హ్యుందాయ్ క్రెటా మీద పది రోజుల్లోనే 14,366 బుకింగ్స్: ఎందుకింత డిమాండ్?

హ్యుందాయ్ మోటార్స్ ఇటీవల విపణిలోకి రెండవ తరానికి చెందిన సరికొత్త క్రెటా ఎస్‌యూవీని లాంచ్ చేసింది. అయితే, విడుదలైన కేవలం పది రోజుల్లోనే క్రెటా మీద ఏకంగా 14,366 బుకింగ్స్ నమోదైనట్లు వెల్లడించింది.

హ్యుందాయ్ మోటార్స్ ఇటీవల విపణిలోకి రెండవ తరానికి చెందిన సరికొత్త క్రెటా ఎస్‌యూవీని లాంచ్ చేసింది. అయితే, విడుదలైన కేవలం పది రోజుల్లోనే క్రెటా మీద ఏకంగా 14,366 బుకింగ్స్ నమోదైనట్లు వెల్లడించింది.

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

పది రోజుల్లోనే ఈ తరహా ఫలితాలు సాధించిందంటే.. మరి నెల రోజుల్లో ఎలాంటి సేల్స్ సాధిస్తుందో చూడాలి మరి. అనూహ్యమైన సేల్స్ సాధిస్తున్న హ్యుందాయ్ క్రెటాలో అసలు ప్రత్యేకతలేంటో చూద్దాం రండి...

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

సరికొత్త 2018 హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర రూ. 9.43 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. హ్యుందాయ్ అందిస్తున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎన్నో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్‌తో వచ్చింది.

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

హ్యుందాయ్ మోటార్ ఇండియా సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వైకె కూ మాట్లాడుతూ, "2018 క్రెటా పట్ల అనూహ్యమైన ఆదరణ మరియు ప్రేమను కనబరిచిన ఇండియన్ కస్టమర్లు ధన్యవాదాలు తెలియజేశాడు."

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

ఆధునిక ప్రీమియం బ్రాండ్ హ్యుందా క్రెటా పరిచయంతో క్రెటాను ఎంచుకునే ప్రతి ఓనరుకు అద్భుతమైన అనుభవాన్ని కల్పించినట్లు చెప్పుకొచ్చాడు. భారతదేశపు ఖరీదైన మరియు సౌకర్యవంతమైన ప్రీమియం ఎస్‍‌యూవీ క్రెటాలో ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ సేఫ్టీ మరియు ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

హ్యుందాయ్ క్రెటా మొత్తం ఆరు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, ఇ, ఇ+, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్(డ్యూయల్ టోన్) మరియు ఎస్ఎక్స్(ఒ). క్రెటాలోని బేస్ వేరియంట్ మినహా, మిగతా అన్ని వేరియంట్లు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతున్నాయి.

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

2018 హ్యుంయాద్ క్రెటాలో అవే మునుపటి 1.4-లీటర్ డీజల్ మరియు 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లు యథావిధిగా వచ్చాయి. వీటిలో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే 1.4-లీటర్ డీజల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

అదే విధంగా, 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌ వేరియంట్లు కూడా 121 బిహెచ్‌పి పవర్ మరియు 126ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. వీటిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు.

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

సరికొత్త సెకండ్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఎనిమిది విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, ప్యాసన్ ఆరేంజ్, మెరైన్ బ్లూ, పర్ల్ వైట్, స్లీక్ సిల్వర్ స్టార్‌డస్ట్, ఫైరీ రెడ్ మరియు ఫాంటమ్ బ్లాక్. అదే విధంగా వైట్/బ్లాక్ మరియు ఆరేంజ్/బ్లాక్ డ్యూయల్ టోన్ రంగుల్లో కూడా లభిస్తోంది.

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

2018 హ్యందాయ్ క్రెటా ఎస్‌యూవీలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్. ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అనలాక్, స్మార్ట్ కీ బ్యాండ్, సన్‌రూఫ్, ఫాలో-మి-హోమ్ హెడ్ ల్యాంప్స్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ మోటార్స్ క్రెటా ఎస్‌యూవీని మొదట 2015లో లాంచ్ చేసింది. ప్రస్తుతం, ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇతర ఎస్‌యూవీల కంటే ఖరీదైన ఎస్‌యూవీ క్రెటా. అయినప్పటికీ, భారతదేశపు సెకండ్ బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా ద్వితీయ స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని మారుతి బ్రిజా ఆక్రమించింది.

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

హ్యుందాయ్ క్రెటా విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, టాటా నెక్సాన్ మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీలతో పాటు విపణిలో ఉన్న రెనో క్యాప్చర్ మరియు రెనో డస్టర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్

1. హోండా అమేజ్ రికార్డ్ సేల్స్: హోండా ఇండియా చరిత్రలో ఇదే అధికం

2.భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

3.టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా 7-సీటర్ నిస్సాన్ టెర్రా

4.నిస్సాన్ కిక్స్ విడుదల ఈ ఏడాదిలోనే

5.చైనా-పాక్ దేశాలకు గట్టి షాకిచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

Most Read Articles

English summary
Read In Telugu: The New Hyundai Creta Receives 14,366 Bookings In Ten Days Since Launch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X