ఇండియన్ మార్కెట్లోకి కియా తీసుకొస్తున్న కొత్త కార్లు

Written By:
Recommended Video - Watch Now!
Horrific Footage Of Volkswagen Polo Exploding At A CNG Filling Station

కియా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2018 వేదికగా కొత్త కార్లను ఆవిష్కరించనుంది. ఇండియన్ మార్కెట్లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమైన కియా మోటార్స్, ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించే కార్లను వరుసగా విడుదల చేయనుంది.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

కియా మోటార్స్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పెనుకొండ సమీపంలో తమ ప్లాంటు నిర్మాణం చేపట్టింది. ప్లాంటు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసింది. ఈ ప్లాంటు పూర్తి స్థాయిలో ప్రారంభమయితే, ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించే కార్లను ఇక్కడే తయారు చేయనుంది.

2018 ఆటో ఎక్స్‌లో కియా మోటార్స్ ఎలాంటి కార్లను పరిచయం చేస్తోందో చూద్దాం...

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

కియా పికంటో

కియా వారి అతి చిన్న కారు పికంటో. స్మాల్ హ్యాచ్‌్బ్యాక్ సెగ్మెంట్లోకి వచ్చే కియా పికంటో విపణిలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10కు సరాసరి పోటీనివ్వనుంది. నిజానికి, అంతర్జాతీయ మోడల్ గ్రాండ్ ఐ10 మరియు పికంటో కార్లు ఒకే ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించబడ్డాయి.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

హ్యుందాయ్ మరియు కియా మోటార్స్ భాగస్వామ్యపు సంస్థలు కావడంతో ఒకే ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేయబడ్డాయి. అయితే, కొలతల పరంగా గ్రాండ్ ఐ10 కంటే పికంటో కారు చిన్నగా ఉంటుంది. అంతర్జాతీయ విపణిలో ఉన్న కియా పికంటోలోని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 95ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూచేస్తుంది.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

కియా రియో

కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోని ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి రియో కారును తీసుకురానుంది. మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20 మరియు హోండా జాజ్ కార్లు ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ వర్గానికి చెందినవి.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

అంతర్జాతీయ విపణిలో ఉన్న కియా రియో పొడవు 4,065ఎమ్ఎమ్‌గా ఉంది. భారత్‌లో నాలుగు మీటర్ల లోపు ఉన్న కార్ల మీద ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, పొడవు తగ్గించి నాలుగు మీటర్లు లోపు కొలతలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. సాంకేతికంగా ఇందులో 84బిహెచ్‌పి పవర్ మరియు 122ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

కియా స్పోర్టేజ్

కియా మోటార్స్ స్మాల్ మరియు ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లతో పాటు భారత్‌లో ఉన్న జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్ మరియు హోండా సిఆర్-వి ఎస్‌యూవీలకు గట్టి పోటీనిచ్చే ఖరీదైన ప్రీమియమ్ ఎస్‌యూవీతో సవాల్ విసరనుంది.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

ధృడమైన కండలు తిరిగిన శరీరాకృతిలో అత్యుత్తమ ప్రతి రహదారిని డామినేట్ చేసే కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీ ఇండియన్ ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తనదైన ముద్ర వేసుకోనుంది. సాంకేతికంగా, ఇందులో 185బిహెచ్‌పి పవర్ మరియు 402ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ రానుంది.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

కియా సెరాటో

కియా మోటార్స్ సెరాటో సెడాన్ కారును అమెరికా విపణిలో ఫోర్తె పేరుతో విక్రయిస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఎలంట్రా, హోండా సివిక్ మరియు స్కోడా ఆక్టావియా వంటి సెడాన్ కార్ల నోరు మూయించనుంది.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

అంతర్జాతీయ విపణిలో ఉన్న కియా సెరాటో సెడాన్ కారులో ఉన్న 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ 130బిహెచ్‌పి పవర్ మరియు 157ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

కియా ఆప్టిమా

కియా ఆప్టిమా విశాలమైన క్యాబిన్ మరియు ఆకర్షణీయమైన ఫ్రంట్ డిజైన్ కలిగిన ప్రీమియమ్ సెడాన్ కారు. ఇది ఇండియన్ మార్కెట్లో ఉన్న టయోటా క్యామ్రీ, హోండా ఆకార్డ్ మరియు స్కోడా సూపర్బ్ వంటి కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న కియా ఆప్టిమా ప్రీమియమ్ సెడాన్ కారులో 143బిహెచ్‌పి పవర్ మరియు 204ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమవుతోంది.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

కియా నిరో

కియా నిరో ఒక స్మార్ట్ క్రాసోవర్ కారు, ఐదు సౌకర్యవంతంగా ప్రయాణించే క్యాబిన్, ఎన్నో ప్రీమియమ్ ఫీచర్లను కలిగి ఉన్న ఇంటీరియర్ మరియు అధునాతన స్టైలిష్ ఎక్ట్సీరియర్ డిజైన్ దీని సొంతం.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

కియా మోటార్స్ అంతర్జాతీయ మార్కెట్లో నిరో క్రాసోవర్‌ను హైబ్రిడ్ వెర్షన్‌లో విక్రయిస్తోంది. కానీ, దేశీయంగా పెట్రోల్ లేదా డీజల్ ఇంజన్ వెర్షన్‌లో లభ్యం కానుంది. కియా నిరో గ్లోబల్ వేరియంట్లో ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో గల 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ వ్యవస్థ కలదు.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

కియా సొరెంటో

సొరెంటో వెహికల్ కియా యొక్క అతి ముఖ్యమైన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ. ఇందులో 7-మంది వరకు ప్రయాణించవచ్చు. మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, కియా ఈ సొరెంటో ఎస్‌యూవీని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న ప్లాంటుకు సమీపంలో పరీక్షించింది కూడా.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

అంతర్జాతీయ విపణిలో ఉన్న కియా సొరెంటో ఎస్‌యూవీలో 2.2-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. వరుసగా, 188బిహెచ్‌పి మరియు 185బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే ఇవి 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‍‌లో లభ్యమవుతున్నాయి.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

కియా మోటార్స్ తమ స్పోర్టివ్ సెడాన్ స్టింగర్ కారును ఇండియన్ మార్కెట్లో విక్రయించబోమని స్పష్టం చేసింది. అయితే, వచ్చే ఫిబ్రవరిలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఆవిష్కరించే అవకాశం ఉంది.

కియా ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో తయారయ్యే కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా మోటార్స్ విసృత శ్రేణి మోడళ్లను ప్రదర్శించనుంది. హ్యాచ్‍‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ మరియు క్రాసోవర్ సెగ్మెంట్లలో పలు రకాల కార్లను సిద్దం చేసింది. ఈ మోడళ్లు విపణిలో ఉన్న మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా, హోండా మరియు టయోటా వంటి కార్ల కంపెనీలు విక్రయించే పలు మోడళ్లకు గట్టి పోటీనివ్వనున్నాయి.

ఆటో ఎక్స్‌పో 2018 ఫిబ్రవరి 7వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఆటో ఎక్స్‌‌పో అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Auto Expo 2018: Kia New Cars and SUVs — Here’s All You Need To Know
Story first published: Monday, January 22, 2018, 18:12 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark