ర్యాంగ్లర్ ఆఫ్ రోడర్‌ను పరీక్షిస్తున్న జీప్ ఇండియా
లగ్జరీ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం జీప్ నాలుగవ తరానికి చెందిన ర్యాంగ్లర్ ఎస్‌యూవీని ఇండియాలో పరీక్షిస్తోంది. ఇటీవల జీప్ ర్యాంగ్లర్ జేఎల్ 2-డోర్ మోడల్‌కు ఇండియన్ రోడ్ల మీద టెస్టింగ్ నిర్వహిస్తుండగా రహస్యంగ
అమెరికాకు చెందిన దిగ్గజ ఖరీదైన మరియు లగ్జరీ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం జీప్ నాలుగవ తరానికి చెందిన ర్యాంగ్లర్ ఎస్‌యూవీని ఇండియాలో పరీక్షిస్తోంది. ఇటీవల జీప్ ర్యాంగ్లర్ జేఎల్ 2-డోర్ మోడల్‌కు ఇండియన్ రోడ్ల మీద టెస్టింగ్ నిర్వహిస్తుండగా రహస్యంగా పట్టుబడింది.

ఈ మోడల్‌కు ఏఆర్ఏఐ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. కాబట్టి, జీప్ ఇండియా అతి త్వరలో జీప్ ర్యాంగ్లర్ 2-డోర్ వేరియంట్‌ను దేశీయంగా లాంచ్ చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టెస్టింగ్ నిర్వహిస్తున్న వాటిలో హార్డ్-టాప్ గల రెండు ర్యాంగ్లర్ మోడళ్లలు మరియు హార్డ్-టాప్ రూబీకాన్ మోడల్ ఉన్నాయి. పట్టుబడిన ర్యాంగ్లర్ ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్ మీద ఓవర్‌ల్యాండ్ బ్యాడ్జ్ ఉంది. బహుశా ఇది ఓవర్‌ల్యాండ్ ప్యాక్ యొక్క సహారా వేరియంట్ కావచ్చు. ఈ ఓవర్‌ల్యాండ్ ప్యాకేజీ ద్వారా ర్యాంగ్లర్ కాస్మొటిక్స్ చాలా అందంగా కనబడుతుంది.

జీప్ ర్యాంగ్లర్ ఓవర్‌ల్యాండ్ ప్యాకేజీలో బాడీ కలర్ గ్రిల్, హెడ్‌ల్యాంప్ బెజల్, విభిన్నమైన 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, బాడీ కలర్ స్పేర్ టైర్ కవర్ మరియు ఓవర్‌ల్యాండ్ బ్యాడ్జింగ్ హైలెట్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో ఆల్-బ్లాక్ థీమ్, లెథర్ సీట్లు మరియు డ్యాష్‌బోర్డు ఉన్నాయి. పరీక్షిస్తూ పట్టుబడిన మోడల్ ఆటోమేటిక్ వేరియంట్.

2018 జీప్ ర్యాంగ్లర్ జేఎల్ మోడల్‌లో సాంకేతికంగా 2.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ ఉంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 197బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. జీప్ ర్యాంగ్లర్ జేఎల్ సహారా వేరియంట్లో కమాండ్-ట్రాక్ 4X4 డ్రైవ్ సిస్టమ్ మరియు తక్కువ గేర్ రేషియో గల 2-స్పీడ్ ట్రాన్స్‌ఫర్ కేజ్ ఉంది.

2018 జీప్ ర్యాంగ్లర్ ఎస్‌యూవీ 3.6-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రల్ ఇంజన్ మరియు 2-లీటర్ 4-సిలిండర్ టుర్భో-ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో కూడా లభ్యమవుతోంది. ఇవి వరుసగా 280బిహెచ్‌పి-347ఎన్ఎమ్ మరియు 268బిహెచ్‌పి-400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. వీటిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు.

తాజాగా ఉన్న సమాచారం మేరకు, ర్యాంగ్లర్ రూబీకాన్ వేరియంట్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు తెలిసింది. రూబీకాన్ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీలో 2-స్పీడ్ ట్రాన్స్‌ఫర్ కేజ్ గల రాక్-ట్రాక్ 4X4 సిస్టమ్ ఉంది. అంతే కాకుండా, హెవీ డ్యూటీ డానా 44 ఫ్రంట్ అండ్ రియర్ యాక్సిల్ మరియు ట్రూ-లాక్ ఎలక్ట్రిక్ ఫ్రంట్- అండ్ రియర్-యాక్సిల్ లాకర్లు ఉన్నాయి.

2018 జీప్ ర్యాంగ్లర్ జీప్ జేఎల్ ఇంటీరియర్‌లో 8.4-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యావిగేషన్, 7-అంగుళాల ఎల్ఈడీ డ్రైవర్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే మరియు లెథర్ సీట్ అప్‌హోల్‌స్ట్రే వంటి ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
జీప్ ఇండియా నూతన ర్యాంగ్లర్ వేరియంట్లను పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ వచ్చింది. తాజాగా, ఏఆర్ఏఐ ఆధ్వర్యంలో సరికొత్త 2-డోర్ ర్యాంగ్లర్ జేఎస్ మోడల్‌ను పరీక్షించింది. దీనిని ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. మునుపటి ర్యాంగ్లర్‌తో పోల్చుకుంటే, సరికొత్త ర్యాంగ్లర్‌ను పూర్తి స్థాయిలో దేశీయంగా అసెంబుల్ చేయనుంది.


Click it and Unblock the Notifications








