల టుర్బో-ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. 4,000ఆర్‌పిఎమ్ వద్ద 118బిహెచ్‌పి పవర్ మరియు 2,000ఆర్‌పిఎమ్ వద్ద 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా సివిక్ మైలేజ్

కొత్త తరం హోండా సివిక్ ప్రీమియమ్ సెడాన్ కారులోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. హోండా సివిక్ 10.5 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్లు వేగాన్ని అందుకుంటుంది.

హోండా సివిక్ మైలేజ్

యూరోపియన్ స్పెక్ హోండా సివిక్ సెడాన్ కారులో ఐడిల్/స్టాప్ ఫంక్షన్ అందివ్వడంతో అత్యధిక మైలేజ్ సాధ్యమైంది. అయితే, ఇండియన్ వెర్షన్ హోండా సివిక్ డీజల్ వెర్షన్ మైలేజ్ లీటర్‌కు 28 కిలోమీటర్లుగా ఉంది.

హోండా సివిక్ మైలేజ్

అత్యధిక పవర్ మరియు టార్క్ ఇచ్చినప్పటికీ మైలేజ్ విషయంలో అద్భుతమే చేసిందని చెప్పాలి. హోండా సిటి సెడాన్‌లోని 1.5-లీటర్ కెపాసిటి గల ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్ కంటే సివిక్ డీజల్ వెర్షన్ మైలేజ్ ఎక్కువగా ఉంది. హోండా సిటి డీజల్ మైలేజ్ లీటర్‌కు 25.6కిలోమీటర్లుగా ఉంది.

హోండా సివిక్ మైలేజ్

హోండా మోటార్స్ సివిక్ సెడాన్‌లో అందిస్తున్న 1.6-లీటర్ టుర్బో-ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ను ఇండియాలోని తపుకరా ప్రొడక్షన్ ప్లాంటులోనే ఉత్పత్తి చేస్తోంది. అత్యంత పోటీతత్వంతో సివిక్ సెడాన్ ధరలను నిర్ణయించాలని హోండా భావిస్తోంది.

హోండా సివిక్ మైలేజ్

1.6-లీటర్ డీజల్ ఇంజన్‌తో పాటు థాయిలాండ్ స్పెక్ వెర్షన్ 1.8-లీటర్ కెపాసిటిగల గల పెట్రోల్ ఇంజన్ కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది. ఇది 141బిహెచ్‌పి పవర్ మరియు 174ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా సివిక్ మైలేజ్

ఈ 1.6-లీటర్ డీజల్ ఇంజన్ ట్విన్-టుర్బో బుూస్టర్ ద్వారా హోండా సిఆర్-విలో కూడా వస్తోంది. హోండా ప్రీమియమ్ ఎస్‌యూవీ సిఆర్-విలో రానున్న ఈ ఇంజన్ 158బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించనుంది.

హోండా సివిక్ మైలేజ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018 హోండా సివికి 29.4కిలోమీటర్ల మైలేజ్‌తో వస్తుండటంతో ప్రతి హోండా సివిక్ ప్రేమికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రీమియమ్ సెడాన్ కారును కోరుకునే ప్రతి ఇండియన్ కస్టమర్‌కు సరికొత్త హోండా సివిక్ ఫేవరెట్ కారుగా నిలవడం ఖాయం. ఇది సుమారుగా రూ. 15 లక్షల ధరల శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: New Honda Civic Diesel's Mileage Is Quite Impressive For A Sporty Sedan
Story first published: Sunday, February 25, 2018, 12:33 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark